చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్ మరోసారి రెచ్చిపోయిందిగా.. ప్యాంట్ లేకుండా ఘాటుగా..

టీవీ సీరియల్స్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న వారిలో అవికాగోర్ ఒకరు. పదేళ్ల వయసులోకి రాకముందే కెమెరా ముందుకు వచ్చిన అవికా ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ కు కూడా చాలా తొందరగానే ఎంట్రీ ఇచ్చింది. అలాగే టీవీ షోలతో తన క్రేజ్ ను మెల్లగా పెంచుకుంటూ వచ్చింది. ఇక సోషల్ మీడియాలో కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా అవికా గోర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగిందనే చెప్పాలి.

ఆమె గ్లామర్ విషయంలో కూడా మెల్లగా డోస్ పెంచుతోంది. రీసెంట్ గా ఒక ఫోటో షూట్ చేసిన అవికాగోర్ అందులో కేవలం ఒక నల్లని చొక్కతో ప్యాంట్ లేకుండా దర్శనమిచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే....

సీరియల్స్ తోనే..

సీరియల్స్ తోనే..

2008లో వచ్చిన బాలికా వధు (చిన్నారి పెళ్ళికూతురు) సీరియల్ ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సీరియల్ లో రెండేళ్లపాటు నటించిన అవికా గోర్ ప్రేక్షకుల్లో చిరస్థాయిగా మంచి గుర్తింపును అందుకుంది. ఆ తర్వాత ఆమె టెలివిజన్ కు వీలైనంత దగ్గరగా ఉండే ప్రయత్నం చేసి దాదాపు స్టార్స్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోవర్స్ ను పెంచుకుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రేక్షకుల్లో ఆమెతో ఫోటోలు దిగింది ఎగబడుతున్నారు.

అలా మొదటి సినిమా..

అలా మొదటి సినిమా..

కేవలం సీరియల్స్ తోనే కాకుండా సినిమాలతో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. తెలుగులో ఆమె మొదట చేసిన ఉయ్యాల జంపాల సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ ను అందుకుంది. ఆ సినిమాలో రాజ్ తరుణ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా సక్సెస్ కావడంతో తెలుగులో చాలా అవకాశాలు వచ్చాయి. ఇక అవికా ఏ మాత్రం తొందర పడకుండా తనకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లింది.

బాక్సాఫీస్ హిట్స్

బాక్సాఫీస్ హిట్స్

తెలుగులో మరోసారి రాజ్ తరుణ్ తోనే ఆమె చేసిన సినిమా చూపిస్త మామ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా కూడా విజయాన్ని అందుకోవడంతో అవికా గోర్ కు మరిన్ని అవకాశాలు వచ్చాయి. కానీ ఆ సమయంలోనే ఆమె చాలా బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. హిందీలో ఆమె కి మంచి సీరియల్స్ ఆఫర్స్ రావడంతో తెలుగు సినిమాలకు దాదాపు మూడు ఏళ్ళ వరకు దూరంగా ఉండింది.

ఇప్పుడు నాగచైతన్య సినిమాలో..

ఇప్పుడు నాగచైతన్య సినిమాలో..

ఇక చాలా కాలం తర్వాత రాజు గారి గది త్రీ సినిమాలో కనిపించింది ఆ తర్వాత నెట్, బ్రో అనే సినిమాలతో కూడా మంచి క్రేజ్ ఉంది. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు వెబ్ సిరీస్ లో కూడా చేసే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం నాగచైతన్యతో థాంక్యూ అనే సినిమాలో నటిస్తోంది విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో రాసి కన్నా మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో అవికాగోర్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతుందని సమాచారం.

Recommended Video

C Kalyan : ఒక్కడితో సక్సెస్ రాదు.. మేమంతా బ్యాచ్ | 10th Class Diaries Teaser | Filmibeat Telugu
ప్యాంట్ లేకుండా.. కేవలం షర్ట్ లోనే..

ప్యాంట్ లేకుండా.. కేవలం షర్ట్ లోనే..

అయితే ఇటీవల అవికాగోర్ ఎవరూ ఊహించని విధంగా దర్శనమిచ్చింది. ఒక నల్లని షర్ట్ లో ఆమె చాలా హాట్ గా కనిపించింది. ప్యాంట్ లేకుండా కాస్త క్లివేజ్ షోను కూడా జతచేసిన అవికాగోర్ ఓ వర్గం ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగించింది అని చెప్పాలి. ఫొటో పోస్ట్ చేయగానే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చూస్తుంటే అమ్మడు త్వరలోనే మరిన్ని హాట్ ఫొటోలతో షాక్ ఇచ్చేలా ఉందని అనిపిస్తోంది. ఇక ప్రస్తుతం అమ్మడు హిందీలోనే కాకుండా టాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు అందుకునే ప్రయత్నం చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X