హాట్ డ్రెస్‌లో బిగ్ బాస్ దివి గ్లామర్ షో: ఎద భాగంలో టాటూను చూపిస్తూ!
గతంలో కంటే ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ బ్యూటీలు కూడా బాగానే సందడి చేస్తున్నారు. అందం, అభినయంతో చక్కగా మెప్పిస్తూ.. వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటూ దూసుకెళ్తోన్నారు. అలాంటి వారిలో సొట్టబుగ్గల చిన్నది దివి వాధ్యా ఒకరు. బిగ్ బాస్ షో పుణ్యమా అని ఓ రేంజ్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ భామ.. వరుస సినిమాలతో హడాడివి చేసేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే దివి వాధ్యా తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి!

అలా ఎంట్రీ.. గుర్తింపు లేదుగా
చాలా ఏళ్ల క్రితమే దివి వాధ్యా 'లెట్స్ గో' అనే సినిమాతో నటిగా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత 'సీన్ నెంబర్ 72'తో పాటు చాలా చిన్న చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. అలాగే, సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'మహర్షి' మూవీలోనూ చిన్న పాత్రలో కనిపించింది. ఇలా ఎన్నో సినిమాల్లో నటించినా దివికి మాత్రం సరైన గుర్తింపు మాత్రం దక్కలేదనే చెప్పాలి.

బిగ్ బాస్‌తో కెరీర్‌కు టర్నింగ్
చిన్న చిన్న ఛాన్స్‌లతో కెరీర్‌ను సాగిస్తోన్న దివి వాధ్యాకు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కింది. ఇందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే అడుగు పెట్టిన ఈ అమ్మడు అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. అలాగే నిజాయితీగా ఉంటూ ఫాలోయింగ్ పెంచుకుంది. కానీ, మధ్యలోనే ఎలిమినేట్ అయింది. ఇక దీనితో ఆమె కెరీర్ టర్న్ అయింది.

వరుస సినిమాలు.. ఆ సీన్‌తో
దివి వాధ్యాకు బిగ్ బాస్ షో తర్వాత ఆఫర్లు భారీగా వచ్చాయి. ఫలితంగా ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలోనే 'క్యాబ్ స్టోరీస్', 'లంబసింగి' అనే చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. కాన్సెప్ట్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ మూవీలో నటించింది. ఈ క్రమంలోనే 'నయీం డైరీస్' మూవీలో దివి చేసిన హాట్ సీన్ ఎంత హైలైట్ అయింది. ఇది తెగ వైరల్ అవడంతో ఆమె రేంజ్ పెరిగిపోయింది.

చిరంజీవి ఆఫర్.. ఆకట్టుకుని
దివి వాధ్యాకు బిగ్ బాస్ షో చాలా కలిసి వచ్చిందనే చెప్పాలి. దీనికి కారణం.. ఆ సీజన్‌లో ఫినాలేకు గెస్టుగా వచ్చిన చిరంజీవే.. ఆమె అందానికి ఫిదా అయిపోయారు. అంతేకాదు, 'భోళా శంకర్' సినిమాలో చాన్స్ ఇస్తున్నట్లు ప్రకటించారు. కానీ, 'గాడ్ ఫాదర్' చిత్రంలో ఆమెకు మంచి పాత్రను ఇచ్చారు. దీనికి న్యాయం చేస్తూ దివి వాధ్యా తనదైన నటనతో మంచి మార్కులు కొట్టేసింది.

సోషల్ మీడియాలో సందడి
ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తోన్న దివి వాధ్యా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటి నుంచో తెగ సందడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. ఫొటోలు, వీడియోలు వదులుతూ ఆ మధ్య మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గానూ ఎంపికై హవా చూపింది.

గ్లామర్ షోతో సెగలు రేపుతూ
గతంలో కంటే ఇప్పుడు మరింత ఎక్కువగా దివి వాధ్యా సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంది. ఇందులో ఈ అమ్మడు అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో వదులుతూ కుర్రకారును ఉర్రూతలూగిస్తూ వస్తోంది. ఫలితంగా తన క్రేజ్ పెంచుకోవడంతో పాటు నిత్యం వార్తల్లోనే నిలుస్తూ బాగా హైలైట్ అయిపోతోంది.

హాట్ పిక్స్ షేర్ చేసిన దివి
క్యూట్ హీరోయిన్ దివి వాధ్యా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ కవ్విస్తోంది. అంతేకాదు, తన ఎద భాగంలో ఉన్న టాటూను కూడా చూపిస్తూ రెచ్చగొడుతోంది. ఫలితంగా ఈ ఫొటోల్లో దివి అందాలు దారుణంగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌లకు భారీ రెస్పాన్స్ వచ్చి వైరల్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











