పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న చిట్టి.. అది అంటే భయం అంటూనే హాట్ కామెంట్స్

తెలుగు రాష్ట్రాల్లో అందం, టాలెంట్ ఉన్న ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే అప్పుడప్పుడూ సినిమాల్లో మెరుస్తున్నారు. అలాంటి వారిలో పొడుగు సుందరి ఫరియా అబ్దుల్లా ఒకరు. 'జాతి రత్నాలు' మూవీతో ఒక్కసారిగా సెన్సేషన్ అయిన ఈ భామ.. ఆ తర్వాత ఆశించిన రీతిలో కెరీర్‌ను తీసుకెళ్లట్లేదు. కానీ, అడపాదడపా ఆఫర్లను మాత్రం అందుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫరియా అబ్దుల్లా.. పెళ్లి, పిల్లల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందో మీరే చూసేయండి మరి!

జాతి రత్నాలుతో హైలైట్:మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఫరియా అబ్దుల్లా.. 'జాతి రత్నాలు' సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది. ఈ చిత్రంలో అందంతో పాటు అద్భుతమైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ అయింది. మరీ ముఖ్యంగా కొన్ని సీన్లలో తన ఇనోసెంట్ యాక్టింగ్‌తో అలరించింది. ఫలితంగా ఈ సినిమాతోనే ఫరియా సంచలనం అయిపోయింది.

Actress Faria Abdullah Shocking Comments On Marriage and Pregnancy

ఆఫర్లు లేవు.. వాటిలోనే:'జాతి రత్నాలు' హిట్‌తో హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీని అందుకున్న ఫరియా అబ్దుల్లాకు టాలీవుడ్‌లో సినిమా అవకాశాలు భారీగా వస్తాయని అనుకున్నారు. కానీ, ఆమెకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు మాత్రం దక్కలేదు. దీని తర్వాత ఆమె 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' చిత్రంతో చిన్న పాత్రలో మెరిసింది. ఆ తర్వాత 'బంగార్రాజు' మూవీలో ఓ స్పెషల్ సాంగ్ చేసి అలరించింది.

Actress Faria Abdullah Shocking Comments On Marriage and Pregnancy

ఆ మూవీలు చేసిందిగా:ఫస్ట్ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఫరియా అబ్దాల్లా ఆ మధ్య 'లైక్ షేర్ సబ్‌స్క్రైబ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఇది ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఆమెకు షాక్ తగిలింది. దీని తర్వాత రవితేజ నటించిన 'రావణాసుర' అనే సినిమాలో నటించింది. అలాగే, 'వల్లి మయిల్' అనే తమిళ చిత్రంలో కూడా ఫరియా అబ్దుల్లా నటించింది.

నరేష్‌తో కామెడీ మూవీ:అందం, టాలెంట్ ఉన్నా సరైన అవకాశాలను అందుకోలేకపోతోన్న ఫరియా అబ్దుల్లా ఇటీవలే అల్లరి నరేష్‌తో 'ఆ ఒక్కటీ అడక్కు' అనే సినిమాలో నటించింది. ఈ మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, వీకెండ్‌లో వసూళ్లు బాగానే వచ్చాయి. అయితే, వర్కింగ్ డేస్‌లో పెద్దగా రాణించడం లేదు. మరి ఇది ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Actress Faria Abdullah Shocking Comments On Marriage and Pregnancy

పర్సనల్‌ లైఫ్‌పై క్లారిటీ:అప్పుడప్పుడూ సినిమాలు చేస్తూ తనదైన రీతిలో సందడి చేస్తోన్న ఫరియా అబ్దుల్లా తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె తనకు సంబంధించిన ఎన్నో పర్సనల్ విషయాలను కూడా పంచుకుంది. ఇందులో భాగంగానే పెళ్లి, పిల్లలు వంటి అంశాలపై కూడా పెదవి విప్పింది. దీంతో ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.

Actress Faria Abdullah Shocking Comments On Marriage and Pregnancy

పెళ్లి వద్దు.. పిల్లలు ఓకే:తాజా ఇంటర్వ్యూలో ఫరియా 'నాకు పెళ్లి పైన పెద్దగా నమ్మకం లేదు. అయితే అవుతుంది లేకపోతే లేదు. కానీ, నాకు పిల్లలంటే చాలా ఇష్టం. కాబట్టి తల్లిని అవడానికి సిద్దంగా ఉన్నాను. పెళ్లి ఎప్పుడు ఎలా అనేది ఆలోచించలేదు. పిల్లల్ని ఎలాగైనా ప్రొడ్యూస్ చేయొచ్చు. అయితే, వాళ్లను పెంచేందుకు తండ్రి బాధ్యత ఉండాలి. అయినా నాకు మ్యారేజ్ కాన్సెప్టు అంటే భయం' అని చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X