అమ్మకు భర్త అయినా.. నా తండ్రి అంటే ఒప్పుకోను.. భర్తతో విడాకులు బాధించలేదు
హైదరాబాదీ అందాల భామ దియా మిర్జా నటిగానే కాకుండా జంతు సంరక్షణ కార్యకర్తగా, సామాజిక కార్యకర్తగా పలు రకాల భూమికలు పోషిస్తున్నారు. ఇక వ్యక్తిత్వం విషయానికి వస్తే మానసికంగా బలంగా, స్వతంత్రంగా వ్యవహరిస్తారనేది పలు సందర్బాల్లో వ్యక్తమైంది. అయితే పలు మార్లు తన జీవితంలోని విషాద సంఘటనలను, అలాగే అనుభవించిన కష్టాలను చెప్పుకోవడం తెలిసిందే. తాజాగా మరోసారి తన వ్యక్తిగత జీవితాన్ని మీడియాతో పంచుకొన్నారు. తన తల్లి రెండో పెళ్లి గురించి, తన భార్తతో విడాకుల గురించి మాట్లాడుతూ..

నా భర్తతో విడాకుల కంటే
నా భర్తతో విడాకుల కంటే.. నా తల్లికి మా నాన్న ఇచ్చిన విడాకులే చాలా బాధకు గురిచేస్తాయి. అప్పుడ నా వయసు 4 సంవత్సరాలు. కానీ తండ్రిలేని జీవితం ఎంతో ఇబ్బందికరంగా మారింది. బాల్యంలో తండ్రిలేని లైఫ్ ఎలా ఉంటుందంటే మాటల్లో చెప్పలేమని దియా మిర్జా అన్నారు.

నా తల్లిదండ్రులు కలిసి ఉండలేక
నా తల్లిదండ్రుల మధ్య అనురాగాలు, ప్రేమ ఎక్కువగానే ఉండేవి. ఒకరంటే మరికొరికి చచ్చేంత ప్రేమ. కానీ వారి వ్యక్తిగత జీవితాల్లోని అసంతృప్తి.. వైవాహిక జీవితంపై పడంది. దాంతో వారిద్దరు కలిసి ఉండలేకపోయారు. జీవితంలో ఇంకా ఏదో ఆశించేవారు. ఇప్పటికీ నా బాల్యంలోని పరిస్థితులు వెంటాడుతూనే ఉంటాయి అని దియా మిర్జా భావోద్వేగానికి గురయ్యారు.

నా రెండో తండ్రిని ఇష్టపడలేదు
మా నాన్నతో విడిపోయిన తర్వాత అమ్మ మరోకరి వివాహం చేసుకొన్నది. కానీ నా మారు తండ్రితో అనుబంధాన్ని పెంచుకోలేకపోయాను. కానీ అతడో అద్బుతమైన మనిషి. నా తండ్రి అని భావించడానికి చాలానే సమయం పట్టింది. చాలా తెలివిగా తనను నేను ప్రేమించేలా చేశాడు. మా మధ్య ప్రేమబంధం బలపడుతుండగానే ఆయన మమల్ని విడిచి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు అని దియా ఎమోషనల్ అయ్యారు.

నా ఇద్దరి తండ్రుల మరణం అలా
నాకు 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నా సొంత తండ్రి చనిపోయారు. ఆ తర్వాత 23 ఏళ్ల వయసులో మా రెండో నాన్నను కోల్పోయాను. కానీ నా జీవితంపై ఆ ఇద్దరి ప్రభావం చాలా స్పష్టంగా ఉంది. వారి లేని లోటు నా జీవితంలో ఎప్పటికీ పూడ్చలేనిదని దియా మిర్జా భావోద్వేగానికి లోనయ్యారు.
Recommended Video


తప్పడు విజయోత్సావం
బాలీవుడ్‌లో ఆచీతూచీ సినిమాలు చేసే దియా మిర్జా లేటేస్టుగా తప్పడ్ అనే చిత్రంలో నటించింది. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించిన చిత్రంలో తాప్సీ పన్నుతో కలిసి కీలక పాత్రలో మెరిసింది. ప్రస్తుతం దియా మీర్జా తప్పడ్ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











