అందరూ మర్చిపోయిన రెబల్, నిప్పు హీరోయిన్ షాకింగ్ లుక్.. హఠాత్తుగా బికినీలో దర్శనం!
కొంతమంది హీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే స్టార్ హీరోయిన్స్ గా చక్రం తిప్పాలని ఎంతో హడావిడిగా కనిపిస్తూ ఉంటారు. ఇక అదే తరహాలో వచ్చిన ఒక హీరోయిన్ మాత్రం ఎంత స్పీడ్ గా వచ్చిందో అంతే తొందరగా ఇండస్ట్రీలో మాయమైపోయింది. ఆమె మరెవరో కాదు ప్రభాస్, అల్లు అర్జున్, రవితేజ గోపీచంద్ ఇలా కొంతమంది యాక్షన్ హీరోలతో కలిసి నటించిన బ్యూటీ. ఆమె నటించిన సినిమాల్లో కేవలం ఒకే ఒక్క సినిమా సక్సెస్ అయింది. ఇక రీసెంట్ గా ఆమె బికినీలో దర్శనం ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

అల్లు అర్జున్ సినిమతో ఎంట్రీ
మోడల్ గా మంచి గుర్తింపును అందుకున్న దీక్ష సేథ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ బ్యూటీ మొదట అల్లు అర్జున్ వేదం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమాలో ఒక డబ్బున్న అమ్మాయిగా ఆమె నటించిన విధానం బాగానే ఆకట్టుకున్నప్పటికీ కూడా సినిమా సక్సెస్ కాలేక పోయింది. సినిమాల్లోకి రాకముందు ఫ్యాషన్ ప్రపంచంలో దీక్ష సేథ్ మంచి క్రేజ్ అయితే అందుకుంది. ఫెమినా మిస్ ఇండియాలో కూడా ఆమె ఫైనల్స్ వరకు వెళ్ళింది. ఇక తర్వాత కమర్షియల్ యాడ్స్ లో కూడా ఈ బ్యూటీ నటించింది.

ఆ సినిమాతో సక్సెస్
మొదటి సినిమా సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా ఆ తర్వాత 2010లో చేసిన మిరపకాయ్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అందులో ఆమె నటించిన విధానం కూడా బాగానే ఆకట్టుకుంది. ఇక ఆ సినిమా సక్సెస్ కావడంతో ఈ బ్యూటీకి టాలీవుడ్ లో ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ అందులో మంచి సినిమాలను సెలెక్ట్ చేసుకోవాలని దీక్ష సేథ్ కొన్ని ప్రాజెక్టులను రిజెక్ట్ చేసింది.

వరుస డిజాస్టర్స్
దీక్ష సేథ్ బ్యాడ్ లక్ ఏమిటో గాని ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్నా కొన్ని పెద్ద హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. ముఖ్యంగా ప్రభాస్ తో ఆమె చేసిన రెబల్ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే గోపీచంద్ హీరోగా చేసిన వాంటెడ్ సినిమా కూడా డిజాస్టర్ అయింది. అలాగే రవితేజ గుణశేఖర్ కలయికలో వచ్చిన నిప్పు సినిమా కూడా ఈ బ్యూటీకి చేదు అనుభవాలను మిగిల్చాయి.

అదే ఆఖరి సినిమా
వరస సినిమాలు ఫ్లాప్ కావడంతో దీక్ష సేథ్ కొంత ఆలోచించి ప్రాజెక్టులను ఓకే చేయాలని అనుకుంది. ఇక ఎంతో నమ్మకం పెట్టుకున్నా ఉ కొడతారా ఉలిక్కి పడతారా? సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక తర్వాత ఈ బ్యూటీ తెలుగులో మళ్లీ మరో సినిమా చేయలేదు.. హిందీలో రెండు సినిమాలు చేసినప్పటికీ అవి కూడా అంతగా సక్సెస్ కాలేదు.

ఇప్పుడు ఏం చేస్తోంది.
ఇక సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోవడంతో ఈ బ్యూటీ 2016 లోనే నటనకు గుడ్ బై చెప్పేసెంది. విదేశాల్లో బిజినెస్ కోర్సులో చేసిన దీక్ష అక్కడే మంచి జాబ్ కూడా చేస్తున్నట్లు సమాచారం. ముందస్తుగానే తన ఫ్యామిలీ అమెరికాలో స్థిరపడడంతో అక్కడే ఈ బ్యూటీ కొన్ని వ్యాపారాలు కూడా చేస్తున్నట్లు సమాచారం.

బికినీ పిక్ వైరల్
ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో దీక్ష సేథ్ కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. రీసెంట్ గా ఈ బ్యూటీ బికినీలో దర్శనం ఇచ్చిన విధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక బీచ్ లో దీక్ష సేథ్ అతి చిన్న బికినీలో కనిపించేసరికి ఆ ఫోటో నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఆమె మళ్ళీ సినిమాల్లోకి రావాలి అని మరి కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











