తెలుగు పిల్ల ఓవర్ ఎక్స్‌పోజింగ్: అసలే టైట్ డ్రెస్.. అందులో అందాలు దాగుతాయా!
మొదటి తరం తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలు హీరోయిన్లుగా రాణించిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. అందుకే వేరే రాష్ట్రాలకు చెందిన భామలే ఇక్కడ హవాను చూపిస్తూ వస్తున్నారు. అయితే, ఈ మధ్య కాలంలో తెలుగు అమ్మాయిలూ సత్తా చాటుతోన్నారు. అందులో ఈషా రెబ్బా ఒకరు.
అందం, అభినయంతో రాణిస్తోన్న ఈ బ్యూటీ.. వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. అయితే, ఈ మధ్య స్పీడు తగ్గినా వేరే భాషల్లో దూసుకెళ్తోంది. అలాగే, ఈషా సోషల్ మీడియాలోనూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని పిక్స్ వదిలింది. అవి మీకోసం!

అలా వచ్చిన తెలుగు పిల్ల: అచ్చ తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' అనే మూవీతో నటిగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టుకుంది. ఆ వెంటనే 'అంతకు ముందు ఆ తర్వాత' అనే రొమాంటిక్ మూవీతో హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టుకుంది. ఇది మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు ఆమె యాక్టింగ్ పరంగా మెప్పించడంతో ఈషా ఆరంభంలోనే హైలైట్ అయిపోయింది.
వరుసగా ఆఫర్లు వచ్చినా: మొదటి చిత్రంతోనే ఆకట్టుకున్న ఈషా రెబ్బా.. ఆ తర్వాత 'బందిపోటు', 'అమీతుమీ', 'దర్శకుడు', 'ఆ!', 'బ్రాండ్ బాబు', 'సుబ్రమణ్యపురం', 'రాగల 24 గంటల్లో' సహా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. అయితే, వీటిలో కేవలం ఓ రెండు మూడు సినిమాలే హిట్ అయ్యాయి. అయినప్పటికీ ఆమెకు అవకాశాలు మాత్రం భారీగానే వెల్లువెత్తాయి.

అజాగ్రత్తతో ఇబ్బందులు: ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటనతో మైమరపించే ఈషా రెబ్బాకు ఆశించిన రీతిలో ఆఫర్లు మాత్రం రావడం లేదు. దీనికి కారణం కెరీర్ ఆరంభంలోనే కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకుండా సినిమాలు చేస్తూ వెళ్లడమే అని చెప్పొచ్చు. మధ్యలో కొన్ని భారీ ఆఫర్లు వచ్చినా అది ఆమెకు కలిసి రాలేదు. దీంతో ఇప్పుడు టాలీవుడ్‌లో ఈషా కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది.
ఆ భాషల్లో ఫుల్ బిజీగానే: గతంలో మాదిరిగా ఈషా రెబ్బా తెలుగులో అవకాశాలను సొంతం చేసుకోలేకపోతోంది. అయినప్పటికీ అడపాదడపా బిగ్ స్క్రీన్‌పై సందడి చేస్తూనే ఉంది. కానీ, వేరే భాషల్లో మాత్రం ఈ బ్యూటీ బిజీగా మారింది. ఇప్పటికే ఈషా రెబ్బా మలయాళంలో 'ఒట్టు', తమిళంలో 'నితమ్ ఓరు ఓనమ్', 'ఆయిరామ్ జన్మంగళ్' అనే సినిమాలు చేసింది. దీంతో అక్కడా సత్తా చాటుతోంది.

సోషల్ మీడియాలో రచ్చ: సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ సత్తాను చాటుకుంటోన్న ఈషా రెబ్బా.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా గడుపుతోంది. ఈ క్రమంలోనే తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్ విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతూ తన రేంజ్ పెంచుకుంటోంది.
హాట్ ఫొటోలు వదులుతూ: సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా తెగ హడావిడి చేస్తోన్న తెలుగు పిల్ల ఈషా రెబ్బా.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. ఈ మధ్య కాలంలో మరింతగా డోస్ పెంచేసిన ఈ చిన్నది హాట్ డ్రెస్‌లలో ఘాటు ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతోంది. దీంతో ఈషా రెబ్బా అందరి దృష్టినీ ఆకర్షించేలా హైలైట్ అవుతోంది. దీంతో ట్రెండింగ్‌లో ఉంటోంది.

షార్ట్ డ్రెస్‌లో హాట్ ట్రీట్: సోషల్ మీడియాలో యమ సందడి చేస్తోన్న ఈషా రెబ్బా తాజాగా కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. వీటిలో ఆమె షార్ట్ డ్రెస్ వేసుకుని రచ్చ చేసింది. ఫలితంగా వీటిలో ఆమె ఎద, తొడ భాగాలు బాగా కనిపిస్తున్నాయి. దీంతో ఈషా రెబ్బా షేర్ చేసిన ఈ ఫొటోలకు మంచి స్పందన లభిస్తోంది. ఫలితంగా ఇవన్నీ తక్కువ సమయంలోనే వైరల్ అయిపోతోన్నాయి.


Click it and Unblock the Notifications











