యువకులతో రొమాన్స్ పై క్లారిటీ ఇచ్చిన భూమిక.. అలా చేస్తే తప్పేముంది అంటూ..

ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్స్ ఎలాంటి విషయాన్ని అయినా సరే చాలా ఓపెన్ గా తెలియజేస్తున్నారు. కాంట్రవర్సీ విషయాలపై కూడా చాలా దీటుగా సమాధానం చెబుతూ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నారు. మరికొందరు మాత్రం సెన్సిటివ్ విషయాలపై ఎంత స్పందించాలో అంతే స్పందిస్తూ మరింత ఆలోచింపజేస్తున్నారు.

ఇక మీడియాలో ఎక్కువగా కాంట్రవర్సీ విషయాలతో భూమిక అయితే క్రేజ్ అందుకోలేదు. కానీ ఈసారి ఆమె చేసిన కొన్ని కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా యువకులతో రొమాన్స్ అనే టాపిక్ పై ఆమె స్పందించే విధానం అందరికీ ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ వివరాల్లోకి వెళితే...

actress bhumika chawla shocking comments on romantic scenes with young actors

ఆ ఒక్క సినిమాతో స్టార్ ఇమేజ్: టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ భూమిక. యువకుడు మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాతో స్టార్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్, భూమిక మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్ కి ఇప్పటికి మంచి ఫ్యాన్స్ ఉన్నారు.

actress bhumika chawla shocking comments on romantic scenes with young actors

వివిధ రకాల డిఫరెంట్ సినిమాలు: ఆమె చేసిన లవ్ స్టోరీస్ లో ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి. తరువాత ఎన్టీఆర్ కి జోడీగా సింహాద్రి, నరసింహుడు సినిమాలలో భూమిక నటించారు. అలాగే అనసూయ, అనుమానాస్పదం లాంటి ఫీమేల్ సెంట్రిక్ కథలతో కూడా ఈ బ్యూటీ సత్తా చాటారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ కేటగిరీలోకి వెళ్ళిపోయిన ఈ అమ్మడు రీసెంట్ గా హిందీ చిత్రం కిసీకి జాన్ కిసీకా భాయ్ లో నటించారు.

actress bhumika chawla shocking comments on romantic scenes with young actors

ఆ విషయంలో భూమిక క్లారిటీ: ఈ మూవీలో వెంకటేష్ కి జోడీగా భూమిక కనిపించారు. ఇక తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినిమాలలో ఏజ్ ఎక్కువ ఉన్న హీరోయిన్స్, యంగ్ హీరోల కాంబోలో మూవీస్ రావడం అనేది జరగదు. కాని ప్రియాంక చోప్రా, నిక్కీ జోనస్, మలైకా అరోరా, అర్జున్ కపూర్ జంటలని సమాజం యాక్సప్ట్ చేసింది.

మార్పు రావాల్సిన అవసరం ఉంది: అయితే మూవీస్ లో మాత్రం హీరోలు ఎంత వయస్సు వచ్చిన ఇంకా హీరోలుగానే కొనసాగుతారు. కానీ హీరోయిన్స్ పరిస్థితి అలా ఉండదు. ఈ రకమైన కల్చర్ లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. డిజిటల్ వెబ్ సిరీస్ లు వచ్చిన తర్వాత సీనియర్ కథానాయకులకి ప్రాధాన్యత లభిస్తుంది. కానీ సినిమాలలో ఇప్పటికి సైడ్ క్యారెక్టర్స్ కి పరిమితం అవుతున్నారు.. అని తెలిపింది.

actress bhumika chawla shocking comments on romantic scenes with young actors

కుర్ర హీరోలతో ఆన్ స్క్రీన్ పై రొమాన్స్: అవకాశం వస్తే మేము కూడా కుర్ర హీరోలతో ఆన్ స్క్రీన్ పై రొమాన్స్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. అయితే అలాంటి పాత్రలు, అవకాశాలు వస్తేనే సాధ్యం అవుతుంది. ఏజ్ హీరోలు యంగ్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్నప్పుడు నేను కూడా కుర్ర హీరోలతో చేయడంలో తప్పేముంది అంటూ భూమిక హాట్ కామెంట్స్ చేసింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాలా మంది మహిళలు భూమిక వ్యాఖ్యలని సమర్ధిస్తూ ఉండటం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X