Who is Divyanka Sirohi? 30 ఏళ్లకే గుండెపోటు.. వర్ధమాన తార దివ్యాంక కన్నుమూత
భారతీయ సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొన్నది. వర్థమాన తార దివ్యాంక సిరోహి 30 ఏళ్ల వయసులోనే కన్నుమూయడంతో సినీ ప్రముఖులు దిగ్బ్రాంతికి గురయ్యారు. ఇప్పుడిప్పుడే టాలెంటెడ్ నటిగా పేరు తెచ్చుకొంటున్న ఆమె ఇక లేరనే వార్త ప్రస్తుతం అందర్నీ విషాదం ముంచెత్తింది. ఆయె అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటున్నారు. ఎవరీ దివ్యాంక సిరోహి అనే వివరాల్లోకి వెళితే..
దివ్యాంక సిరోహి ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బులంద్ షహర్ నివాసి. తన తల్లిదండ్రులు, అమ్మమ్మతో కలిసి ఘజియాబాద్‌లో నివసిస్తున్నారు. చరణ్ సింగ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీలో పట్టబద్రులయ్యారు. ప్రస్తుతం సిక్కిం యూనివర్సిటీలో ఎంబీఏ చేస్తున్నారు. ఆమెకు హిమంషు అనే సోదరుడు, దీపాంశు, జస్మీత్ అనే సోదరి ఉన్నారు అని స్నేహితులు, సన్నిహితులు తెలిపారు.

దివ్యాంక తన యాక్టింగ్ కెరీర్‌ను మ్యూజిక్ ఆల్బమ్‌లో నటించడం ద్వారా ప్రారంభించారు. మాసూమ్ శర్మతో కలిసి పలు పాటల్లో కనిపించారు. ఉత్తరాదిలోని ప్రాంతీయ భాషల్లో నటిస్తూ గుర్తింపు పొందుతున్నారు. ముఖ్యంగా హర్యానాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకొన్నారు. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో విశేషంగా ఆకట్టుకొంటున్నారు. బాలీవుడ్ అవకాశాల కోసం ప్రయత్నిస్తుండగా ఈ దారుణం చోటు చేసుకొన్నది అని కుటుంబ సభ్యులు తెలిపారు.
హర్యానా భాషలో దివ్యాంకకు మంచి గుర్తింపు, పాపులారిటీ ఉంది. దాదాపు 50 కుపైగా పాటల్లో నటించారు. కేడీ, అమిత్ సైనీ లాంటి వారితో కలిసి నటించింది. అద్బుతమైన నటనతోపాటు స్క్రీన్ ప్రజెన్స్‌తో పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకొన్నారు. హర్యానా స్థానిక మ్యూజిక్ రంగంలో తనకంటూ ఓ ముద్ర వేసుకొన్నారు.
దివ్యాంక మృతి గురించి కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. మంగళవారం (ఏప్రిల్ 21) రాత్రి గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆమెను సమీపంలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లాం. వైద్యులు పరీక్షించిన తర్వాత అప్పటికే మరణించారని ధృవీకరించారు. దాంతో తాము తీవ్ర విషాదంలో కూరుకుపోయాం అని కుటుంబ సభ్యులు తెలిపారు.
దివ్యాంక మృతిని స్థానికులు, స్థానిక కళాకారులు జీర్ణించుకోలేకపోయారు. బుధవారం ఉదయం కన్నీటితో చివరి యాత్రను నిర్వహించారు. ఘజియాబాద్‌లో వేలాది మంది తరలిరాగా, కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియలు జరిపించారు. వర్థమాన తార అర్థాంతరంగా రాలిపోయిందనే ఆవేదన వ్యక్తం చేస్తూ శ్రద్దాంజలి ఘటించారు.


Click it and Unblock the Notifications


