For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నేను మందు తాగలేదు కానీ అలా చూపించారు.. ఎవ్రీ వీకెండ్ ఉండాల్సిందే… సీక్రెట్స్ బయటపెట్టిన నటి!

  |

  బెంగళూరులో పుట్టి పెరిగిన తమిళ అమ్మాయి ధన్య బాలకృష్ణ హీరో సూర్య మరియు శృతి హాసన్ నటించిన 7th సెన్స్ సినిమాతో తెరంగ్రేటం చేసింది. ఆమె ఆ తర్వాత తెలుగు పరిశ్రమలో కూడా ఎంట్రీ ఇచ్చి మంచి సినిమాలు చేసింది. లవ్ ఫెయిల్యూర్, ఎటో వెళ్ళిపోయింది మనసు అనే తెలుగు సినిమాలలో నటించిన ఈ భామ 2013 విక్టరీ వెంకటేష్ మరియు మహేష్ బాబు మల్టీస్టారర్ సినిమా అయిన "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" సినిమాలో ఒక సీన్ లో నటించింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసింది. తాజాగా ఆమె తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో కొన్ని విషయాలు పంచుకుంది. ఆ వివరాల్లోకి వెళితే

  సెవెన్త్ సెన్స్ తో ఎంట్రీ

  సెవెన్త్ సెన్స్ తో ఎంట్రీ

  రాజా రాణి, అమృతం చందమామలో, రన్ రాజా రన్, చిన్నదాన నీ కోసం, రాజు గారి గది, నేను శైలజ, సావిత్రి, జయ జానకీ నాయకా అలాగే గత ఏడాది రిలీజ్ అయిన అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమాలో ధన్య నటించింది. హీరోయిన్లకి ఏమాత్రం తగ్గని అందం ఉన్న ఈ ముద్దుగుమ్మకి మాత్రం హీరోయిన్ గా అవకాశాలు రావట్లేదు. ఒక అవకాశం వచ్చింది, అది కూడా సుడిగాలి సుధీర్ పక్కన. అయినా వెనుకాడకుండా చేసినా ఆ సినిమా పెద్దగా ఆడలేదు.

  నాలుగు వేలు రెమ్యునరేషన్

  నాలుగు వేలు రెమ్యునరేషన్

  దీంతో తెలుగులో ఎలా అయినా హీరోయిన్ స్థిరపడాలని ఈ భామ ఆశలు పెట్టుకుంది. అయితే తాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేసినప్పుడు రోజుకు నాలుగు వేలు తీసుకునేదాన్ని అని ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా ఈ భామ చెప్పుకొచ్చింది. హీరోయిన్ కావాలనే ఆశతో కాస్త తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చినా సరే సినిమాలు చేయాలని చూస్తోంది.

  సోషల్ మీడియాలో యాక్టివ్

  సోషల్ మీడియాలో యాక్టివ్


  ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో ఒక ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించింది. అందులో తన నటన అలాగే తన పర్సనల్ విషయాలు కూడా కొన్ని పంచుకుంది. ఆమె పంచుకున్న విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఆ ఇంటరాక్షన్ సెషన్ లో ఒక అభిమాని రాజా రాణి సినిమాలో పాత్రతో మీ నిజ జీవితాన్ని పోల్చవచ్చా అని ప్రశ్నించగా అస్సలు పోల్చవద్దని చెప్పుకొచ్చింది.

  మందు తాగలేదు కానీ

  మందు తాగలేదు కానీ


  ఆ సినిమాలో నేను మందు తాగినట్లు చూపించారు కానీ అది నిజం కాదని ధన్య పేర్కొన్నారు. కేవలం మంచినీళ్లు అని ఆమె చెప్పుకొచ్చింది. తను పార్టీలు కూడా ఎక్కువ చేసుకోనని ప్రతి వీకెండ్ లో మాత్రం స్నేహితులతో కలిసి భోజనానికి వెళ్తానని చెప్పుకొచ్చింది. ఇక మహేష్ బాబుతో పనిచేయడం గురించి ఆమె ఆసక్తికరంగా స్పందించింది. ఆయనతో కలిసి పనిచేయడం ఒక సూపర్ ఫీలింగ్ అని ఆయన ఎంతో మంచి మనసున్న ఓర్పు సహనం కలిగిన వ్యక్తి అని చెప్పుకొచ్చింది. ఆయనతో కలిసి పనిచేయడం నాకు బాగా నచ్చింది అని ఆమె పేర్కొంది.

  Recommended Video

  Akhanda OTT రిలీజ్ పై చిత్ర బృందం రియాక్షన్ | Nandamuri Balakrishna
  పవన్ నా క్రష్

  పవన్ నా క్రష్

  ఇక మీ క్రష్ ఎవరు అని అడగగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూర్య, రణబీర్ కపూర్ అని చెప్పుకొచ్చింది. అలాగే చికెన్ బిర్యానీ ఇష్టమా మటన్ బిర్యానీ ఇష్టమా అంటే అదీ ఇదీ కాదు తను పూర్తిగా వెజ్ తింటాను అని తనకు పెరుగన్నం అంటే ఇష్టం అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ "ఫ్లిప్ ఫ్లాప్" అనే కన్నడ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పనులు లాక్ డౌన్ ముందు వరకు బెంగళూరు పరిసర ప్రాంతంలో జరిగాయి. ఈ సినిమా త్వరలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

  English summary
  Dhanya Balakrishna is a popular actress in telugu and tamil. Latest movies in which Dhanya Balakrishna has acted are Anukunnadi Okati Ayindi Okkati, Software Sudheer, Puzhikkadakan, Hulchul and Sarvajanikarige Suvarnavakaasha. She recently interacted with instagram followers. In that interaction session she shares some interesting facts about her.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X