నువ్వే నా మొదటి పెళ్లామని వేధింపులు.. డైరెక్టర్ యవ్వారాన్ని బయటపెట్టిన దివ్యవాణి

Divya Vani: దివ్యవాణి ..90లలో స్టార్ హీరోయిన్ వరుస సినిమాలు చేశారు. ఆమె కెరీర్ లో 'పెళ్లి పుస్తకం' సినిమా ఓ మైల్ స్టోన్ గా పేర్కొనవచ్చు. ఈ సినిమాతో దివ్యవాణికి ఎనలేని పాపులారిటీ సొంతం చేసుకుంది. అలాగే.. 'ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం', 'ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్' వంటి సినిమా బ్లాక్ బస్టర్ విజయాలతో వరుస విజయాలను అందుకున్నది హీరోయిన్ దివ్యవాణి. ఆ తరువాత ఆమె నటనకు తగినస్థాయిలో గుర్తింపు రాలేదు. అడపాదడపా కొన్ని సినిమాల్లో నటించి హిట్ కాకపోవడంతో గత కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరమయ్యింది. అలాంటి దివ్యవాణి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ డైరెక్టర్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏమన్నాదంటే..?

సీనియర్ నటి దివ్యవాణి ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ..తాను ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్నానని, అయితే.. తనతో వర్క్ చేసిన ఓ పెద్ద డైరెక్టర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అతడు వయసులో చాలా పెద్దవాడని, ఎన్నో హిట్ సినిమాలకు డైరెక్షన్ చేశారని, కానీ, మాట్లాడేటప్పుడు.. మేమిద్దరం చేసిన మొదటి సినిమా పేరు చెబుతూ.. తనని మొదటి పెళ్ళాం అంటూ అసభ్యకరంగా సంబోధించాడంటూ ఎమోషనల్ అయింది. అయితే ఆయనే ఏ దృష్టితో అన్నారు తనకు తెలియదు కానీ, అలా అనవలసిన అవసరం ఏముందనేది తన ఆవేదన అని చెప్పుకొచ్చారు.

Actress Divyavani made shocking comments on Tollywood director

ప్రస్తుతం తాను ఓ పొలిటిషన్ గా, సమాజంలో ఎన్నో మంచి పనులు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్నానని, అలాగే తనకు ఒక కుటుంబం ఉందని పెళ్ళికి ఎదిగిన పిల్లలు కూడా ఉన్నారని, అలాంటి మాటలను వారి వెంటే ఎలా అర్థం చేసుకుంటారోనని బాధపడ్డారు. ఈ రోజులలో సోషల్ మీడియా చాలా దారుణంగా ఉందని, వాళ్లు ఎలాంటి కామెంట్స్ పెట్టి ట్రోల్ చేస్తారు. భయంగా ఉందని, తన లైఫ్ ఏం కావాలని ఆగ్రహం వ్యక్తం చేసింది.

యూట్యూబ్ లలో తంబునెల్స్ చూస్తుంటే భయమేస్తుందని, ఎంత ఎదిగిన అలాంటి వ్యాఖ్యలతో తమ కీర్తి పడిపోయిందని చాలామంది బాధపడుతున్నారని చెప్పుకొచ్చారు దివ్యవాణి. ఆ తర్వాత ఆయన మాట్లాడిన విషయాలను సరిదిద్దుతూ తాను మాట్లాడాల్సి వచ్చిందని, తను మాట్లాడుతూ.. పూజ్యులు, పెద్దలు, తండ్రి సమానులు అంటూ ఆయనను సంబోధిస్తూ.. ఆయనతో వర్క్ చేసిన సినిమాల గురించి తాను చెప్పుకుంటూ వచ్చానని. ఆనాడు హీరోయిన్స్ ఎలా పద్ధతిగా ఉండేవారు క్లియర్ గా చెప్పుకుంటూ వచ్చానని అన్నారు దివ్యవాణి. ఇలా తనని తాను కవర్ చేసుకోవాల్సి వచ్చిందని దివ్యవాణి బాధపడింది.

Actress Divyavani made shocking comments on Tollywood director

ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు మీడియా ఉంది. నలుగురు ఏ విధంగా అర్థం చేసుకుంటారో కనీసం ఆలోచించాలని సూచించారు. ఒకవేళ ఆయనకు, తనకి ఏదైనా రిలేషన్ ఉంటే అది వేరని, కానీ ఇలాంటి సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు దివ్యవాణి.‌ ఈ మధ్యకాలంలో తాను రాజకీయాలలో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నానని, తనకు ముక్కు ముఖం తెలియని వారు చాలామంది ఫోన్ చేసి తనతో క్లోజ్ గా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారని, అలాంటి సందర్భాలు కాస్త ఇబ్బంది గురిచేస్తాయని బాధపడ్డారు దివ్యవాణి.‌

More from Filmibeat

Read more about: divyavani bapu tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X