46 ఏళ్ల వయసులోనూ అవే కొలతలు..తరగని అందంతో పవన్ హీరోయిన్ మెస్మరైజింగ్ లుక్స్
అమాయకమైన చూపు, ముఖంపై చెరగని చిరునవ్వుతో ఒక తరం యువతకు నిద్రలేకుండా చేసింది భూమిక చావ్లా . ఉత్తరాది అమ్మాయే అయినా తెలుగు చిత్రాలతోనే స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. క్లీవేజ్ షోకు దూరంగా సాంప్రదాయబద్ధమైన దుస్తుల్లోనే పద్ధతిగా కనిపించేవారు భూమిక. తర్వాత కొత్త అందాల రాకతో ఆమె జోరు తగ్గింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో మిగిలిన సీనియర్ హీరోయిన్ల మాదిరిగా బిజీ అవ్వాలని భూమిక ప్రయత్నిస్తున్నారు.
కింగ్ అక్కినేని నాగార్జున నిర్మించిన యువకుడు చిత్రం ద్వారా భూమిక వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కానీ భూమిక అందం, నటన కుర్రకారును ఆకర్షించింది. ఆ వెంటనే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ - ఎస్‌జే సూర్యల కాంబినేషన్‌లో తెరకెక్కిన ఖుషి బ్లాక్‌బస్టర్ కావడంతో ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు.

ఈ క్రమంలో సింహాద్రి, ఒక్కడు, వాసు, స్నేహమంటే ఇదేరా, జై చిరంజీవా, సాంబ, నా ఆటోగ్రాఫ్ వంటి సినిమాలలో నటించి అగ్ర కథానాయకగా వెలుగొందారు. లేడి ఓరియెంటెడ్ మూవీస్‌కి వన్నె తగ్గుతున్న దశలో ఈ తరహా సినిమాలకు మళ్లీ జీవం పోశారు భూమిక. మిస్సమ్మ, సత్యభామ, అనసూయ, అమరావతి వంటి సినిమాలు ఘన విజయం సాధించి ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అదే సమయంలో తమిళంలోనూ తన లక్ పరీక్షించుకోవాలని భావించింది. కానీ ముద్దుగా బొద్దుగా ఉండే అమ్మాయిలను ఇష్టపడే తమిళ తంబిలకు ఆమె అంతగా కనెక్ట్ కాలేదు.
హిందీలో తెరేనామ్, రన్ వంటి చిత్రాల్లో నటించింది. నటిగానే కాకుండా సాహిత్యాన్ని ఇష్టపడే ఆమె తీరిక వేళలల్లో పద్యాలు , పాటలు రాస్తుంటారు. దాదాపు 100కు పైగానే పోయంస్ రాసిందట. తన చిరకాల స్నేహితుడు, యోగా గురు భరత్ ఠాకూర్‌ను 2007లో ప్రేమ వివాహం చేసుకున్నారు భూమిక చావ్లా. పెళ్లి తర్వాత ఆమెకు అవకాశాలు తగ్గాయి. సెకండ్ ఇన్నింగ్స్‌లో తన వయసు, ఇమేజ్‌కి తగిన పాత్రలే చేస్తున్నారు భూమిక. ఎంఎస్ ధోని బయోపిక్, మిడిల్ క్లాస్ అబ్బాయి (ఎంసీఏ) వంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి.
ఇటీవలి కాలంలో వరుసగా హాట్ హాట్ ఫోటో షూట్లతో సెగలు రేపుతోంది భూమిక. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలు, సినిమాల సంగతులను పంచుకుంటున్నారు . తాజాగా దుబాయ్ ట్రిప్‌కు వెళ్లిన వీడియోలు, ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. బ్లాక్ గగుల్స్ పెట్టి, లాంగ్ ఫ్రాగ్‌లో తళుక్కుమన్నారు భూమిక. దుబాయ్‌లోని ప్రఖ్యాత తాజ్ హోటల్‌లో బస చేసిన ఆమె రాత్రి వేళ బుర్జ్ ఖలీఫా ఏరియాలో చక్కర్లు కొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ చూసేయండి.


Click it and Unblock the Notifications











