మసాజ్ పిక్ షేర్ చేసిన ఖిలాడి హీరోయిన్: ఒంటిపై నూలుపోగు లేకుండానే!

ఒకప్పుడు తెలుగు అమ్మాయిలు టాలీవుడ్‌లో అవకాశాలను దక్కించుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ, ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. అందుకే ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది లోకల్ బ్యూటీలు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో బెజవాడ చిన్నది డింపుల్ హయాతి ఒకరు. తక్కువ సినిమాల్లోనే నటించినా.. ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుందీ భామ. దీంతో వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటోంది. ఇక, సోషల్ మీడియాలోనూ రచ్చ చేసే డింపుల్.. తాజాగా ఓ మసాజ్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలింది. దానిపై మీరూ లుక్కేయండి మరి!

బెజవాడ నుంచి సినిమాల్లోకి

బెజవాడ నుంచి సినిమాల్లోకి


విజయవాడకు చెందిన డింపుల్ హయాతి హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే మోడల్‌గా ఫేమస్ అయింది. అలా ఆ రంగంలో తన అందచందాలతో అలరించింది. ఈ క్రమంలోనే దర్శక నిర్మాతల దృష్టిని పట్టేసింది. దీంతో డింపుల్ 'గల్ఫ్' అనే సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత ప్రభుదేవా, తమన్నా నటించిన 'అభినేత్రి 2'లో కీలక పాత్ర చేసింది.

ఆ పాటతో కెరీర్ మారిందిగా

ఆ పాటతో కెరీర్ మారిందిగా

కెరీర్ ఆరంభంలో కొన్ని సినిమాలు చేసినా డింపుల్ హయాతికి మంచి గుర్తింపు మాత్రం రాలేదు. దీంతో ఆమెకు ఆఫర్లు కూడా అరకొరగానే వచ్చేవి. ఈ పరిస్థితుల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'గద్దలకొండ గణేష్' మూవీలో డింపుల్ 'సూపర్ హిట్టు' అనే స్పెషల్ సాంగ్‌ను చేసింది. ఇందులో ఆమె కనిపించిన తీరు.. చేసిన స్టెప్పులతో తెలుగు రాష్ట్రాలు షేక్ అయ్యాయి.

అక్కడ వరుస సినిమాలతో

అక్కడ వరుస సినిమాలతో

ఈ మధ్య కాలంలో డింపుల్ హయాతికి ఒక్కసారిగా ఆఫర్లు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఆమె టాలీవుడ్‌లో 'యురేకా' అనే సినిమాలో నటించింది. దీని తర్వాత 'అత్రంగి రే' అనే హిందీ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. అంతేకాదు, 'వీరమై వాగై సూడుమ్' అనే చిత్రంతో కోలీవుడ్‌లోకి ఎంటరైంది. ఇలా చాలా భాషల్లో సినిమాలతో రచ్చ చేసింది.

ఖిలాడిలో రచ్చ.. వరుసగా

ఖిలాడిలో రచ్చ.. వరుసగా

డింపుల్ హయాతి గతంలో చాలా సినిమాల్లో చేసినా రాని గుర్తింపు.. రవితేజ 'ఖిలాడి' వల్ల భారీగా వచ్చింది. ఇందులో ఈ అమ్మడు అదిరిపోయేలా అందాలను ఆరబోసింది. అలాగే, మంచి నటనతో ఆకట్టుకుంది. దీంతో ఈమె ఒక్కసారిగా ఫేమస్ అయింది. దీంతో ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ చేస్తోన్న మూవీలోనూ నటిస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్

సోషల్ మీడియాలో యాక్టివ్

వరుస పెట్టి సినిమాలు చేయకున్నా.. తన రేంజ్‌కు తగ్గట్లుగా కొన్ని సినిమాల్లో సందడి చేస్తోన్న డింపుల్ హయాతి.. సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ తెలుగమ్మాయి తరచూ తనకు, తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంటూ దూసుకెళ్తోంది.

ఎక్కువగా గ్లామర్ షో చేస్తూ

ఎక్కువగా గ్లామర్ షో చేస్తూ

చాలా కాలంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోన్న డింపుల్ హయాతి.. దీని ద్వారా తన అందచందాలను చూపిస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఓ రేంజ్‌లో క్లీవేజ్ షో చేస్తూ రచ్చ చేస్తోంది. దీంతో డింపుల్ హయాతి తరచూ వార్తల్లో నిలుస్తూ ఇంటర్నెట్‌ను ఊపి పడేస్తోంది.

మసాజ్ ఫొటో వదిలిందిగా

మసాజ్ ఫొటో వదిలిందిగా


సోషల్ మీడియాలో యమ హాట్ షో చేస్తూ రెచ్చిపోతోన్న డింపుల్ హయాతి.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ పిక్‌ను స్టోరీగా పెట్టుకుంది. ఇందులో ఆమె డ్రెస్ లేకుండానే ఫేస్ మసాజ్ చేసుకుంటూ కనిపించింది. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇది చాలా తక్కువ సమయంలోనే ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X