ఇక వారి విమానాలు ఎక్కనుగాక ఎక్కను.. ఇషా రెబ్బ!
విమాన సంస్థలు సెలెబ్రిటీలని అవమానించడం కొత్త విషయం కాదు. కేవలం సెలెబ్రిటీలకే కాదు సాధారణ ప్రయాణికులకు కూడా కొన్ని విమానయాన సంస్థలు చుక్కలు చూపిస్తున్నాయి. తెలుగు హీరోయిన్ ఇషా రెబ్బ తనకు ఇండిగో సంస్థ నుంచి ఎదురైనా చేదు అనుభవాన్ని వివరించింది.
ఓ అభిమాని సోషల్ మీడియాలో ఇండిగో సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించాడని వివరించాడు. అకారణంగా తనని నిలిపివేయడమే కాక ఆలస్యంగా వచ్చానని దూషించారని తెలిపాడు. దీనిపై ఇషా రెబ్బ స్పందించింది. గతంలో తనకు కూడా ఇండిగో నుంచి ఇలాంటి అవమానమే ఎదురైందని ఇషా తెలిపింది.

అప్పటి నుంచి తాను ఇకపై ఇండిగో విమానంలో ప్రయాణించకూడదని నిర్ణయించుకున్నట్లు ఇషా తెలిపింది. ఇండిగో సంస్థ విషయంలో నెటిజన్లు ఇషా అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. ఇండిగో ప్రయాణికుల్ని గౌరవించడం తెలియని సంస్థ అని దుమ్మెత్తి పోస్తున్నారు.


Click it and Unblock the Notifications