15 ఏళ్లకే నన్ను కమిట్మెంట్ అడిగారు.. మగవాళ్లకి కావాల్సింది అదే..

Divyavani: సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఆడవాళ్ల పాలిట శాపంలా మారింది. ఇది ఓ భూతంలా పట్టిపీడిస్తోంది. కేవలం హీరోయిన్ లే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, డాన్సర్స్ లలో చాలామంది ఈ మహమ్మారి బారినపడ్డారు. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్స్ తమ చేదు అనుభవాలను పంచుకుంటూ .. ఇండస్ట్రీలోని సంచలన విషయాలను బయటపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా బాపు బొమ్మ , సీనియర్ హీరోయిన్ దివ్యవాణి తన సినీ జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంది. అలాగే పలువురు మూవీ మేకర్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

బాపు బొమ్మగా పేరు తెచ్చుకుంది దివ్యవాణి. ఈ అమ్మడు కెరీర్ లో 'పెళ్లి పుస్తకం' మూవీ ఓ మైల్ స్టోన్ గా నిలిచింది. బాపు బొమ్మగా పాపులారిటీ సొంతం చేసుకున్న దివ్యవాణి..'ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం', 'ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్' వంటి పలు విజయాలతో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది. ఆ తరువాత ఆమె నటనకు తగిన స్థాయిలో గుర్తింపు రాలేదు. అడపాదడపా కొన్ని సినిమాల్లో నటించి హిట్ కాకపోవడంతో గత కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరమయ్యింది. రీ ఎంట్రీ తరువాత అప్పుడప్పుడూ క్యారెక్టర్ యాక్టింగ్ గా చేస్తుంది. ఈ హీరోయిన్ తన కెరీర్లో తెలుగు లోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళ సినిమాలలో నటించి, సౌత్ ఇండియా ప్రేక్షకులను మెప్పించింది తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది బాపు బొమ్మ దివ్యవాణి.

Actress Divya Vani made comments about the casting couch in the film industry

తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొని.. ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీలోని కాస్టింగ్ కౌచ్, మీటు మూవ్మెంట్ వంటి సంచలన విషయాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇండస్ట్రీలో కేవలం హీరోయిన్ లే కాకుండా జూనియర్ ఆర్టిస్టులు , క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఇతర యాక్టర్లు కూడా ఇలాంటి ఇబ్బందులకు గురయ్యారని పేర్కొన్నారు. అయితే ఇండస్ట్రీలో అందరూ ఇలాంటి మార్గాల వైపు వెళ్లారని, వందలో ఒక్క శాతం మాత్రమే ఇలాంటి చెడు దారులను ఎంచుకొని ముందుకు వెళ్లాలని భావిస్తారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

కొంతమంది మూవీ మేకర్స్ కొత్తగా వచ్చిన వారికి కమిట్మెంట్ ఇవ్వకుంటే.. ఛాన్సులు ఇవ్వరు అనే విధంగా పరిస్థితులను క్రియేట్ చేస్తారని, అలాంటి సందర్భంలో వారు పరిస్థితులను బట్టి లొంగిపోతారని, కానీ ఎవరికి కూడా వారు మనస్ఫూర్తిగా తమను తాము సమర్పించుకోరని, అలాంటి సందర్భంలో వారు ఎంతో మనోవేదనకు గురి అవుతారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఈ సమయంలో దివ్యవాణి తన అనుభవాన్ని చెబుతూ.. నాకు 15 ఏళ్ల వయసులో ఓ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆల్మోస్ట్ నన్ను ఓకే చేశారు. మొదట చూడగానే ఈ అమ్మాయి బొమ్మలాగా అందంగా ఉంది అంటూ పొగడారు. కానీ వారు అనుకున్న విధంగా నేను లేకపోయేసరికి ఆ క్యారెక్టర్ నుండి నన్ను తీసేశారు' అంటూ తన చేదు అనుభవాన్ని బయట పెట్టింది దివ్యవాణి. తాను తన పదో తరగతి పూర్తికాగానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని, చూసిన ప్రతి మూవీ మేకర్ తనని బాగుంది అంటూ పొగడ్తలు గుప్పించే వారిని చెప్పుకొచ్చింది.

అయితే ప్రతి షూటింగ్లోనూ తన తల్లి తన వెంటనే ఉండేదని, అలాంటి విషయాలను తన దగ్గరికి రాకుండా చూసుకునేది అంటూ ఎమోషనల్ అయింది దివ్యవాణి. అలా కమిట్మెంట్ ఇవ్వకపోయేసరికి తాను పెద్దపెద్ద హీరోల సరసన నటించే అవకాశాన్ని కోల్పోయానని, మూవీ మేకర్స్ తనని రిజెక్ట్ చేశారంటూ బాధపడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X