బీచ్‌లో ప్యాంట్ లేకుండా పిచ్చెక్కిసోన్న బిపాసా .. 45 ఏళ్ల వయసులోనూ కొలతలు మారలేదుగా!

చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా వెలగాలంటే అందం కూడా అవసరమే. టాలెంట్ ఎంత ఉన్న గ్లామర్ ఫీల్డ్‌లో అమ్మాయిల అంద చందాలు కూడా కీలకమే. కానీ అందం లేకపోయినా, పాల మీగడ లాంటి పరువాలు లేకపోయినా స్టార్లుగా రాణించిన ముద్దుగుమ్మలు ఎంతో మంది . ఇలాంటి వారిలో బాలీవుడ్ డస్కీ బ్యూటీ బిపాసా బసు కూడా ఒకరు. హేమహేమీల్లాంటి స్టార్స్ ఉన్న బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు బిపాసా. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే బిపాసా బసు తాజాగా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

7 జనవరి 1979లో బెంగాలీ ఫ్యామిలీలో జన్మించారు బిపాసా బసు. ఆమె తండ్రి హిరాక్ సివిల్ ఇంజనీర్, తల్లి మమత గృహిణి. బిపాసాకు ఓ అక్క, చెల్లెలు ఉన్నారు. ఎనిమిదేళ్ల వయసు వరకు ఢిల్లీలో ఉన్న వీరి కుటుంబం , తర్వాత కోల్‌కోతాకు మకాం మార్చింది. 1996లో మోడలింగ్‌లోకి అడుగుపెట్టిన బిపాసా బసు.. గోద్రేజ్ సింథాల్ సూపర్ మోడల్ కాంటెస్ట్‌లో విజయం సాధించారు. ఈ సమయంలో దినో మోరియాతో బిపాసా బసు ప్రేమలో పడ్డారు.

Actress Bipasha Basu Stunning video at beach goes viral in instagram

మోడల్‌గా ఉన్న సమయంలో వినోద్ ఖన్నా కళ్లలో పడ్డ బిపాసా బసుకు ఆయన హిమాలయ్ పుత్రలో అవకాశం కల్పించారు. తర్వాత 2001లో సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన టక్కరీ దొంగ చిత్రం ద్వారా తెలుగు వారిని పలకరించారు. తర్వాత తన మకాంను ముంబైకి మార్చిన బిపాసా వరుసపెట్టి క్రేజీ ప్రాజెక్ట్స్‌లో అవకాశం దక్కించుకుంది. అప్పటి సెక్సీ బాంబ్ మల్లికా షెరావత్‌ను మించి అందాలు ఆరబోసి కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది.

జిస్మ్, తుజే మేరే కసమ్, గుణ, జమీన్, రుద్రాక్ష్, చెహ్రా, నో ఎంట్రీ, అపహరణ్, శిఖర్, ఓంకార, ధూమ్ 2, రేస్, గోల్, ఓం శాంతి ఓమ్, నో స్మోకింగ్, దమ్ మారో దమ్, రాజ్ 3, ఆత్మ, క్యాప్చర్ 3 డీ, వెల్‌కమ్ న్యూయార్క్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తొలినాళ్లలో దినో మోరియాతో ఆరేళ్లు, జాన్ అబ్రహంతో 9 ఏళ్లు, హర్మన్ బవేజాతో మూడేళ్లు డేటింగ్ చేశారు బిపాసా. అన్నింటిలోకి జాన్ అబ్రహంతో ప్రేమాయణం వార్తల్లో నిలిచింది. బాలీవుడ్‌లో హై ప్రొఫైల్ కపుల్‌గా హల్‌చల్ చేసిన ఈ జంట విడిపోవడం కలకలం రేపింది.

ఇక ఎలోన్ సినిమాలో తనతో కలిసి నటించిన కరణ్ సింగ్ గ్రోవర్‌తో ప్రేమలో పడిన బిపాసా ఆయనను 2016 ఏప్రిల్ 30న పెళ్లాడారు. ఈ దంపతులకు ఓ చిన్నారి సంతానం. దేవి బాసు సింగ్ గ్రోవర్ అని ఆ పాపకు పేరు పెట్టారు బిపాసా దంపతులు. అయితే ఈ చిన్నారి పుట్టుకతోనే గుండెలో రెండు రంధ్రాలు ఉండటంతో మూడు నెలల వయసులోనే సర్జరీ చేయాల్సి వచ్చింది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే బిపాసా బసు.. ఎప్పటికప్పుడు తన సినిమాలు, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా బీచ్‌లో వెకేషన్‌కి వెళ్లిన బిపాసా.. పులి చర్మం లాంటి డ్రెస్ వేసి కింద ప్యాంట్ లేకుండా వయ్యారాలు ఒలకబోస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. 45 ఏళ్ల వయసులోనూ మీ అందం ఏమాత్రం తగ్గలేని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Read more about: bipasha basu movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X