రామ్ పోతినేనితో ఇప్పటికీ ఆ రిలేషన్... జెనిలీయా భర్తకు తెలిసి ఏం చేశాడో తెలుసా?

కొన్నేళ్ల పాటు టాలీవుడ్ ను ఊపూపిన హీరోయిన్ జెనీలియా డిసౌజ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమెకు దక్షిణాదిన సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండటం విశేషం. జెనీలియా సినిమాను చూసేందుకు అభిమానులతో పాటు నార్మల్ ఆడియెన్స్ కూడా ఎంతగానో ఆసక్తి చూపించే వారు. కానీ కొన్నాళ్లుగా ఈమె తెలుగులో సినిమాలు చేయడం లేదు. ఇక దశాబ్దం తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. తన లేటెస్ట్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను తిరిగి పలకరించింది. ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్, ఉస్తాద్ రామ్ పోతినేని గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

జెనీలియా వ్యక్తిగత వివరాలు..
తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన జెనీలియా నార్త్ లో పుట్టి పెరిగింది. ఆమె బాంబేలోని మంగలోరియన్ కథోలిక్ కుటుంబంలో 1987 ఆగస్టు 5న జన్మించింది. ఆమె తల్లి జీనెట్ట డిసౌజ ఫార్మ మల్టీనేషనల్ కార్పోరేషన్ డైరెక్టర్ గా విధులు నిర్వహించింది. 2004లో జెనీలియా కెరీయర్ కోసం ఉద్యోగం వదలిలేసింది. ఇక తండ్రి నీల్ టాటా కన్సల్టెన్సీలో సీనియర్ అఫీయల్ గా విధులు నిర్వహించారు. జెనీలియాకు నిగెల్ డిసౌజ అనే తమ్ముడు కూడా ఉన్నారు.

Actress Genelia D souza Shocking Comments about Co Actor Ram Pothineni

జెనీలియా సినిమాలు..
తొలి చిత్రం హిందీలోనే నటించింది. అది కూడా తన భర్త రితేశ్ దేశ్ ముఖ్ సరసన తుజే మేరీ కసమ్ అనే చిత్రంలో నటించి హీరోయిన్ గా కెరీయర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత బాయ్స్, సత్యం, మస్తీ, సాంబ, సై, నా అల్లుడు, సుభాష్ చంద్ర బోస్, హ్యాపీ, బొమ్మరిల్లు, ఢీ, రెడీ, ఆరెంజ్, నా ఇష్టం వంటి గుర్తుండిపోయే చిత్రాల్లో నటించి మెప్పింది. మరోవైపు తమిళం, హిందీ సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి అలరించింది.

రామ్ పోతినేని గురించి మాట్లాడుతూ..
రీసెంట్ ఇంటర్వ్యూలో జెనీలియాకు ఎదురైన ప్రశ్నకు ఆసక్తికరంగా బదులిచ్చింది. రామ్ పోతినేని గురించి చెప్పండి అంటూ అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చింది. నాకు రామ్ పోతినేని క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది. మేం ఇద్దరం కలిస్తే చాలా విషయాలు మాట్లాడుతూనే ఉంటామని చెప్పుకొచ్చింది. ఇక తమ ఫ్రెండ్షిప్ గురించి తెలిసిన తన భర్త రితేశ్ దేశ్ ముఖ్ రామ్ తో పరిచయం పెంచుకున్నారని, ఇప్పుడు వాళ్లిద్దరూ చాలా క్లోజ్ అయ్యారని, ఆ విషయం నాకు నచ్చడం లేదని ఫన్నీగా చెప్పుకొచ్చింది.

13 ఏళ్లకు రీఎంట్రీ..
ఇక జెనీలియా తెలుగు ప్రేక్షకులను 2012లో విడుదలైన నా ఇష్టం చిత్రంతో అలరించింది. రానా దగ్గుబాటి సరసన నటించింది. ఆ తర్వాత రితేజ్ దేశ్ ముఖ్ తో పెళ్లి కావడంతో ఇక బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ వచ్చింది. ఇక 13 ఏళ్లకు జూనియర్ చిత్రంతో తిరిగి దక్షిణాదిన అడుగు పెట్టింది. కిరిటీ రెడ్డి, శ్రీలీలా జంటగా నటించిన ఈ చిత్రం జూలై 18న గ్రాండ్ గా విడుదలైంది. జెనీలియా కీలక పాత్రలో మెరిసింది.

More from Filmibeat

Read more about: ram pothineni junior genelia
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X