త్రిష పెళ్లికి ముహుర్తాలు.. నీకు ఇదే చివరి ఛాన్స్ అంటూ మేటర్ లీక్ చేసిన ఛార్మి!
అందాల భామ త్రిష కృష్ణన్ దక్షిణాదిలో దశాబ్దానికి పైగా తన అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. సంవత్సరాలు గడిచినా ఏ మాత్రం చెక్కు చెదరని అందంతో మరింత గ్లామరస్‌గా కనిపిస్తున్నారు. హీరోల పక్కన పాత్రల నుంచి హీరోయిన్ ఓరియెంట్ పాత్రలతో అలరిస్తున్నారు. అయితే త్రిష పెళ్లి వార్త తమిళ మీడియాలో వైరల్‌గా మారింది. అలా కావడానికి కారణమేమిటంటే..

శింబుతో పెళ్లి అంటూ..
గత కొద్దికాలంగా త్రిష పెళ్లిపై రూమర్లు తెగ ప్రచారం అవుతున్నాయి. ఆమె పెళ్లి శింబుతో అనే విషయం కోలీవుడ్‌లో భారీగా ప్రచారం జరిగింది. అయితే ఆ సమయంలో శింబు తండ్రి ఘాటుగా స్పందించడంతో కొంత వివాదంగా మారిన విషయం తెలిసిందే.

38వ పుట్టిన రోజున
అయితే ఇటీవల 38 పుట్టిన రోజును జరుపుకొన్న త్రిషకు కుప్పలుతెప్పలుగా విషెస్ వచ్చాయి. సమంత ఆమెను సూపర్ స్టార్ అంటూ సంభోదిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు విషెస్‌తో ముంచెత్తారు.

ఛార్మి కౌర్ ఆసక్తికరమైన పోస్టు
కానీ తాజాగా నిర్మాతగా మారిన హీరోయిన్ ఛార్మి కౌర్ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. త్రిషాకు 38వ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక పెళ్లి చేసుకోవాల్సిన సమయం వచ్చేసిందంటూ ఆమెకు పెళ్లి విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాకుండా పెళ్లిపై దృష్టిపెట్టేలా త్రిషాకు హింట్ ఇచ్చారు.

త్రిష పెళ్లి చేసుకొనే పనిలో
అయితే త్రిషకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ... ఇదే నీకు చివరి బ్యాచ్‌లర్ బర్త్ డే అంటూ కామెంట్ చేసినట్టు తెలిసింది. దీంతో త్రిష పెళ్లి చేసుకొనే పనిలో ఉన్నట్టు చార్మి అసలు విషయాన్ని లీక్ చేసింది. ఈ ఏడాది చివర్లో గానీ, వచ్చే ఏడాది ఆరంభంలో కానీ త్రిష పెళ్లి జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
Recommended Video

త్రిష కృష్ణన్ కెరీర్ ఇలా..
ఇక త్రిష కృష్ణన్ కెరీర్ విషయానికి వస్తే... కొద్ది సంవత్సరాలుగా ఈ భామ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. 96, పేట్టా చిత్రాల సక్సెస్‌తో తమిళంలో జోష్‌ను కొనసాగిస్తున్నారు. తమిళంలో పరంపదం విలయట్టు సినిమాతో మరింత ఆదరణను సంపాదించుకొన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్‌లో సత్తా చాటారు. ఇంకా గర్జనై, చతురంగ వేట్టై 3, రాంగీ, షుగర్, రామ్, పొన్నియన్ సెల్వన్ చిత్రాల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











