కమల్ తో విడిపోవడానికి కారణమదే.. షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన గౌతమి..
Gauthami Kamal Haasan: సీనియర్ హీరోయిన్ గౌతమి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ అమ్మడు ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకుంది. కేవలం సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లోనే మాత్రమే కాకుండా హిందీ చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి గౌతమి. అయితే ఆమె సినిమా జీవితం ఎంత సక్సెస్ఫుల్ గా కొనసాగిందో.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో వైఫల్యాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రధానంగా తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ తో లివింగ్ రిలేషన్ లో కొనసాగింది. వీరిద్దరూ దాదాపు 13 ఏళ్లు లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. కానీ, చివరిగా 2016లో విడిపోయారు. అయితే .. తాము విడిపోవడానికి గల కారణాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
హీరోయిన్ గౌతమి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కమల్ హాసన్ తో విడిపోవడానికి గల కారణాలను వివరించింది. అలాగే కమల్ హాసన్ మరో హీరోయిన్ తో క్లోజ్ గా మూవ్ అవుతున్నారని కారణంతో విడిపోయారా? లేదా శృతిహాసన్ వల్ల కమల్ హాసన్ కు గౌతమి దూరమైందా ?అనే ప్రశ్నలపై స్పందించారు. ' కమల్ , నాది చాలా సెన్సిటివ్ రిలేషన్షిప్, అలాగే సెన్సేషనల్ బ్రేకప్ కూడా. అయితే మా రిలేషన్ లోకి వేరే వాళ్ళు ఎంటర్ అయ్యారనో.. లేదా ఒకరి కారణంగా తాము విడిపోయాం అనేది సరికాదు ' అన్నారు. 'ఇప్పుడైతే మన రిలేషన్ లో వేరే వ్యక్తికి రావడానికి అవకాశం ఇస్తామో.. ఆ క్షణమే వారిద్దరు రిలేషన్ లో లేనట్లు' అంటూ షాకింగ్ చేసింది.

'ఒక రిలేషన్ అంటే ఒక లైన్ పై ఇద్దరూ కలిసి నడవడం. అలాంటిది ఒక పార్లల్ లైన్ గా కాకుండా అపోజిషన్ డైరెక్షన్లో ప్రయాణిస్తే.. ఆ రిలేషన్ లో ప్రేమ ఎక్కడ ఉంటుంది? అలాంటి చిన్న చిన్న విషయాలు రిలేషన్ బ్రేక్ కావడానికి కారణాలు అవుతాయి. వాటిని మోస్తూ భారంగా జీవితాన్ని గడపలేము కదా.. అందుకే నేను కమల్ కు బ్రేకప్ చెప్పాను' అని గౌతమి తెలియజేసింది. అయితే.. అలా చేయకపోతే.. తాను ముగ్గురికి అన్యాయం చేసిందాని అవుతానని, ఒకటి తన కూతురికి ఇలాగానే బతకాలని పరోక్షంగా చెప్పినట్లు ఉంటుందని గౌతమి అన్నారు.
రెండవది తనని తాను మోసం చేసుకుంటున్నాననీ, తాను సంతోషంగా జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నాననీ,కానీ ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి బాధలను భరిస్తూ ఉండలేనని పేర్కొన్నారు. మరొకటి తన తల్లి నేర్పిన విలువలకు, ఇచ్చిన జీవితానికి సంపూర్ణ అర్థం రావాలంటే.. ఇలాంటి ఇబ్బందులు బాధలను భరించవలసిన అవసరం లేదని రిలేషన్ బ్రేక్ చేసుకున్నానని, తాను ప్రస్తుతం ఒక సరైన మార్గంలోనే వెళుతున్నానని చెప్పుకొచ్చింది గౌతమి.

'ఏ రిలేషన్ లో అయినా కాంప్రమైజ్ అవుతారా..? మరొకరి కోసం సాక్రిఫైజ్ చేసుకుంటారా ? అనేది మీ ఇష్టం మీరు ఎలాగా జీవించాలని భావిస్తారో? అలాగానే ఉండండి' అంటూ చెప్పుకొచ్చింది హీరోయిన్ గౌతమి. తానేంటో తనకు తెలుసు అని, తాను ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నానో తన చుట్టూ వారికి కూడా తెలుసునని షాకింగ్ కామెంట్స్ చేసింది గౌతమి.ఆ బ్రేకప్ నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకొని ముందుకు సాగిపోవాలని గౌతమి అభిప్రాయపడింది. అది ఎంత బాధ కలిగించినా.. మన మంచికేననీ, ఆ బాధ మరచిపోవడానికి ఏదైనా కొత్తది నేర్చుకోవాలని గౌతమి సూచించింది ప్రస్తుతం హీరోయిన్ గౌతమి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.


Click it and Unblock the Notifications











