షర్ట్ విప్పేసి ఈషా రెబ్బా సెల్ఫీ వీడియో: ఒక్కసారిగా అలా కనిపించడంతో!

తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలు పెద్దగా కనిపించరు అన్న టాక్ ఉంది. అయితే, ఇప్పుడు పలు కారణాల వల్ల హైలైట్ అయిన చాలా మంది తెలుగు భామలు టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోన్నారు. అలా చాలా రోజుల క్రితమే హీరోయిన్‌గా పరిచయమై.. సినిమాల మీద సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది తెలుగందం ఈషా రెబ్బా. ఆకట్టుకునే అందం.. అద్భుతంగా నటించగల టాలెంట్ ఉన్న ఈ చిన్నది.. ఎందుకనో పెద్దగా సక్సెస్‌లు కొట్టలేకపోయింది. కానీ, అవకాశాలను మాత్రం అందుకుంటూ సత్తా చాటుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈషా రెబ్బా ఓ సెల్ఫీ వీడియో వదిలింది. దానిని మీరూ చూసేయండి మరి!

అలా ఎంట్రీ.. హీరోయిన్‌గా

అలా ఎంట్రీ.. హీరోయిన్‌గా

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే ఈషా రెబ్బా మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అక్కడ తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసిన ఈ భామ.. మంచి గుర్తింపును అందుకోవడంతో పాటు సినిమా ఛాన్స్‌లు కూడా పట్టేసింది. ఈ క్రమంలోనే 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' మూవీతో పరిచయమైంది. తర్వాత 'అంతకు ముందు ఆ తర్వాత' మూవీతో హీరోయిన్‌గా కెరీర్ ఆరంభించింది.

సినిమాలు చేసినా నిరాశగా

సినిమాలు చేసినా నిరాశగా

అందం, అభినయంతో కెరీర్ ఆరంభంలోనే ఈషా రెబ్బా అందరి దృష్టినీ ఆకట్టుకుని ఆఫర్లను పట్టేసింది. ఈ క్రమంలోనే 'బందిపోటు', 'అమీతుమీ', 'దర్శకుడు', 'ఆ!', 'బ్రాండ్ బాబు', 'సుబ్రమణ్యపురం', 'రాగల 24 గంటల్లో' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే, ఆమె చేసిన సినిమాల్లో కేవలం రెండు మూడు మాత్రమే సక్సెస్ అయ్యాయి.

ఆ భాషల్లో మూవీలు చేస్తూ

ఆ భాషల్లో మూవీలు చేస్తూ

ఈషా రెబ్బా ఒకవైపు హీరోయిన్‌‌గా నటిస్తూనే.. మరోవైపు సెకెండ్ లీడ్‌గానూ చూయడానికి సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగానే 'అరవింద సమేత.. వీరరాఘవ', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి మూవీల్లో చేసింది. అయితే, వాటి ద్వారా భారీ ఆఫర్లను మాత్రం దక్కించుకోవడంలో విఫలం అవుతోంది. అలాగే, 'పిట్ట కథలు' అనే వెబ్ సిరీస్‌లోనూ నటించింది.

టాలెంట్ ఉన్నా లక్ లేదు

టాలెంట్ ఉన్నా లక్ లేదు


ఈషా రెబ్బాకు నటిగా కావాల్సిన అర్హతలు అన్నీ ఉన్నాయి. కానీ, లక్ మాత్రం ఆమెకు పెద్దగా అందడం లేదు. అందుకే ఎన్నో సినిమాలు చేసినా పెద్ద బ్రేక్ మాత్రం రాలేదు. కానీ, ఆఫర్లను మాత్రం అందుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆమె వేరే భాషల్లో బిజీ అయింది. ప్రస్తుతం ఈషా మలయాళంలో 'ఒట్టు', తమిళంలో 'ఆయిరామ్ జన్మంగల్' అనే మూవీలు చేస్తోంది.

సోషల్ మీడియాలో రచ్చ

సోషల్ మీడియాలో రచ్చ

హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోన్నా.. ఈషా రెబ్బా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. దీంతో ఆమె ఫాలోవర్లు భారీగా పెరుగుతున్నారు.

గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న ఈషా

గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న ఈషా

సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోన్న తెలుగు భామ ఈషా రెబ్బా.. అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే హాట్ డ్రెస్‌లలో హాట్‌గా ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతోంది. దీంతో ఈషా రెబ్బా అందాల ఆరబోతలోనూ తగ్గేదేలేదంటూ చాటుకుంటోంది. ఇలా తన అందాలతో ఈ బ్యూటీ తెగ హైలైట్ అయిపోతోంది.

సెల్ఫీ వీడియోలో హాట్‌గా

సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే ఈషా రెబ్బా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ సెల్ఫీ వీడియోను షేర్ చేసింది. ఇందులో ముందుగా ఓ షర్ట్ ధరించి కనిపించిన ఈ సుందరి.. ఆ వెంటనే క్లీవేజ్ షో చేసే డ్రెస్‌తో దర్శనమిచ్చింది. ఇందులో ఆమె అందాలు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా దీనికి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఇది తెగ వైరల్ అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X