విడాకుల వ్యవహారం.. బుర్ఖాలో హీరోయిన్.. మొహం చూపించిన ఎవరూ గుర్తుపట్టరంటూ!
సినిమా అనే గ్లామర్ ప్రపంచంలో సెలబ్రిటీలకు సంబంధించి ఎన్నో పుకార్లు బయటకొస్తుంటాయి. వివాహం, విడాకులు, లవ్, అఫైర్స్ అంటూ అందాల తారలపై తరచు ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. అయితే వాటిలో కొన్ని నిజాలు అయిన దాఖలాలు సైతం ఉన్నాయి.
బ్యూటిఫుల్ సమంత, మెగా డాటర్ నిహారిక కొణిదెల తరహాలో మరో హీరోయిన్ విడాకులు తీసుకుంటుందంటూ తెగ వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. ఆమె ఎవరో కాదు.. క్యూట్ స్మైల్ బ్యూటి కలర్స్ స్వాతి. అయితే ఆమె తాజాగా బుర్ఖా వేసుకుని జనాల్లోకి వచ్చింది. అందుకు గల కారణాలు, నెటిజన్ల కామెంట్లపై లుక్ వేస్తే..

రష్యాలో జననం: కలర్స్ షో ద్వారా ఎంతో పాపులర్ అయిన స్వాతి రష్యాలో ఏప్రిల్ 19, 1987లో జన్మించింది. స్వాతి తండ్రి నేవీలో ఉద్యోగి. తండ్రి ఉద్యోగ రిత్యా రష్యాలో ఉండగా స్వాతి అక్కడే జన్మించింది. ముందుగా స్వాతికి స్వెత్లానా అని నామకరణం చేశారు. అనంతరం స్వాతిగా మార్చారు. వీరి కుటుంబం రష్యా నుంచి ముంబైకి తర్వాత విశాఖపట్నంకి మారింది. స్వాతి చైల్డ్ హుడ్ అంతా వైజాగ్ లోనే గడిచింది.

16 ఏళ్లకే: ఇంటర్మీడియట్ కోసం హైదరాబాద్ కు వచ్చింది స్వాతి. అనంతరం 16 ఏళ్ల వయసులో కలర్స్ అనే టీవీ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది స్వాతి. ఇందులో నాగార్జున, ఉదయ్ కిరణ్ వంటి ప్రముఖ హీరోలను ఇంటర్వ్యూ చేసే అవకాశం పొందింది. దీంతో ఆమె తెలుగు రాష్ట్రాల్లో కలర్స్ స్వాతిగా గుర్తుండిపోయింది. అలా స్వాతికి సినిమాల్లో ఛాన్సులు రావడం మొదలైంది.

సూపర్ క్రేజ్: కలర్స్ స్వాతి ముందుగా కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన డేంజర్ సినిమాలో నటించింది. అనంతరం వెంకటేష్-త్రిష కాంబినేషన్ ఆడవారి మాటలకు అర్థాలు వేరులే మూవీతో తనపై అందరి దృష్టి పడేలా చేసుకుంది. మూడో సినిమాగా తెలుగు, తమిళ ద్విభాష చిత్రం అనంతపురం తమిళంలో (సుబ్రహ్మణ్యపురం) నటించి అట్రాక్ట్ చేసింది. ఇక నాని అష్టాచమ్మాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.

నంది అవార్డ్: అష్టాచమ్మా సినిమాకు గానూ ఉత్తమ నటిగా నంది అవార్డ్ అందుకుందు బ్యూటిఫుల్ స్వాతి. హీరోయిన్ గానే కాకుండా స్వాతి గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకుంది. అనంతరం సినిమాలకు దూరంగా ఉన్న స్వాతికి వికాస్ అనే వ్యక్తితో వివాహం అయింది. మళ్లీ సినీ అవకాశాల కోసం ట్రై చేస్తున్న స్వాతి తన భర్తతో విడిపోయిందని వార్తలు తెగ వచ్చాయి. కానీ, ఆమె తన భర్తతోనే కలిసి ఉంటుందని సమాచారం.

బుర్ఖాలో: ఇక తాజాగా స్వాతి బుర్ఖాలో దర్శనం ఇచ్చింది. దానికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. అందులో ఎక్కడికో ప్రయాణమైన స్వాతి బుర్ఖా ధరించి పలు ప్రాంతాలు తిరిగింది. ట్రైన్ ఎక్కిన తర్వాత బుర్ఖా తీసి నార్మల్ గా కనిపించింది. తర్వాత చీరకట్టులో దర్శనం ఇచ్చి వీడియోను ముగించింది. అయితే ఈ వీడియో సరదాగా చేసినట్లుగా తెలుస్తోంది. కానీ ఈ వీడియోకు పలువురు పాజిటివ్ గా స్పందిస్తంటే కొందరు నెగెటివ్ గా మాట్లాడుతున్నారు.
కౌంటర్: కలర్ స్వాతి తాజాగా షేర్ చేసిన వీడియోకు ఒకతను "నువ్ ఆ బుర్ఖా తీసేసి మొహం చూపించినా ఎవరూ గుర్తుపట్టరు. నీకేం సమస్య రాదు" అని కామెంట్ చేశాడు. దానికి స్వాతి కౌంటర్ గా రిప్లై ఇచ్చింది. "నిజమే, నన్ను ఎవ్వరూ పట్టించుకోరు. ఒక్కరు సెల్ఫీ అడిగినా కూడా అందరూ అడిగేస్తుంటారు. నేను ఎవరో తెలియకపోయినా అడిగేస్తుంటారు" అని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











