Avika Gor: ఉయ్యాల జంపాల హీరోయిన్ గ్లామర్ రచ్చ.. బికినీలో కంటే మరింత అందంగా!
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా బుల్లితెరపై చాలా సింపుల్ గా కనిపించిన అవికా గోర్ ఇప్పుడు మాత్రం ఊహించని రేంజ్ లో షాక్ ఇస్తోంది. ట్రెడిషినల్ లుక్ లో మాత్రమే కాకుండా గ్లామర్ డోస్ తో కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. హాట్ హాట్ స్టిల్స్ తో అమ్మడు తన రేంజ్ ను మరింత పెంచుకుంటోంది. ఇక రీసెంట్ గా కూడా అవికా గోర్ అందాల ప్రదర్శన ఆమె ఫాలోవర్స్ ను మరింతగా ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

చైల్డ్ ఆర్టిస్ట్ గా..
మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా అవికా గోర్ చిన్నారి పెళ్లి కూతురు అనే సీరియల్ ద్వారా క్రేజ్ అందుకుంది. హిందీలోనే కాకుండా తెలుగులో కూడా ఆ సీరియల్ కు మంచి గుర్తింపు వచ్చింది. అందులో ఎన్ని క్యారెక్టర్స్ మారినా కూడా అవికా గోర్ క్యారెక్టర్ ఎక్కువగా హైలెట్ అయ్యింది. అనంతరం మరికొన్ని సీరియల్స్ తో కూడా ఆమె మంచి గుర్తింపు అందుకుంది.

ఆ సినిమాతో..
ఒకవైపు సినిమాలు మరోవైపు సీరియల్స్ చేసుకుంటూ వచ్చిన అవికా గోర్ చాలా తొందరగానే క్లిక్కయ్యింది. ఇక ఆమె అలా 20లోకి రాకముందే సినిమాల్లో మేయిన్ లీడ్ లో నటించే అవకాశాలను అందుకుంది. ముఖ్యంగా ఆమె తెలుగులో చేసిన ఉయ్యాల జంపాల సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అనంతరం సినిమా చూపిస్త మామ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వినాయన్ని సొంతం చేసుకుంది.

అలా బిజీగా..
అవికా గోర్ అనగానే తెలుగు వారికి ఎక్కువగా ఆమె నటించిన మొదటి సినిమా ఉయ్యాల జంపాల ఎక్కువగా గుర్తొస్తుంది. ఆ సినిమా తరువాత ఒక రెండు మూడు సినిమాలతో బాగానే మెప్పించిన అవికా మళ్ళీ తొందరగానే ఫామ్ ను కోల్పోయింది. ఇక బాలీవుడ్ లో కన్నడలో కూడా ఆమె అవకాశాలు అందుకునే ప్రయత్నం చేస్తోంది. అలాగే పలు వెబ్ సీరీస్ లలో కూడా నటిస్తోంది.

గ్లామర్ రచ్చ
అయితే అవికా గోర్ యాక్టింగ్ కెరీర్ విషయంలో ఎలా ఉన్నా కూడా గ్లామర్ తో మాత్రం ఊహించని విధంగా షాక్ ఇస్తోంది. వరుసగా గ్లామర్ ఫొటోలను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటోంది. రోజురోజుకు మరింత ఘాటుగా కనిపిస్తున్న అవికా గోర్ ఇటీవల మరోసారి అంతకుమించి అనేలా గ్లామర్ హీట్ తో రెచ్చిపోయింది.

బికినీ కంటే అందంగా..
నడుము అందాలను చాలా అందంగా ప్రజెంట్ చేసిన అవికా గోర్ క్లివేజ్ అందాలతో కూడా మతిపోగొట్టేసింది. గతంలో బికినిలో కూడా షాక్ ఇచ్చిన అవికా ఈ స్టైల్ లో మాత్రం ఎక్కువగా ఆకట్టుకుంటోంది అని నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా అవికా చాలా బ్యూటీఫుల్ గా మారిపోయిందని కూడా చెబుతున్నారు.

రాబోయే సినిమాలు
ఇక అవికా గోర్ సినిమాల విషయానికి వస్తే.. నాగచైతన్య థాంక్యూ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించిన అవికా టెన్త్ క్లాస్ డైరీస్ అనే మరో తెలుగు సినిమాలో కూడా నటిస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్ లు సమ్మర్ అనంతరం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అలాగే బాలీవుడ్ లో కూడా హారర్ మూవీ చేస్తోంది. మరి ఆ ప్రాజెక్టులు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











