చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ అవికా గోర్ షాకింగ్ లుక్.. మరీ ఇలా మారిపోయిందేంటి?
అవికా గోర్ తెలుగులో ఎక్కువ సినిమాలు చేయకపోయినప్పటికి చేసిన కొన్ని సినిమాలతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది. ముఖ్యంగా చిన్నారి పెళ్లి కూతురు సిరియల్ తో ఒకప్పుడు టీవీ ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యింది. ఈ నార్త్ బ్యూటీ వయసు ఎక్కువవుతున్నకొద్దీ ఊహించని లుక్స్ లోకి మారుతోంది. ఇక ఇటీవల ఒక సినిమా షూటింగ్ లో కనిపించిన అవికా చాలా డిఫరెంట్ గా మారిపోయినట్లు అనిపించింది.

రిజల్ట్ తో సంభంధం లేకుండా..
స్టార్ హీరోలతో పెద్దగా అవకాశం అందుకోకపోయినా కూడా కొంతమంది హీరోయిన్స్ ను ప్రేక్షకులు అంత ఈజీగా మరచిపోలేరు. అలాంటి క్యాటగిరిలోకి చెందిన బ్యూటీలలో అవికా గోర్ ఒకరు. నార్త్ బ్యూటీ అయినప్పటికీ మొదట్లో ఆమెను తెలుగమ్మాయని అనుకున్నారు. సక్సెస్ ఫెయిల్యూర్స్ సంభంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెలుతోంది.

ఆ సినిమా హిట్టుతో..
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా ఆల్రెడీ ఫ్యామిలీ ఆడియేన్స్ కు దగ్గరైన అవికా చాలా కాలం తరువాత ఉయ్యాల జంపాల సినిమాతో మెయిన్ హీరోయిన్ గా మంచి ఎంట్రీ ఇచ్చింది. సినిమా చూపిస్త మావ సినిమా అయితే బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్ అందుకోవడంతో అప్పట్లో ఆఫర్స్ చాలానే వచ్చాయి.

హోమ్లీ పాత్రలతో..
అయితే అవికా స్థాయి కేవలం చిన్న బడ్జెట్ సినిమాల వరకే పతిమితం అయ్యింది. అయితే రెమ్యునరేషన్ కు ఆశపడి ఈ బ్యూటీ గ్లామర్ గీతను ఏ మాత్రం దాటలేదు. బోల్డ్ రోల్స్ చేయడానికి పెద్దగా ఒప్పుకోలేదు. చేసింది చిన్న సినిమాలే అయినా కాంటెంట్ ఉన్న హోమ్లీ పాత్రలతో మెప్పించింది. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వస్తోంది.

అవికా న్యూ షాకింగ్ లుక్
అంతా బాగానే ఉంది గాని అవికా లేటెస్ట్ లుక్ చూసి కొంతమంది షాక్ అవుతున్నారు. సినిమా చూపిస్తా మావ సినిమాలో క్యూట్ గర్ల్ గా కనిపించిన అవికా ఇప్పుడు ఆ రేంజ్ లో కనిపించడం లేదు. కాస్త సన్నబడినట్లు తెలుస్తోంది. ఫేస్ కూడా మారిపోయింది. దీంతో నెటిజన్లు ఇలా అయిపోయింది ఏమిటి అని కామెంట్ చేస్తున్నారు. రాబోయే సినిమాలో అవికా రెండు విభిన్నమైన గెటప్స్ తో కనిపించనుందట. ఆ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకోవాలని చూస్తోంది.
Recommended Video

న్యూ ప్రొడక్షన్ హౌజ్
ఇక రీసెంట్ గా అవికా న్యూ ప్రొడక్షన్ హౌజ్ ను స్టార్ట్ చేసింది. ఒక మినీ బడ్జెట్ సినిమాను నిర్మించడానికి కూడా సిద్ధమైంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఆ సినిమాను సహా నిర్మాతగా కొనసాగేందుకు రెడీ అయ్యింది. మురళీ నాగ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఆ సినిమాలో సాయి రోవర్, అవికా గోర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











