Bhumika Chawla : 46 ఏళ్ల వయసులో భూమిక సాహసం .. ఏకీపారేస్తోన్న నెటిజన్లు

అమాయకమైన చూపు , ప్రశాంతమైన ఫేస్‌తో చెరగని చిరునవ్వుతో చూడటానికి పక్కింటి అమ్మాయిలా కనిపించే భూమిక చావ్లా ఒకప్పుడు టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపారు . ఉత్తరాది అమ్మాయే అయినా తెలుగు చిత్రాలతోనే స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు. తోటీ హీరోయిన్ల మాదిరిగా క్లీవేజ్ షో చేయకుండా ట్రెడిషనల్ వేర్‌లోనే పద్ధతిగా కనిపించేవారు భూమిక. తర్వాత కొత్త అమ్మాయిల రాకతో ఆమెకు అవకాశాలు తగ్గాయి . సీనియర్ హీరోయిన్లంతా ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో బిజీగా మారుతుండటంతో తను కూడా ఆ వైపు ట్రై చేస్తోంది.

1978 ఆగస్ట్ 21న ఢిల్లీలో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు భూమిక చావ్లా. ఆమె తండ్రి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. భూమికకు అన్న, అక్క ఉన్నారు. విద్యాభ్యాసం తర్వాత తన మకాం ముంబైకి మార్చిన ఆమె పలు వాణిజ్య ప్రకటనల్లోనూ, మ్యూజిక్ వీడియోల్లోనూ నటించారు. ఈ క్రమంలోనే జీ టీవీలో టెలికాస్ట్ అయినా హిప్ హిప్ హుర్రే, స్టార్ బెస్ట్ సెల్లర్స్‌ వంటి సీరిస్‌లలో భూమిక మెరిశారు. ఈ ఫేమ్‌తో ఆమెకు సినిమాల్లో అవకాశాలు రావడం మొదలైంది.

actress bhumika chawla rides a Harley Davidson bike video goes viral

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై కింగ్ అక్కినేని నాగార్జున నిర్మించిన యువకుడు చిత్రం ద్వారా భూమిక వెండితెరపై అడుగుపెట్టారు. అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కానీ భూమిక అందం, నటన కుర్రకారును ఆకర్షించింది. ఆ వెంటనే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ - ఎస్‌జే సూర్యల కాంబినేషన్‌లో తెరకెక్కిన ఖుషి బ్లాక్‌బస్టర్ కావడంతో ఆమె దశ తిరిగిపోయింది.

ఈ క్రమంలో సింహాద్రి, ఒక్కడు, వాసు, స్నేహమంటే ఇదేరా, జై చిరంజీవా, సాంబ, నా ఆటోగ్రాఫ్ వంటి సినిమాలలో నటించి అగ్ర కథానాయకగా వెలుగొందారు. లేడి ఓరియెంటెడ్ మూవీస్‌కి ఆదరణ తగ్గుతున్న దశలో ఈ తరహా సినిమాలకు ట్రెండ్ సెట్ చేశారు భూమిక. మిస్సమ్మ, సత్యభామ, అనసూయ, అమరావతి వంటి సినిమాలు ఘన విజయం సాధించి ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. తెలుగులో అవకాశాలు తగ్గుతున్న దశలో తమిళ ఇండస్ట్రీని కూడా ఒక చూపు చూసింది కానీ ఎందుకో కోలీవుడ్ భూమికకు అంతగా కలిసిరాలేదు. హిందీలో తెరేనామ్, రన్ వంటి చిత్రాల్లో నటించింది.

తన చిరకాల స్నేహితుడు, ప్రముఖ యోగా గురు భరత్ ఠాకూర్‌ను 2007లో ప్రేమ వివాహం చేసుకున్నారు భూమిక చావ్లా. పెళ్లి తర్వాత కాస్త బ్రేక్ ఇచ్చిన భూమిక సెకండ్ ఇన్నింగ్స్‌లో తన వయసు, ఇమేజ్‌కి తగిన పాత్రలే చేస్తున్నారు భూమిక. ఎంఎస్ ధోని బయోపిక్, మిడిల్ క్లాస్ అబ్బాయి (ఎంసీఏ) వంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలు, సినిమాల సంగతులను పంచుకుంటున్నారు . తాజాగా 46 ఏళ్ల వయసులో హార్లే డేవిడ్సన్ బైక్‌ను నడిపి సంచలనం సృష్టించారు భూమిక. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వయసులోనూ మీరు ఏమాత్రం తగ్గడం లేదని కొందరు చెబుతుండగా.. బండి నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలని తెలియదా అంటూ ఇంకొందరు ఫైర్ అవుతున్నారు.

More from Filmibeat

Read more about: bhumika chawla harley davidson
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X