కమిట్ కావలసిందేనన్నారు.. లేదంటే అంతా అయిపోతుందని బెదిరింపులు.. నోరు విప్పిన ఎస్తేర్ నొరోన్హా!
టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఎస్తేర్ ఆ తర్వాత సింగర్ నోయల్ తో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. వివాహం జరిగిన ఆరు నెలల లోపే వీరి విడాకుల కోసం ప్రయత్నాలు చేయడం సంచలనంగా మారింది. అలా విడాకులు తీసుకుని అప్పటి నుంచి కనపడని ఈ భామ మళ్ళీ సినిమాల్లో మెరవాలనే ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే మీడియా సంస్థలకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఆ ఇంటర్వ్యూలలో భాగంగా తెలుగు సినీ పరిశ్రమలో మీద లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని సినిమా అవకాశాల కోసం కమిట్మెంట్ అడిగారనే విషయాలను ఆమె వెల్లడించింది. ఆ వివరాల్లోకి వెళితే..

హీరోయిన్ గా
సునీల్ హీరోగా తెరకెక్కిన భీమవరం బుల్లోడు సినిమాలో హీరోయిన్ గా పరిచయమైన ఎస్తేర్ ఆ తర్వాత గరం అనే సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. జయ జానకి నాయక అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో కూడా ఆమ కనిపించింది. హీరోయిన్ గా తెలుగు సినీ పరిశ్రమలో వర్కౌట్ కాకపోవడంతో ఆమె ఇతర భాషల మీద ఫోకస్ పెట్టింది.

ఇంటర్వ్యూలో
నిజానికి ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కానీ ఆమె మంచి సింగర్ కూడా. ఈ క్రమంలోనే తోటి సింగర్ అయిన తో ప్రేమలో పడి ఆయన ను వివాహం చేసుకుంది. నోయల్ బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి ముందు వీరిద్దరూ విడాకులు కూడా తీసుకున్నారు. ఈ మధ్యకాలంలో తెలుగులో మరలా బిజీ అవ్వడం కోసం ప్రయత్నాలు చేస్తున్న ఆమె తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది.

కెరీర్ ముగిసిపోతుంది
ఆ ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన అనేక విషయాలు అలాగే సినీ జర్నీకి సంబంధించిన అనేక విషయాలు కూడా చెప్పుకొచ్చింది. తెలుగు సినీ పరిశ్రమలో తాను క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదుర్కొన్నాను అంటూ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమా పరిశ్రమలో ఆఫర్స్ కావాలి అంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అని చాలామంది తనను అడిగారని వాటికి ఒప్పుకోకపోతే ఇక్కడితో కెరీర్ ముగిసిపోతుందని బెదిరించే ప్రయత్నాలు చేశారని వెల్లడించింది.
అడగకపోయినా
సినీ పరిశ్రమలో ఎవరు కమిట్మెంట్ అంటూ నేరుగా అడగరు కానీ విషయం ఇది అని అర్థం అయ్యే విధంగా ప్రవర్తిస్తారు అని ఆమె చెప్పుకొచ్చింది తనకు సినిమా అంటే చాలా ఇష్టమని పేర్కొన్న ఆమె తాను అన్ని విధాలుగా పర్ఫెక్ట్ అయినప్పుడు నేను ఎందుకు వారి కోసం కమిట్మెంట్ ఇవ్వాలి అని ఆమె ప్రశ్నించింది. తాను ఏదో ఒక విషయంలో పర్ఫెక్ట్ కాదు అంటే దానిని కాంపన్సేట్ చేయడం కోసం కమిట్మెంట్ ఇస్తే తప్పు లేదు కానీ అన్నీ ఉన్న తాను కూడా కమిట్మెంట్ ఇవ్వాలి అంటే తన మనసు ఒప్పుకోలేదు అని చెప్పుకొచ్చింది.

అడగకపోయినా
అవకాశాల కోసం అంత దిగజారాల్సిన అవసరం తనకు లేదని ఆమె వెల్లడించింది అందుకే ఆ అవకాశాలు వద్దనుకుని తప్పుకున్నానని అందుకే బహుశా తన సినీ జర్నీ త్వరగా ముగిసిపోయిందని చెప్పుకొచ్చారు. అంతేకాక ఈ క్యాస్టింగ్ కౌచ్ విషయంలో తప్పు ఎవరో ఒకరిది గాని చెప్పలేమని ఎందుకంటే సినిమా వాళ్ళు అడగకపోయినా కమిట్మెంట్ ఆఫర్ చేసే వాళ్లు కూడా కొంత మంది ఉన్నారని ఆమె కామెంట్ చేసింది.


Click it and Unblock the Notifications











