ఆ సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి.. అనిల్ రావిపూడిపై నటి షాకింగ్ కామెంట్స్

వరుస విజయాలతో టాలీవుడ్‌లో అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్న అనిల్ రావిపూడి(Anil Ravipudi). తాజాగా మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన 'మన శంకర వరప్రసాద్ గారు' బ్లాక్‌బస్టర్‌తో టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారారు. రాజమౌళి తర్వాత అత్యధిక హిట్ రేషియోను నమోదు చేసిన దర్శకుడిగా ఆయనకు ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం దక్కింది.ఈ సక్సెస్‌తో ఆయన పేరు మళ్లీ ట్రెండింగ్‌లోకి రావడం విశేషం. ఈ ఘన విజయం తర్వాత ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఓ నటి డైరెక్టర్ అనిల్ రావిపూడిపై షాకింగ్ ఆరోపణలు చేసింది. తనకు అవకాశం ఇస్తానని చెప్పి మోసం చేశాడని ఆరోపిస్తోంది. ఇంతకీ ఆ నటి ఎవరు? ఇంతకీ ఏమైంది?

ఆ నటి ఎవరో కాదు.. ప్రముఖ కమెడియన్ నటి గీతా సింగ్.. తాజాగా వెల్లడించిన విషయాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'రాజా ది గ్రేట్' సినిమా సందర్భంగా తనకు ఎదురైన అనుభవాన్ని గీతా సింగ్ వివరించడం తీవ్ర చర్చకు దారితీసింది. గీతా సింగ్ చెప్పిన వివరాల ప్రకారం..'రాజా ది గ్రేట్' సినిమా కోసం అనిల్ రావిపూడి టీంలోని కోడైరెక్టర్లు తనను సంప్రదించారట. అవుట్‌డోర్ షూటింగ్ ఉండబోతుందని, దాదాపు నెల రోజుల పాటు డేట్స్ అందించారని అడిగారని తెలిపారు. ఈ మంచి పాత్రగా భావించి, ఆమె వెంటనే అంగీకరించడమే కాకుండా ఇతర సినిమా అవకాశాలను కూడా వదులుకున్నట్లు చెప్పారు.

Actress Geetha Singh Makes Shocking Against director Anil Ravipudi Over Role Snub in Raja The Great

ముఖ్యంగా స్టార్ హీరో రవితేజ పక్కన కనిపించే పాత్ర కావడంతో ఆ ఆఫర్‌ను ఎంతో ప్రాముఖ్యంగా ఎంచుకున్నట్లు తెలిపారు. అయితే, ఆ తరువాత తనకు ఎలాంటి కాల్ రాలేదనే అనుమానం కలిగిందని గీత తెలిపింది. కో-డైరెక్టర్ల నెంబర్ సేవ్ చేయకపోవడం వల్ల తిరిగి సంప్రదించడం కష్టమైందని, తర్వాత ఫ్రెండ్స్ ద్వారా నెంబర్ సంపాదించి పలుమార్లు కాల్ చేసినా ఎవరూ స్పందించలేదని చెప్పారు. చివరికి "మన అదృష్టం లేదేమో" అని భావించి మౌనంగా ఉన్నానని. కానీ సినిమా విడుదలైన రోజు థియేటర్‌కు వెళ్లి చూసినప్పుడు, తాను చెప్పిన పాత్రను మరో అమ్మాయి చూసి తీవ్రంగా బాధపడ్డానని గీతా సింగ్ ఎమోషనల్‌గా చెప్పారు. ఈ సంఘటన తనకు పెద్ద షాక్‌గా అనిపించిందని, తాను ఎంతో ఆశతో ఎదురుచూసిన అవకాశం ఇలా చేజారడం బాధ కలిగించిందని అన్నారు.

తర్వాత ఓ ఈవెంట్‌లో దర్శకుడు అనిల్ రావిపూడిని నేరుగా కలసి ఈ సందర్భంగా ప్రశ్నించినట్లు గీత తెలిపారు. "నా పాత్ర ఉందని చెప్పి వేరే వారిని పెట్టుకోవడం భవ్యమా?" అని అడిగానని, అయితే ఆయనకు ఈ విషయం తెలియదని సమాధానం ఇచ్చారని చెప్పారు. "ఈ విషయం నాకు తెలిసి ఉంటే తప్పకుండా పిలిచేవాడిని" అనిల్ చెప్పారని. ఈ సంఘటన వల్ల తనకు వచ్చిన మరో రెండు సినిమా అవకాశాలను కూడా కోల్పోయానని గీత ఆవేదన వ్యక్తం చేశారు. మంచి పాత్ర కోసం ఎదురు చూస్తూ ఆఫర్లను తిరస్కరించడం తన కెరీర్‌పై ప్రభావం చూపిందని అన్నారు.

గతంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన 'సరైనోడు' సినిమాలో కూడా ఇలాంటి అనుభవం ఎదురైందని గీత గుర్తు చేసుకున్నారు. ఆ చిత్రంలో ఒక పాత్ర కోసం తనను ఎంపిక చేసుకున్నప్పటికీ, చివరి నిమిషంలో ఆ అవకాశం మరొకరికి వెళ్లిందని చెప్పారు. అయితే ఆ విషయంపై బోయపాటి శ్రీనును తాను ప్రశ్నించలేదని, ఆయనపై ఇప్పటికీ గౌరవం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి అనుభవాలు సినీ పరిశ్రమలో సాధారణమేనని భావించి, కొన్నిసార్లు చూసి చూడనట్టు వదిలేయాల్సి వస్తుందని గీత. అయితే టాలెంట్ ఉన్న నటీనటులకు సరైన గౌరవం దక్కాలని, అవకాశాలు ఇవ్వడంలో పారదర్శకత ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇక మరోవైపు, సినిమాల్లో అవకాశాలు తగ్గిన సమయంలో సోషల్ మీడియా ద్వారా గీతా సింగ్ మళ్లీ పాపులర్ అయ్యారు. ఇటీవల ఆమె చేసిన 'గుడు గూడు గుంజము' పాట వైరల్ అవుతూ మంచి స్పందన తెచ్చుకుంది. కేవలం మూడు నెలల్లోనే ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో 100K ఫాలోవర్లను సంపాదించడం ఆమెకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ముఖ్యంగా నెటిజన్ల నుంచి పాజిటివ్ స్పందన రావడం తనకు ఆనందాన్ని కలిగించిందని గీత తెలిపింది. ప్రస్తుతం మళ్లీ సినిమాల్లో బిజీ కావాలని ప్రయత్నిస్తున్న గీతా సింగ్, మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆమె వెల్లడించిన ఈ విషయాలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X