ఒకప్పుడు సూపర్‌స్టార్‌కే ప్రపోజ్ చేసి .. దారుణంగా హీరోయిన్ జీవితం, గొర్రెలు మేపుకుంటూ
అందం, అభినయం పుష్కళంగా ఉన్నప్పటికీ కొందరు ముద్దుగుమ్మలు ఎందుకో స్టార్ హీరోయిన్ కాలేక కెరీర్‌ను అలాగే కంటిన్యూ చేస్తుంటారు. ఒకటి రెండు సినిమాలు హిట్ అయినా ఆ జోష్‌ను కొనసాగించలేక సెకండ్ హీరోయిన్‌గానే మిగిలిపోతుంటారు. ఈ కోవలేకే వస్తారు కన్నడ కస్తూరి ధన్య బాలకృష్ణ. సెకండ్ హీరోయిన్, హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలతో ఫేమస్ అయిన ధన్యలో మంచి నటి దాగున్నారు. కానీ ఎందుకో ఈమెకు చెప్పుకోదగ్గ బ్రేక్ రాలేదు.
కర్ణాటకకు చెందిన ధన్య బాలకృష్ణ ఉన్నత విద్యావంతురాలు. సినిమాలపై ఆసక్తితో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సెవెన్త్ సెన్స్ అనే సినిమాలో చిన్న పాత్ర పోషించారు. ఆ తర్వాత లవ్ ఫెయిల్యూర్ అనే సినిమాతో తెలుగు వారిని పలకరించిన ధన్య .. హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తూ వెళ్లారు. 14 ఏళ్ల కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా రాజారాణిలో నయనతార ఫ్రెండ్‌గా, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టులో సూపర్‌స్టార్ మహేశ్ బాబుకి ప్రపోజ్ చేసే అమ్మాయిగా గుర్తుండిపోతారు ధన్య. కెరీర్ పీక్స్‌లో ఉండగానే తమిళ నటుడు, దర్శకుడు బాలాజీ మోహన్‌తో ప్రేమలో పడి ఆయనను పెళ్లాడింది ధన్య.

తాజాగా దయా దర్శకత్వంలో తెరకెక్కిన బాపుతో చాలా రోజుల తర్వాత తెలుగువారిని పలకరించారు ధన్య బాలకృష్ణ. బ్రహ్మాజీ, ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరో బలగం అవుతుందని మీడియా, జనాల్లో ఈ సినిమా గురించి బాగా డిస్కషన్ నడిచింది. పల్లెలో తన కుటుంబం కోసం ఆత్మహత్య చేసుకుంటే భీమా కింద వచ్చే డబ్బు ఫ్యామిలీకి దక్కుతుందని ఆశపడే రైతు కథతో ఈ సినిమా తెరకెక్కింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న బాపు రానున్న రోజుల్లో సంచలనం సృష్టిస్తుందని అంతా భావిస్తున్నారు.
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ధన్య బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాపు సినిమా తన కెరీర్‌లోనే మరిచిపోలేని ప్రాజెక్ట్‌గా నిలుస్తుందన్నారు. ఈ సినిమా చేసినందుకు మా నాన్న గారు నాకు ఫస్ట్ టైం ఫోన్ చేసి మెచ్చుకున్నారని ధన్య తెలిపారు. ఎప్పటికైనా నీ కెరీర్‌లో ఓ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో ఉన్న సినిమా చేయమని ఆయన చెప్పేవారని ఇన్ని రోజులకు ఆ కల నెరవేరిందని ఆమె వెల్లడించారు. భారతదేశంలో ఆడపిల్లలు సినిమాల్లోకి వెళ్లడం అంత తేలికకాదని.. నేను నటిని అవుదామని అనుకున్నప్పుడు మా నాన్న నన్ను ప్రోత్సహించారని ధన్య తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి చేయడం ఈజీయే అని కానీ సినిమాల్లోకి వెళ్తామని అమ్మానాన్నల్ని ఒప్పించడం, చుట్టాలను మెప్పించడం చాలా కష్టమని ధన్యమన్నారు.
ఇక బాపు సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు ధన్య బాలకృష్ణ . దీనిలో భాగంగా జమ్మికుంట - కరీంనగర్ హైవేలో ఓ పల్లెటూరిలో గొర్రెలు మేపుతూ వచ్చిపోయే వాళ్లకి హాయ్ చెబుతున్న వీడియోను ఆమె షేర్ చేశారు. దానికి పల్లెటూరి పాప ఫరేవర్ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ధన్య నిబద్ధతపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











