నన్ను, నా పేరును అలా దుర్వినియోగం చేయొద్దు.. హెచ్చరించిన నటి భావన
సినీ తారలకు, ఇతర సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఇటీవల చేదు అనుభవాలు ఎక్కువగానే ఎదురువుతున్నాయి. హ్యాకింగ్ గురి కావడం, అపరచిత వ్యక్తుల నుంచి ట్రోలింగ్‌కు గురికావడం లాంటి సంఘటనలతో తారలు షాక్ గురవుతున్నారు. ఇటీవల హీరోయిన్ కుష్బూ, శోభన లాంటి వారి అకౌంట్లు హ్యాకింగ్ గురికావడం తెలిసిందే. తాజాగా మలయాళ నటి భావనకు ఫేస్‌బుక్‌లో తన పేరును దుర్వినియోగం చేయడాన్ని ఆమె స్పందించారు.
ఇటీవల తన పేరుతో ఉన్న ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా తన ఇన్స్‌టాగ్రామ్ పేజ్ ఫోటోను పెట్టి లైక్ చేయమని అడగడంపై నటి భావన స్పందించారు. తనకు ఫేస్‌బుక్‌లో అకౌంట్ లేదని, ఎవరో తన పేరుతో క్రియేట్ చేసి దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి అభిమానులు ఈ పేజ్ ఫేక్ అని రిపోర్ట్ చేయండి అంటూ ఓ మెసేజ్ పెట్టారు.

ఇక భావన కెరీర్ విషయానికి వస్తే .. పలు ప్రాజెక్టులతో ఆమె బిజీగా ఉన్నారు. కన్నడలో పృథ్వీరాజ్‌తో కలిసి ఆడమ్ జాన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఆమె నటించిన 99 చిత్రం విడుదలైంది. ఈ చిత్రం తమిళ మూవీ 96కు రీమేక్‌గా రూపొందింది.
ఈ మధ్యకాలంలో కుష్బూ ట్విట్టర్ అకౌంట్‌ను కొందరు గుర్తు తెలియని హ్యాక్ చేయడాన్ని ఆమె వెల్లడించారు. అలాగే శోభన ఫేస్‌బుక్ అకౌంట్ కూడా హ్యకింగ్‌కు గురైంది. అలాగే బాలీవుడ్‌లో కూడా కొందరి అకౌంట్లను హ్యాకింగ్ కావడంతో పలువురు సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేశారు.


Click it and Unblock the Notifications











