విమానంలోంచి దూకిన భాగ్యశ్రీ.. హీరోలే వణికిపోయే రిస్కీ స్టంట్‌తో సాహసం!
సినిమాలలో హీరోలు ఎన్నో రిస్కీ స్టంట్స్ చేస్తుంటారు. కొందరు బిల్డింగ్స్ మీద నుంచి దూకితే, మరికొందరు రైళ్లు, విమానాలు, హెలికాఫ్టర్ల నుంచి అలవోకగా దూకేస్తారు. కొందరు ఇందుకోసం డూప్స్‌ను వినియోగిస్తే మరికొందరు మాత్రం ప్రమాదమని తెలిసినా వారే ఈ షాట్స్ చేస్తారు. ఇప్పుడు కాలం మారింది.. హీరోలే కాదు హీరోయిన్లు కూడా రిస్కీ స్టంట్స్ చేస్తూ మగాళ్లకు మేం ఏమాత్రం తక్కువ కావడం లేదని ప్రూవ్ చేస్తున్నారు. యాక్షన్ సినిమాల తాకిది దీనికి కారణం కావొచ్చు.. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఓ స్టంట్ చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
మోడల్ టూ హీరోయిన్
టాలీవుడ్‌లో దిగిన ఉత్తరాది అందం భాగ్యశ్రీ బోర్సే. తొలి సినిమాతోనే యూత్‌ను కట్టిపడేశారు భాగ్యశ్రీ. కలువల్లాంటి కళ్లు, వైట్ స్కిన్‌టోన్, మంచి ఫిజిక్‌తో మెస్మరైజింగ్ చేస్తున్నారు భాగ్యశ్రీ బోర్సే. మోడలింగ్ నుంచి ఇండస్ట్రీ వైపు అడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ.. 2023లో యారియన్ 2 అనే హిందీ సినిమాతో ముఖానికి మేకప్ వేసుకున్నారు. తొలి సినిమాతోనే బంపర్ హిట్ అందుకున్న భాగ్యశ్రీకి ఆ వెంటనే బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన చందు ఛాంపియన్‌లో నటించే ఛాన్స్ దక్కింది. భాగ్యశ్రీ అందాలు .. టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కంటికి చిక్కాయి.

మిస్టర్ బచ్చన్‌తో టాలీవుడ్‌లోకి
మాస్ మహారాజా రవితేజతో హరీశ్ తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్ సినిమాలో భాగ్యశ్రీని హీరోయిన్‌గా ఎంపికయ్యారు. సినిమా రిలీజ్ కంటే ముందే లంగా ఓణీలో భాగ్యశ్రీ అందాలు జనాల్లోకి వెళ్లాయి. పాటల్లో భాగ్యశ్రీని మరింత అందంగా చూపించడంతో టాలీవుడ్‌లోకి మరో కొత్త స్టార్ హీరోయిన్ దిగిందని ప్రేక్షకులు భావించారు. దురదృష్టవశాత్తూ ఈ సినిమా ఫ్లాప్ అయినా భాగ్యశ్రీకి మాత్రం అవకాశాలు క్యూకట్టాయి. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. అలాగే రామ్ పోతినేనితో ఓ సినిమా, విజయ్ దేవరకొండతో కింగ్‌డమ్‌లో నటిస్తోంది.
రామ్ పోతినేనితో భాగ్యశ్రీ డేటింగ్?
ఇంతలోనే భాగ్యశ్రీ గురించి ఓ న్యూస్ వైరల్ అయ్యింది. రామ్ పోతినేనితో ఈ ముద్దుగుమ్మ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారని ఊహాగానాలు వినిపించాయి. ఇక భాగ్యశ్రీ పుట్టినరోజు నాడు రామ్ చేసిన ట్వీట్ వీటికి మరింత బలాన్ని చేకూర్చినట్లయ్యింది. అంతకుముందు వీరిద్దరూ విడివిడిగా పోస్ట్ చేసిన ఫోటోల్లోని బ్యాక్‌గ్రౌండ్స్ ఒకేలా ఉండటం కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఇంత జరుగుతున్నప్పటికీ భాగ్యశ్రీ కానీ, రామ్ కానీ ఏమాత్రం స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇక కింగ్‌డమ్‌లో విజయ్ దేవరకొండతో ఘాటుగా లిప్‌లాక్ ఇచ్చి మరింత రచ్చలేపింది భాగ్యశ్రీ.
విమానంలో నుంచి దూకేసిన భాగ్యశ్రీ
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే భాగ్యశ్రీ బోర్సే ఎప్పటికప్పుడు తన సినిమాలు, ఇతర వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ప్రస్తుతం దుబాయ్ ట్రిప్‌లో ఉన్న భాగ్యశ్రీ విమానంలో నుంచి దూకి స్క్రై డ్రైవ్ చేశారు. ఆకాశంలో కిలోమీటర్ల ఎత్తులో కాసేపు విహరించి అనంతరం సేఫ్‌గా కిందకి దిగారు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన భాగ్యశ్రీ.. దానికి ఒకటే లైఫ్, ఒకటే శ్వాస, ఒకటే జంప్ అనే క్యాప్షన్‌ను జత చేశారు. అయితే ఇలాంటి రిస్కీ స్టంట్స్ చేయాలంటే ఎంతో గుండె ధైర్యం, తెగువ కావాలి.. మగవాళ్లే ఇలాంటివి చేయాలంటే భయపడతారు. అలాంటి ఓ ఆడపిల్లి ఇలాంటి సాహసం చేయడంతో భాగ్యశ్రీని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


Click it and Unblock the Notifications











