కింగ్డమ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకు బంపర్ ఆఫర్.. 800 కోట్ల ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ!
టాలీవుడ్ లో రూపుదిద్దుకున్న లేటెస్ట్ ఫిల్మ్ కింగ్డమ్. ఈ చిత్రంలో స్టార్ హీరో విజయ్ దేవరకొండ - యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించారు. ఈ సినిమా జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు ఇతర భాషలతోనూ, ఓవర్సీస్ లోనూ గ్రాండ్ గా విడుదలైంది. విజయ్ దేవరకొండకు ధీటుగా భాగ్యశ్రీ బోర్సే తన పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా భాగ్యశ్రీకి టాలీవుడ్ స్టార్ రాబోయే బిగ్ ప్రాజెక్ట్ లో అవకాశం దక్కిందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
టాలీవుడ్ లో సెన్సేషన్ గా..
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కొత్త హీరోయిన్స్ తెగ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే తెలుగు ప్రేక్షకుల దృష్టిని తనపై పడేలా చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ తెలుగు చిత్రాల్లో అవకాశం అందరూ సెన్సేషన్ గా మారుతోంది. ఇప్పటికే మాస్ మహా రాజా సరసన మిస్టర్ బచ్చన్ చిత్రంలో నటించడం విశేషం. టాలీవుడ్ లో అదే ఆమెకు తొలి చిత్రం. అంతకు ముందు హిందీలో యారియాన్ 2, చందు ఛాంపియన్ చిత్రాలతో అటు నార్త్ ఆడియెన్స్ లోనూ మంచి క్రేజ్ దక్కించుకుంది.

కింగ్డమ్ తో ఫస్ట్ హిట్..
విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కింగ్డమ్ చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంతో అటు చాలా గ్యాప్ తర్వాత విజయ్ కు, టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే రైజ్ అవుతున్న భాగ్యశ్రీకి తొలి హిట్ పడింది. కింగ్డమ్ చిత్రానికి కాస్తా నెగెటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వసూళ్ల బాక్సాఫీస్ రెస్పాన్స్ మాత్రం మంచిగానే కనిపిస్తోంది. ఓపెనింగ్ డే ఈ చిత్రానికి రూ.39 కోట్ల గ్రాస్ వరల్డ్ వైడ్ గా దక్కడం విశేషం. ఇది విజయ్ దేవరకొండ కెరీర్ లో హ్యాయేస్ట్ అని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.
భాగ్యశ్రీకి బంపర్ ఆఫర్..
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకు మరో బంపర్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో దర్శక నిర్మాతల చూపు ఈ ముద్దుగుమ్మపైనే ఉండింది. ఈ క్రమంలో భారీ ఆఫర్ తగిలిందని ప్రచారం. ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్ లో రూపుదిద్దుకోబోతున్న AA22xA6 ప్రాజెక్ట్ లో భాగ్యశ్రీ ఎంపికైందని ఇన్ సైడ్ టాక్. కానీ మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ లేదు. ఇక ఈ ప్రాజెక్ట్ ఏకంగా 800 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపుదిద్దుకోబోతుండటం విశేషం.
AA22xA6 ప్రాజెక్ట్ కోసం ఏకంగా 5గురు హీరోయిన్లను ఎంపిక చేశారంట కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ. అందులో మెయిన్ హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెను ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. మిగితా నలుగురు హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్ కన్ఫమ్ అయ్యిందని స్ట్రాంగ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్న, జాన్వీ కపూర్ తో పాటు భాగ్యశ్రీని కూడా ఎంపిక చేశారని అంటున్నారు. దీనిపై మున్ముందు ఎలాంటి అప్డేట్ అందుతుందనేది వేచి చూడాలి. ఈ చిత్రం కోసం హాలీవుడ్ టాప్ టెక్నీషియన్లు వర్క్ చేస్తుండటం విశేషం.


Click it and Unblock the Notifications











