Bhumika Chawla: పొట్టి గౌనులో భూమిక గ్లామర్ ట్రీట్.. వయసుకి మించిన పరువాలతో!
హీరోయిన్ గా ఒకప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను అందుకున్న వారిలో భూమిక చావ్లా ఒకరు. హిందీ, తెలుగు, తమిళం పంజాబీ చిత్ర పరిశ్రమలలో పనిచేసిన ఆమె కెరీర్ లో ఎన్ని హిట్ సినిమాలు ఉన్నాయి. ఇక హీరోయిన్ గా సినిమాలు తగ్గిన తరువాత వయసుకు తగ్గ క్యారెక్టర్స్ చేస్తోంది. అలాగే అప్పుడప్పుడు గ్లామర్ తో కూడా షాక్ ఇస్తోంది. రీసెంట్ గా థైస్ అందాలు కనిపించేలా చిన్న గౌనులో దర్శనమిచ్చింది. ఆ ఫొటోల వివరాల్లోకి వెళితే..

సినిమా రంగంలోకి రాకముందు..
భూమిక 1978 ఆగస్టు 21 న్యూఢిల్లీలో పంజాబీ కుటుంబంలో జన్మించింది. ఇక అనంతరం ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్న ఆమె తర్వాత విశ్వవిద్యాలయం నుండి కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. చావ్లా సినిమా రంగంలోకి రాకముందు మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆమె 2000వ సంవత్సరంలో "యువకుడు" అనే తెలుగు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది.

టాప్ సినిమాలు
అవకాశం వచ్చినా ప్రతీసారి చావ్లా డిఫరెంట్ చిత్రాలను ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంది. ఒక్కడు, ఖుషి, సింహాద్రి, మిస్సమ్మ, అనసూయ వంటి అనేక విజయవంతమైన తెలుగు చిత్రాలలో నటించింది. చావ్లా తమిళం అలాగే పంజాబీ చిత్రాలలో కూడా నటించారు. ఈ బ్యూటీ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమాలలో ఖుషి, ఒక్కడు టాప్ లిస్టులో ఉంటాయి.

హిందీలో కూడా..
ఇక సల్మాన్ ఖాన్ సరసన 2003లో "తేరే నామ్" సినిమాలో నటించిన భమిక మంచి క్రేజ్ అందుకుంది. ఈ చిత్రం కమర్షియల్ గా విజయం సాధించింది. చావ్లా నటనకు విస్తృతంగా ప్రశంసలు లభించాయి. అనంతరం బాలీవుడ్ లోనే రన్, దిల్ నే జిసే అప్నా కహా, ఫ్యామిలీ - టైస్ ఆఫ్ బ్లడ్, గాంధీ, మై ఫాదర్ వంటి పలు హిందీ చిత్రాలలో నటించింది.

అద్భుతమైన నటనతో..
భూమికా చావ్లా అద్భుతమైన నటనతో పలు సినిమాలకు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. 2003లో "మిస్సమ్మ" లో ఆమె అద్భుతమైన నటన తీరుపై ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు. అలాగే 2007లో వచ్చిన "సత్యభామ" లో కూడా ఆమె నటనకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డుతో పాటు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది.

వయసుకు తగ్గ పాత్రలు
ఇక భూమిక హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తరువాత త ఆ వయసుకు తగ్గ పాత్రలు చేసుకుంటూ వస్తోంది. ధోని బయోపిక్ లో సిస్టర్ పాత్రలో నటించిన ఆమె ఆ తరువాత టాలీవుడ్ యువ హీరో నాని MCA సినిమాలో వదిన పాత్రలో నటించి మెప్పించింది. రొటీన్ క్యారెక్టర్స్ కాకుండా ఎక్కువగా ఆమె విభిన్నమైన పాత్రలను సెలెక్ట్ చేసుకుంటోంది.

పొట్టి గౌనులో హాట్ షో
ఇక భూమికా చావ్లా వయసు 44 దాటినా కూడా ఇంకా ఆమె తన గ్లామర్ తో ఆశ్చర్యపరుస్తునే ఉంది. ఇక ఇటీవల కాలంలో రీసెంట్ గా ఈ సీనియర్ నటి ఒక పొట్టి గౌనులో ఊహించని విధంగా కనిపించింది. తన థైస్ అందాలు కనిపించేలా సోఫాపై భూమికా అందంగా నవ్వుతూ కనిపించింది.

పాజిటివ్ కామెంట్స్
ప్రస్తుతం భూమిక ఫొటోలు ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ అవుతున్నాయి. గతంలో పొట్టి డ్రెస్ లలో చాలాసార్లు కనిపించినా కూడా ఈ రేంజ్ లో ఆకట్టుకోలేదు అని నెటిజన్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక భూమికా ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా పెద్ద సినిమాలలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయితే చేస్తోంది.


Click it and Unblock the Notifications











