40 ఏళ్ల వయసులో హంసానందిని అరాచకం.. టూ పీస్ బికినీలో గ్లామర్ షో!
ప్రస్తుతం మానవాళికి క్యాన్సర్ పెను ముప్పుగా మారిన సంగతి తెలిసిందే. ప్రతినిత్యం రకరకాల క్యాన్సర్లు మనిషిని కబళిస్తున్నాయి. లక్షణాలను గుర్తించి చికిత్స తీసుకునే సరికి సమయం మించిపోతూ ఎంతో మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా క్యాన్సర్ బారినపడి మరణిస్తున్నారు. అయితే కొందరు మాత్రం క్యాన్సర్ మహమ్మారిని జయిస్తున్నారు. అలాంటి వారిలో సినీనటి హంసా నందిని కూడా ఒకరు.
మహారాష్ట్రలోని పుణేకు చెందిన హంసా నందిని పూర్తి పేరు పూనం బర్తాకే . చదువు పూర్తి చేసిన తర్వాత ముంబైకి మకాం మార్చినా ఆమె మోడల్‌గా కెరీర్ ప్రారంభించారు. ఈ క్రమంలో టాలీవుడ్‌కు చెందిన మా స్టార్స్ మేగజైన్‌కు మోడలింగ్ చేశారు. 2004లో ఒకటవుదాం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన హంసానందిని ఆ తర్వాత.. 786 ఖైదీ ప్రేమకథ, అనుమానాస్పదం, అధినేత, ప్రవరాఖ్యుడు, అహ నా పెళ్లంట, నా ఇష్టం, ఈగ వంటి సినిమాలు చేశారు.

హీరోయిన్‌గానే కాకుండా ఐటెం సాంగ్స్‌తో యూత్‌ను ఊపేశారు. మిర్చి, భాయ్, రామయ్య వస్తావయ్యా, అత్తారింటికి దారేది, లెజెండ్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, బెంగాల్ టైగర్, శ్రీరస్తు శుభమస్తు వంటి సినిమాలలో ఐటెం నెంబర్స్ చేశారు. కోవిడ్ లాక్‌డౌన్ ముగిసిన తర్వాత సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న హంసా నందిని 2020 జూలై నెలలో తనకు గ్రేడ్ 3 కార్సినోమా (రొమ్ము క్యాన్సర్) ఉన్నట్లు తెలుసుకున్నారు. హంసా తల్లి కూడా రొమ్ము క్యాన్సర్ కారణంగా కన్నుమూశారు.
అయినా ఏమాత్రం అధైర్యపడకుండా క్యాన్సర్‌పై పోరాడి దానిని జయించారు హంసా నందిని. తిరిగి మామూలు మనిషి అవుతున్న దశలో బీఆర్‌సీఏ 1 (వంశపారంపర్యంగా వచ్చే రొమ్ము క్యాన్సర్) పాజిటివ్‌గా తేలింది. అంతే ఆమె జీవితంలో మరోసారి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం దాదాపు 70 శాతం ఉంది. దీంతో ఆమె అరుదైన శస్త్రచికిత్సను చేయించుకోవాల్సి వచ్చింది. చివరికి క్యాన్సర్‌ను జయించిన హంసా నందిని తిరిగి సినిమాలలో బిజీ అయ్యారు. అంతేకాదు ప్రజలకు క్యాన్సర్‌పై అవగాహన కల్పించి ప్రాణాలను నిలబెట్టాలని ఆమె భావిస్తున్నారు. దీనిలో భాగంగా తల్లి పేరు మీద యామినీ క్యాన్సర్ ఫౌండేషన్‌ని స్థాపించారు.
సోషల్ మీడియాలో తొలి నుంచి యాక్టీవ్‌గా ఉండే హంసా నందిని తన సినిమాలు, వ్యక్తిగత వివరాలతో పాటు క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ వస్తున్నారు. ఇక తన మిత్రులతో కలిసి విహారయాత్రలకు కూడా వెళ్తుంటారు హంసానందిని. తాజాగా ఓ బీచ్‌కు వెళ్లిన ఆమె టూ పీస్ బికినీ వేసి, ఆపై షర్ట్‌తో దానిని కవర్ చేస్తూ హాట్ హాట్ ఫోటోషూట్ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం హంసా నందిని అందాలపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











