పెళ్లికి ముందే మరో హీరోయిన్ ప్రెగ్నెంట్.. మ్యారేజ్‌కు అంత సీన్ లేదని కామెంట్!

Recommended Video

Brazilian Model-Actress Bruna Abdullah Announces Pregnancy || Filmibeat Telugu

సినీ పరిశ్రమలో పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ కావడమనే ట్రెండ్ నడుస్తున్నట్టు కనిపిస్తున్నది. కొద్ది రోజుల క్రితం అమీ జాక్సన్ మ్యారేజ్‌కు ముందే గర్భవతి కావడం మీడియాలో సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇంకా ఆ ఘటన మరవక ముందే మరో హీరోయిన్ బ్రూనా అబ్దుల్లా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది. తాను ఐదు నెలల గర్భవతిని అని సోషల్ మీడియాలో వెల్లడించింది. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ కావడంపై వస్తున్న విమర్శలకు ధీటుగా స్పందించింది. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్‌లో హాట్ హీరోయిన్‌గా

బాలీవుడ్‌లో హాట్ హీరోయిన్‌గా

బ్రూనా అబ్దుల్లాకు బాలీవుడ్‌లో హాట్ హీరోయిన్ అనే పేరు ఉంది. ఆమె నటించిన ఐ హేట్ లవ్ స్టోరీస్, గ్రాండ్ మస్తీ మంచి విజయాన్ని అందుకొన్నాయి. తన చిరకాల మిత్రడు బ్రిటన్‌కు చెందిన అలెన్ ఫ్రేజర్‌తో కొద్దికాలంగా డేటింగ్ చేస్తున్నది. బ్రెజిల్‌కు చెందిన ఈ అందాలభామకు తన బాయ్‌ఫ్రెండ్‌తో 2018 జూలై 19న ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఆ తర్వాత వారు కలిసి జీవిస్తున్నారు.

 పెళ్లి గురించి పట్టించుకోనని

పెళ్లి గురించి పట్టించుకోనని

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ కావడంపై బ్రూనా అబ్దుల్లా స్పందిస్తూ.. పెళ్లి చేసుకోవడం అనే విషయాన్ని పట్టించుకోను. మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది నా దృ‌ష్టిలో ఓ పేపర్ మాత్రమే. ఇద్దరి మనసులు కలుసుకోవడానికి అంతా ముఖ్యం కాదు. పెళ్లి తర్వాత డైవోర్స్ తీసుకోవడం లేదా? అసంతృప్తి జీవించడం లేదా? అడ్జస్ట్ మెంట్‌తో ఒకరినొకరు చీట్ చేసుకోవడం లేదా? ప్రేమ మాత్రమే ఇద్దరిని దగ్గరికి తీస్తుంది. పెళ్లి అనేది ప్రేమకు చిహ్నమనే నిజమా? అనే అనిపిస్తుంది అని బ్రూనా అబ్దుల్లా అభిప్రాయపడ్డారు.

కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉంది

కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉంది

నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంగా ఉంది. నేను గర్భవతిని అనే వార్త మా కుటుంబంలో కొండంత సంతోషాన్ని నింపింది. నాకు పుట్టబోయే బిడ్డను చూడటానికి నా తల్లి తహతహలాడుతున్నది. ఈ వార్త మా జీవితంలో మరిచిపోలేనటువంటిది. ప్రస్తుతం శిశివుకు 22 వారాల వయసు. తల్లిదండ్రులగా మారడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు పుట్టబోయే బిడ్డ కోసం అతృతగా ఎదురుచూస్తున్నాం అని బ్రూనా అబ్దుల్లా అన్నారు.

త్వరలోనే పెళ్లి చేసుకొంటాం

త్వరలోనే పెళ్లి చేసుకొంటాం

తమ బిడ్డ ఈ భూమ్మీదకు రావడానికి ముందే మేము పెళ్లి చేసుకోవాలనుకొంటున్నాం. అలెన్ మా పెళ్లి వేడుకకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నేను గర్బవతిని అనే విషయాన్ని దాచడం నాకు ఇష్టం లేదు. నా ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేసే పనిలో ఉన్నాను. డ్యాన్స్ షో ముగించే సమయంలోనే నేను గర్బవతిని అనే విషయం తెలిసింది. డెలివరీ తర్వాత నా బిడ్డతోనే ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్లాన్ చేస్తున్నాను.

ప్రేమలో అలా పడిపోయానని

ప్రేమలో అలా పడిపోయానని

నా ఫ్రెండ్ అలెన్‌తో ప్రేమలో పడటం అలా జరిగిపోయింది. ఓ రోజు వాళ్ల ఇంటికి పార్టీకి పిలిచారు. నా స్నేహితులతో కలిసి నేను ఆ పార్టీకి వెళ్లాను. ఆ సమయంలో ఆయన చెప్పిన మాటలకు పడిపోయాను. కొద్దికాలం డేటింగ్ చేశాం. ఆ తర్వాత మాకు నిశ్చితార్తం జరిగింది అని బ్రూనా వెల్లడించింది. బ్రూనా అబ్దుల్లా 2018లో ఉండచ్చో అనే సినిమాలో చివరిసారిగా కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X