Genelia D'Souza: పొట్టి డ్రెస్ లో షాక్ ఇచ్చిన హాసిని.. ఇంత హాట్ గా చూసి ఎన్నాళ్లయ్యిందో..
ఒకప్పుడు గ్లామర్ బ్యూటీ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న జెనీలియా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలవ లేకపోయినప్పటికీ ఆమె చేసిన కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల మదిలో ఎప్పటికి అలా నిలిచిపోతాయి. ఎవరు మర్చిపోయినా కూడా తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈ అందాల హాసినిని అసలు మర్చిపోరనే చెప్పాలి. ఇక పెళ్లి అనంతరం వెండితెరకు కాస్త దూరంగానే ఉన్న జెనీలియా సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా ఏదో ఒక విషయంతో అభిమానులకు దగ్గరవుతూనే ఉంది. రీసెంట్ గా జరిగిన ఒక హాట్ గ్లామరస్ ఫోటో తో ఫాలోవర్స్ కి షాక్ ఇచ్చింది అనే చెప్పాలి.

ఆ రెండు సినిమాలతో..
2003లో తుజే మేరీ కసమ్ అనే బాలీవుడ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన జెనీలియా అదే సంవత్సరంలో శంకర్ బాయ్స్ సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంది
ఆ రెండు సినిమాల అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేకపోయినప్పటికీ జెనీలియా నటన పరంగా చాలా మంది సినీ ప్రముఖులను ఆకర్షించింది. తెలుగు లో వచ్చిన సత్యం సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి. ముఖ్యంగా తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో చేసిన సై సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.
బొమ్మరిల్లుతో భారీ క్రేజ్
అయితే జెనీలియా బ్యాడ్ లక్ వలన ఆమెకు ఒక సక్సెస్ రాగానే వెంటనే మళ్ళీ రెండు మూడు డిజాస్టర్స్ కూడా ఎదురవుతూ వచ్చాయి. ఇక 2006లో బొమ్మరిల్లు మూవీతో ఒక్కసారిగా ఆమె భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా హాసినికి నంది అవార్డును, ఫిలింఫేర్ అవార్డును, అలాగే సంతోషం అవార్డును కూడా అందించింది. ఆ ఒక్క సినిమాతోనే ఆమె స్థాయి అమాంతంగా పెరిగిపోయింది.
అదే చివరి సినిమా
ఇక జెనీలియా ఆ తర్వాత 2007 లో చేసిన శ్రీను వైట్ల మంచు విష్ణు డీ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అనంతరం రెడీ సినిమా కూడా కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా కొనసాగిన జెనీలియా 2012 వరకు హీరోయిన్ గా బిజీగా కనిపించింది. ఇక తెలుగులో చివరగా చేసిన చిత్రం నా ఇష్టం. రానా దగ్గుబాటి హీరోగా నటించిన ఆ సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ కావడంతో జెనీలియా మళ్ళీ తెలుగు సినిమాలవైపు తిరిగి చూడలేదు.
హీరోను పెళ్లి చేసుకొని..
పేద్దగా ఆఫర్స్ రాకపోవడంతో ఇంతకుముందే బాయ్ ఫ్రెండ్ గా ఉన్నటువంటి రితేష్ దేశముఖ్ ను ఆమె పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం జెనీలియా అవసరమైతే తప్ప సినిమాలవైపు పెద్దగా తిరిగి చూడడం లేదు. అప్పుడప్పుడు స్పెషల్ పాత్రల్లో మాత్రమే దర్శనమిస్తుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారితోనే ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేకమైన ఫోటోలను పోస్ట్ చేస్తూ సరికొత్త వస్తోంది.
Recommended Video
హాట్ ఫొటోతో షాక్..
ఇక రీసెంట్ గా జెనీలియా నేవార్ బిఫోర్ అనేలా ఒక హాట్ ఫోటోతో దర్శనమిచ్చింది. చిన్న టీ షర్ట్ లో నడుము అందాలను చూపిస్తూ ఒక స్టైలిష్ స్కట్ కూడా వేసి అందులో ఆమె లెగ్స్ అందాలను మరింత అందంగా ప్రజెంట్ చేసినట్లు కనిపిస్తోంది. ఇక నెటిజన్లు పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా జెనీలియా మునుపటి తరహాలో నే చాలా అందంగా కనిపిస్తోంది అని కూడా అంటున్నారు.


Click it and Unblock the Notifications











