Colors Swathi విడాకులు కన్మార్మ్ అయినట్లే... ఈ విధంగా క్లారిటీ ఇచ్చేసిందిగా!
సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీల విడాకులు ఈ మధ్యకాలంలో సెన్సెషన్ క్రియేట్ చేస్తునే ఉన్నాయి.. ఆ మధ్య నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోగా.. ఇటీవల నాగబాబు కూతురు నిహారిక, జొన్నలగడ్డ చైతన్య విడాకులు తీసుకోవడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక వారి బాటలోనే మరో తెలుగు హీరోయిన్ విడాకులు తీసుకోబోతున్నట్లు గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె ఎవరో కాదు కలర్స్ స్వాతి. ఇప్పుడు ఆ న్యూస్ గురించి కలర్స్ స్వాతి స్పందించింది. ఆ వివరాల్లోకి వెళితే...
సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రేటీల గురించి గాసిప్స్ అనేది సర్వసాధారణమైంది. ఏదో ఒక వార్త రాస్తూనే ఉంటారు. అయితే అందులో కొన్ని ఫేక్ వార్తలు ఉండగా.. మరికొన్ని నిజాలు ఉంటాయి. ఇక గత కొంత కాలంగా కలర్స్ స్వాతి విడాకులు తీసుకుంటున్నట్లు నెట్టింట హల్ చల్ చేస్తునే ఉన్నాయి. ఆమె సమంత, నిహారిక బాటలోనే విడాకులు తీసుకుంటుందని చాలా కాలం నుంచి వార్తలు వస్తున్నాయి.

అందుకు కారణం విడాకులు తీసుకునే కొన్ని నెలల ముందు సామ్, నిహారికలు తమ పెళ్లి ఫోటోలను డిలీట్ చేశారు. అంతే కాదు వారి భర్తల అకౌంట్ ను అన్ ఫాలో చేశారు. ఇక వారి బాటలోనే స్వాతి కూడా ఆమె పెళ్లి ఫోటోలను తీసేసింది. ఇక భర్తను అన్ ఫాలో కూడా చేసింది. దీనితో వీరు విడాకులు తీసుకుంటున్నారంటూ... వార్తలు బయటకు వచ్చాయి.
కలర్స్ ప్రోగ్రాంతో స్వాతి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ ప్రోగ్రామ్ పేరునే తన ఇంటి పేరుగా మార్చుకుంది. ఆ క్రేజ్ తో ఆమెకు మంచి ఆఫర్స్ వచ్చాయి. పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఆ తర్వాత వికాస్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సెటిల్ అయిన ఈ బ్యూటీ... ఇప్పుడు విడాకుల వార్తల్లో నిలుస్తోంది.

ఇక తాజాగా ఆమె నటించిన మంత్ ఆఫ్ మధు చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా హైదారాబాదులో సందడి చేసింది స్వాతి. ఇక ఓ జర్నలిస్టు స్వాతి విడాకలు గురించి అడిగాడు. దానికి ఆమె... సున్నితంగా తిరస్కరించింది. విడాకులు, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడబోనని స్వాతిరెడ్డి స్పష్టం చేసింది. ఒకవేళ ఈ వార్తలో నిజం లేకపోతే ఖండిచేదని... ఉంది కాబట్టి ఏమి మాట్లాడలేక వెళ్లిపోయిందని నెటిజన్స్ అంటున్నారు.
ఇక మంత్ ఆఫ్ మధు చిత్ర విషయానకిి వస్తే... ఈ మూవీ అక్టోబర్ 6న విడుదల కానుంది. నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి జంటగా శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. కలర్స్ స్వాతి 2018లో పైలట్ వికాస్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మరి వారు విడిపోయి వేరుగా ఉంటున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











