ఆ ప్లేస్‌లో సర్జరీలు చేయించుకోమన్నారు .. ఈషా రెబ్బ సంచలన వ్యాఖ్యలు
అందంగా కనిపించాలని, నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలని అమ్మాయిలు కోరుకుంటూ ఉంటారు. అదే అమ్మాయి సెలబ్రెటీ అయితే అందంపై తపన మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ గ్లామర్ ఫీల్డ్‌లో ఎంత అందంగా ఉంటే అన్ని అవకాశాలు వస్తాయని వారి భావన. అందుకే గ్లామర్‌గా కనిపించేందుకు , వయసు ప్రభావం తగ్గించుకునేందుకు తారలు నానాతంటాలు పడుతూ ఉంటారు. యోగా, వర్కవుట్లు, కఠినమైన డైట్ ఫాలో అవుతూ అందానికి మెరుగులు దిద్దుతూ ఉంటారు. ఇంకొందరైతే సర్జరీలు చేయించుకునేందుకు కూడా వెనుకాడరు.
హీరోయిన్లు ఎక్కువగా పెదాలు, ముక్కుకి సర్జీలు చేయించుకుంటారని తరచుగా వినిపించే మాట. గతంలో బాలీవుడ్‌కే పరిమితమైన కాస్మోటిక్స్, ప్లాస్టిక్ సర్జరీలు ఇప్పుడు అన్ని వుడ్‌లకు పాకాయి. అయితే కొందరికి సర్జరీలు సక్సెస్ కాగా.. ఇంకొందరికి వికటించాయి.

ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ సర్జరీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు హీరోయిన్ ఈషా రెబ్బ. ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె.. తన స్కీన్ టోన్ చూసి చాలామంది తెల్లగా అవ్వొచ్చు కదా అని చెప్పారని పేర్కొన్నారు. అయితే ఇంజెక్షన్, సూది చూస్తేనే తనకు చాలా భయమని ఈష అన్నారు. తన క్లోజ్ ఫ్రెండ్ ఒకరు ముక్కుకి సర్జరీ చేయించుకున్నారని.. అది తెలిసి ఇలాంటిది కూడా ఒకటి ఉంటుందా అని తాను ఆశ్చర్యపోయానని ఆమె పేర్కొన్నారు.
అలాగే నేను నవ్వినప్పుడు పంటి చిగుళ్లు కనిపిస్తాయని.. దీంతో కొందరు దానికి కూడా సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారని ఈషా గుర్తుచేశారు. ఈ విషయంలో తానెవ్వరిని తప్పుబట్టనని.. ఎవరి ఇష్టాయిష్టాలు వారికి ఉంటాయని ఆమె అన్నారు. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదేళ్లు అవుతోందని.. తనకు ఇక్కడ పరిచయస్తులు, గాడ్ ఫాదర్‌లు ఎవరూ లేరని ఈషా అన్నారు.

కాలేజీలో ఉండగానే మోడలింగ్ చేశానని, అది చూసి డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ అడిషన్‌కి పిలిపించారని ఆమె తెలిపారు. యాక్టర్ అవ్వాలని తానెప్పుడూ అనుకోలేదని, ఒకదానికొకటి అలా జరిగిపోయానని చెప్పారు. ఇదిలావుండగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత మూవీ విషయంలో తనను మోసం చేశారంటూ ఈషా రెబ్బ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనను తొలుత హీరోయిన్ అని చెప్పి.. తర్వాత సీన్లను కట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిమేల్ లీడ్స్‌లో ఒకరి క్యారెక్టర్ నాదని త్రివిక్రమ్ మాట ఇచ్చారని.. కానీ చివరికి తాను నటించిన సీన్లను కత్తిరించేశారని ఆమె నిరాశ వ్యక్తం చేశారు. ఈ సినిమా కోసం తాను హార్లీ డేవిడ్‌సన్ బైక్ నడపటం కూడా నేర్చుకున్నానని గుర్తుచేసుకున్నారు.

అలాగే పీరియడ్స్ సమయంలో షూటింగ్‌లో పడే ఇబ్బందులు గురించి చెబుతూ ఈషా రెబ్బ ఎమోషనల్ అయ్యారు. అర్ధం చేసుకునే డైరెక్టర్లు ఉంటే వాళ్లకు సమస్య చెప్పి కాసేపు రెస్ట్ తీసుకుంటానని , పీరియడ్స్‌లో ఉన్నా షూటింగ్‌లో పాల్గొనాల్సిందేనని ఆమె చెప్పారు. కొన్నిసార్లు పెయిన్ కిల్లర్స్ వేసుకుని మరీ తాను షూటింగ్‌లో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయని ఈష వివరించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











