చాహల్ తో విడాకులపై నోరు విప్పిన హాట్ బ్యూటీ.. నా క్యారక్టర్ ని అవమానిస్తున్నారు అంటూ
భారత ప్రముఖ క్రికెటర్స్ లో చాలా మంది సినీ తారల్ని పెళ్లి చేసుకోవడమో లేదా పలువురు యంగ్ అండ్ స్టార్ హీరోయిన్స్ తో డేటింగ్ లో ఉండడమో లాంటి వార్తలు తరచూ వింటూనే ఉంటాము. అలాగే వాటితో పాటుగా వారి ప్రేమ వ్యవహారాలు ఇంకా బ్రేకప్ లకి సంబంధించి ఇలా చాలా డ్రామానే వినిపిస్తూ ఉంటుంది. కాగా రీసెంట్ గా బాలీవుడ్ సినీ వర్గాల్లో సహా నార్త్ ఇండియా క్రికెట్ వర్గాల్లో కూడా షాకింగ్ గా మారిన వార్త ఏదన్నా ఉంది అంటే అది యువ క్రికెటర్ యుజ్వీందర్ చాహల్ విడాకులు వార్తలే అని చెప్పాలి.
కాగా చాహల్ ధనశ్రీ వర్మ అనే ఓ అమ్మాయిని గత 2020లో పెళ్లాడిన సంగతి తెలిసిందే. కానీ ఈ ఇద్దరు విడిపోతున్నట్టుగా పలు వార్తలు కొన్ని రోజులు నుంచి ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో చాహల్ పై కొన్ని షాకింగ్ విజువల్స్ కూడా బయటకి వచ్చి వైరల్ గా మారాయి. చాహల్ చాలా డిజప్పాయింటింగ్ గా పలు వీడియోస్ లో కనిపించడం చర్చకి దారి తీసింది.

చాలా దిగాలుగా ఎక్కడ లేని విచారం అంతా తన ముఖంలోని కనిపించడంతో నెటిజన్స్ తన విషయంలో బాధ పడ్డారు. అయితే ఒక రిలేషన్ షిప్ లో ఎప్పుడూ మగవాడే బాధపడతాడు అని లేడీస్ మాత్రం హ్యాపీ గానే ఉంటారు అంటూ ధనశ్రీ వెర్మపై పలు విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. కాగా ఈ విడాకుల వార్తలు ఇలా వైరల్ అవుతున్న నేపథ్యంలో ఫైనల్ గా ధనశ్రీ నోరు విప్పింది.
తాను తనకి ఇష్టమైన మార్గంలో పేరు తెచ్చుకునేందుకు ఎన్నో ఏళ్ళు కష్టపడ్డాను అని అని నా మౌనంని చేతకానితనంగా తీసుకోవద్దు. ఆన్లైన్ లో నాపై ఇలాంటి నెగిటివ్ వార్తలు స్ప్రెడ్ చేయడం సులభమే అని అంటుంది. అలాగే ఈ కొన్ని రోజులు నుంచి నాకు నా కుటుంబానికి పరిస్థితులు చాలా దారుణంగా గడిచాయి. ఇందులో బాధాకరమైన విషయం ఏమిటంటే నాపై ఆధారం లేని ఆరోపణలు చేస్తున్నారు.

చెత్త రాతలు రాస్తున్నారు నా క్యారెక్టర్ ని తక్కువ చేసి నా ప్రతిష్టకి భంగం కలిగిస్తున్నారు అంటూ ఈ హాట్ బ్యూటీ ఆవేదన వ్యక్తం చేస్తుంది. కాగా ఇక్కడ ఆసక్తికర అంశం ఏమిటంటే తానెక్కడా చాహల్ పేరు తీసుకురాలేదు. అలాగే విడాకుల కోసం కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం. కేవలం తనపై వచ్చిన నెగిటివ్ కోసం మాత్రమే చెప్పుకొచ్చింది. సో ఎక్కడా విడాకుల కోసం ఆమె చెప్పకపోవడంతో అది నిజమే అని దాదాపు ఖరారు అయ్యింది.
కాగా రీసెంట్ గానే సోషల్ మీడియాలో కూడా ఇద్దరూ ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకోవడం అంతే లేకుండా ఇద్దరికీ కలిపి ఉన్న పోస్ట్ లు కూడా డిలీట్ చేసుకోవడం జరిగినట్టుగా కూడా తెలిసింది. మరి ధనశ్రీ వెర్మ తన సినిమాల ఇంట్రెస్ట్ మూలానే ఇదంతా జరుగుతుంది అన్నట్టుగా ఒక టాక్ అయితే ఇపుడు ఉంది. మరి వారి విడాకులకు కారణం ఏంటి అనేది అధికారికంగా బయటకి రావాల్సి ఉంది. ఇపుడు చాహల్ భార్య తెలుగులో కూడా ఓ సినిమా కమిట్ అయ్యి ఉంది.


Click it and Unblock the Notifications











