Don't Miss!
- News ఎన్నికల ముందు గుడ్ న్యూస్..ఫుల్ జోష్‌లో వైసీపీ
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Deepika Padukone: మరోసారి అస్వస్థతకు గురైన ప్రాజెక్ట్ K హీరోయిన్.. ప్రస్తుతం ఎలా ఉందంటే?
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే మరోసారి అనారోగ్యానికి గురైంది. ఇదివరకే కొన్నిసార్లు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడంతో షూటింగ్‌లకు బ్రేక్ కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు మరోసారి దీపికా షూటింగ్‌లోనే అస్వస్థతకు గురి కావడంతో వెంటనే హాస్పిటల్ లో జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది. ఆమెకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఇక ఆమె పరిస్థితి ఎలా ఉంది అసలు దీపిక పదుకొనేకు వచ్చిన ప్రాబ్లం ఏమిటి అనే వివరాల్లోకి వెళితే..
పెళ్లి తర్వాత
బాలీవుడ్ లో ప్రస్తుతం అత్యధిక స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్స్ లలో దీపిక పదుకొనే టాప్ లిస్టులో కొనసాగుతున్నారు. రణ్ వీర్ సింగ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సినిమాల ఎంపిక విషయంలో కూడా చాలా విభిన్నంగా అడుగులు వేస్తున్నారు. ఒక విధంగా పెళ్లి తర్వాత కూడా స్పీడ్ పెంచింది అని చెప్పవచ్చు.
గతంలోనే..
అయితే షూటింగ్లలో కొన్నిసార్లు ఆమె హఠాత్తుగా అస్వస్థకు గురి కావడంతో వార్తల్లో నిలుస్తోంది. ఇదివరకే దీపిక పదుకొనే ప్రభాస్ ప్రాజెక్టు కే సినిమా షూటింగ్ చేస్తుండగా హఠాత్తుగా అనారోగ్యానికి గురైంది. వెంటనే ఆమెను హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అప్పటికప్పుడే ప్రభాస్ కూడా షూటింగ్ క్యాన్సిల్ చేసి మరి ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అంధించారు.
అలసత్వం అనిపించడంతో..
ఇక దీపిక పదుకొనే సోమవారం రోజు కూడా కొంత అనారోగ్యానికి గగురైనట్లు తెలుస్తోంది. దీపికా ఆసుపత్రిలో కొన్ని పరీక్షలు చేయించుకుంది. గత కొన్ని రోజులుగా షూటింగ్‌లతో తీరిక లేకుండా బిజీగా ఉండడం వలన ఆమె కొంత నీరసానికి గురైందట. అలసత్వం అనిపించడంతో ఆమె అలానే తల పట్టుకుని కనిపించారట. దీంతో అన్ ఈజీగా అనిపించడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.
పరిస్థితి ఎలా ఉందంటే..
ఇక ప్రస్తుతం అయితే దీపిక పదుకొనే పరిస్థితి బాగానే ఉన్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు అని కేవలం కాస్త అనీజిగా అనిపించడంతో హాస్పిటల్లో చేర్పించినట్లుగా తెలుస్తోంది. కొన్ని నెలల క్రితమే దీపిక గుండె వేగం పెరగడంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఈ నటి ప్రస్తుతం ప్రభాస్‌తో చేయబోయే ప్రాజెక్ట్ కె షూటింగ్లో ఉంది.
ఆ సినిమాలతో బిజీగా..
ఇక ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికి వెళ్తే ఆమె షారుఖ్ ఖాన్‌తో 'పఠాన్' సినిమా చేస్తోంది. అలాగే హృతిక్ రోషన్ 'ఫైటర్'లో కూడా హీరోయిన్ గా నటించనుంది. అలాగే మరికొన్ని డిఫరెంట్ ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నాయి. ఒక లేడీ ఎవరు ప్రాజెక్టులో కూడా నటించబోతోంది. అమితాబ్ బచ్చన్ త్వరలో స్టార్ట్ చేయబోతున్న కొత్త సినిమాలో కూడా భాగం కాబోతున్నట్లు సమాచారం.