‘దమ్ముంటే వేశ్యల దగ్గరికి అలా వెళ్లండి.. మగాళ్లకి అది మాత్రమే కావాలి’

నటిగా, సింగర్ గా ఎస్టర్ నోర్హా తెలుగు ప్రేక్షకుల్లో కాస్తా గుర్తింపు దక్కించుకుంది. ఈమె తెలుగు, కన్నడ, హిందీ, కొంకణి భాషలోనూ సినిమాలు చేసింది. తెలుగులో మాత్రం టాలీవుడ్ కమెడియన్, స్టార్ నటుడు సునీల్ నటించిన 'భీమవరం బుల్లోడు' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మరిన్ని చిత్రాల్లో నటించి మెప్పించింది. విభిన్న పాత్రల్లో నటిస్తూ ఆడియెన్స్ ను మరింతగా ఆకట్టుకుంది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం సినిమాల ద్వారా అలరిస్తూనే మరోవైపు ఇంట్రెస్టింగ్ గా ఇంటర్వ్యూలు ఇస్తూ కూడా ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె వేశ్యల గురించి మాట్లాడుతూ ఆలోచింపజేసింది...

ఎస్టర్ నోరా గురించి..
ఎస్టర్ నోరా వెస్ట్ ఆసియాకు చెందింది. 1992 సెప్టెంబర్ 12న జన్మించింది. వెస్ట్ ఆసియాలోని బెహరిన్ లోనే పుట్టి పెరిగింది. ఇక ఎస్టర్ నోరా తన చదువును మాత్రం ముంబైలో పూర్తి చేసింది. సెయింట్ ఎక్సవీయర్ కాలేజీ ముంబై యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ ను పూర్తి చేసింది. ఇక 2012 నుంచి నటిగా వెండితెరపై మెరుస్తూ వస్తోంది. ముంబైలో చదువుకోవడంతో ఎస్టర్ నోరాకు ఇక్కడి సినీ పరిశ్రమలో పరిచయాలు ఏర్పడ్డాయి. దాంతో ఆమెకు సినీ అవకాశాలు కూడా అందాయి.

Actress Ester Noronha Shocking Comments about Feminism

ఎస్టర్ నోరా తెలుగు చిత్రాలు..
టాలీవుడ్ లోకి ఎస్టర్ నోరా ఎంట్రీకి డైరెక్టర్ తేజా సహకరించారు. 1000 అబద్ధాలు అనే చిత్రం ద్వారా ఎస్టర్ నోరా హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ చిత్రం 2013లో విడుదలైంది. ఆ తర్వాత వెంటనే 'భీమవరం బుల్లోడు' అనే చిత్రంలో నటించి తెలుగు చిత్ర పరిశ్రమలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఆ తర్వాత గరం, జయ జానకి నాయక, జూలియెట్ లవర్ ఆఫ్ ఇడియట్, నయనం, ఐరావతం, 69 సంస్కార్ కాలనీ, చాంగురే బంగారు రాజా, డెవిల్, టెనెంట్ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించింది. ఇక తాజాగా తల.. అనే చిత్రంలో నటించి మెప్పింది.

వేశ్యలపై ఎస్టర్ నోరా ఆసక్తికర వ్యాఖ్యలు..
ఎస్టర్ నోరా తాజా ఇంటర్వ్యూలో వేశ్యల గురించి మాట్లాడుతూ ఆలోచింపజేసేలా మట్లాడారు. 'సమాజంలో వేశ్యలు ఉన్నారంటే.. వారిని ప్రోత్సహించే వారు కూడా ఉన్నారు. వేశ్యలుగా మారాలని ఎవ్వరికీ ఉండదు. తమ ఆర్థిక పరిస్థితులు బాగాలేక, జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. అలా అని వారిపై ఎవ్వరికీ జాలి ఉండదు. డబ్బులు ఇచ్చి మరీ యూజ్ చేసుకోవాలని చూస్తారు. అంతగా సమాజం మారాలనుకుంటే వేశ్యల దగ్గరకి వెళ్లి యూజ్ చేసుకోకుండా డబ్బులు ఇచ్చి రండి. అప్పుడు మార్పు వస్తుంది. కానీ అలా ఏ మాగాడు ఉండడు.' అంటూ ఎస్టర్ నోరా చెప్పుకొచ్చారు.

ప్రేమ పెళ్లి.. ఏడాదికే విడాకులు..
ఎస్టర్ నోరా తెలుగు రాప్ సింగర్ నోయెల్ సీన్ ను పెళ్లి చేసుకుంది. 2019లో వీరు పెళ్లి చేసుకున్నారు. సరిగ్గా ఏడాదికి 2020లోనే విడాకులు తీసుకున్నారు. అప్పట్లో వీరి పెళ్లి, డివోర్స్ సంచలనంగా మారింది. ఇక ప్రస్తుతం ఇద్దరూ సింగిల్ గానే ఉన్నారు. ఎస్టర్ నోరా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X