Esha Gupta: కళ్ళు చెదిరే బికినీ అందాలతో స్టన్నింగ్.. ఈశా గుప్తా మైండ్ బ్లోయింగ్!
మోడల్ గా గుర్తింపుని అందుకొని ఆ తర్వాత వెండితెరపై గ్లామరస్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న వారిలో ఈషా గుప్తా ఒకరు. ఈ బ్యూటీ గ్లామరస్ పాత్రలకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటుంది. అదేవిధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలు కూడా నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ఆమె ఇదివరకే చాలాసార్లు బికినీ అందాలతో ఎన్నో ఫొటో షూట్స్ తో ఆశ్చర్యపరిచింది. కానీ ఎప్పటికప్పుడు తనను తాను సరికొత్తగా ప్రజెంట్ చేసుకుంటూనే ఉంది. రీసెంట్ గా మరోసారి ఈషా గుప్తా మతిపోయే బికినీ అందాలతో స్టన్ అయ్యేలా చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

మొదట్లోనే హిట్ సినిమాలు
జన్నత్ 2, రాజ్ 3D వంటి సినిమాలతో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈషా గుప్తా గ్లామరస్ హీరోయిన్ గా మంచి గుర్తింపు అందుకుంది. మొదట్లోనే ఈ బ్యూటీకి మంచి సినిమా ఆఫర్స్ రావడంతో రెమ్యునేషన్ కూడా పెంచి వార్తల్లో నిలిచింది. నటిగా కూడా గుర్తింపు అందుకుంది. మరోవైపు గ్లామర్ తో కూడా ఎట్రాక్ట్ చేయడంతో మంచి ఆఫర్లు వచ్చాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక మీడియం రేంజ్ హీరోలతో ఆమె వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చింది.

సౌత్ ఇండస్ట్రీలో కూడా
కేవలం రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా విభిన్నమైన ప్రయోగాత్మకమైన సినిమాలలో కూడా ఈషా గుప్తా మంచి పాత్రలలో నటించింది. హిందీ తో పాటు సౌత్ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాలలో నటించింది. ముఖ్యంగా అప్పట్లో తెలుగులో సచిన్ జోషి నటించిన వీడెవడు సినిమాలో కూడా విభిన్నమైన గ్లామర్ పాత్రలో కనిపించింది. అయితే ఆ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది.

రామ్ చరణ్ సినిమాలో
ఇక 2018 తర్వాత ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు అయితే రాలేవు. అందుకే స్పెషల్ సాంగ్స్ లో కూడా కనిపించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా రామ్ చరణ్ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ సినిమాలో ఏక్ బార్ ఏక్ బార్ అనే పాటలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక తర్వాత మళ్లీ బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యి అక్కడే కొన్ని డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ కొనసాగుతోంది.

బికినీ లుక్ వైరల్
అయితే కేవలం సినిమాలతోనే కాకుండా ఈషా గుప్తా గ్లామరస్ అందాలతో కూడా ఎంతగానో ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ బ్యూటీ ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేసిన కూడా నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. రీసెంట్ గా మరోసారి ఈషా గుప్తా బికినీ అందాలతో స్టన్ అయ్యేలా చేసింది. గతంలో చాలా సార్లు బికినీలో కనిపించినప్పటికీ ఈసారి మరింత ఘాటుగా కనిపించింది.. అంటూ ఆమె ఫాలోవర్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

వెబ్ సీరీస్ లతో బిజీగా..
ఇక ఈశా గుప్తా సినిమాల విషయానికి వస్తే.. 2019 వరకు కాస్త బిజీగా కనిపించిన ఈ బ్యూటీ గత రెండేళ్ళ కాలంలో ఒక్క సినిమాతో కూడా వచ్చింది లేదు. ఎక్కువగా వెబ్ సీరీస్ లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఆశ్రమ్ అనే సీరీస్ తో బాగానే ఆకట్టుకున్న ఈశా ఇప్పుడు మూడవ సీజన్ లో కూడా నటిస్తోంది. అలాగే హెరా పేరి అనే మరో సినిమాలో నటిస్తోంది. మరి ఈ సినిమాలతో ఎంతవరకు గుర్తింపు అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











