బీచ్‌లో అతి దారుణంగా హన్సిక: ఆమెనిలా చూస్తే కుర్రాళ్లు తట్టుకుంటారా?
సాధారణంగా సినీ రంగంలో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా హడావిడి చేస్తుంటారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే స్టార్‌డమ్‌ను అందుకుంటారు. మరికొందరైతే చేసిన ప్రతి భాషలోనూ స్టార్‌గా హవాను చూపిస్తారు. ఆ కోవకే చెందుతుంది హన్సిక మొత్వానీ.
ఇప్పటి వరకూ చాలా భాషల్లో నటించిన ఈ అమ్మడు.. అన్నింట్లోనూ హవాను చూపించింది. ఇక, పెళ్లి తర్వాత కాస్త స్లో అయినా.. సోషల్ మీడియాలో మాత్రం యమ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ ఫొటోలను హన్సిక షేర్ చేసింది. వాటిపై మీరు కూడా లుక్కేయండి మరి!

చిన్న వయసులోనే స్టార్ట్: టీనేజ్‌లో ఉన్న సమయంలోనే హన్సిక మొత్వానీ సినిమాల్లోకి నటిగా ఎంటరైంది. ఈ క్రమంలోనే హిందీలో 'హవా', 'కోయి మిల్‌గయా', 'జాగో', 'హమ్ కౌన్ హై', 'అబ్ర క దబ్ర' వంటి చిత్రాల్లో కీలక పాత్రలు చేసింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న హన్సిక.. అల్లు అర్జున్ హీరోగా చేసిన 'దేశముదురు' చిత్రంతో హీరోయిన్‌గా మారి.. ఫస్ట్ మూవీతోనే అదరగొట్టింది.

స్టార్ హీరోలు అందరితో: హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకున్న హన్సికకు టాలీవుడ్‌లో ఆఫర్లు భారీగా వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ తెలుగులోని బడా హీరోలు అందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ క్రమంలోనే హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఎంట్రీ ఇచ్చి సత్తా చాటింది. తద్వారా ఆయా ఇండస్ట్రీల్లోనూ వరుస చిత్రాలతో సందడి చేసింది.

అతడితో హన్సికకు పెళ్లి: ఏకధాటిగా సినిమాలు చేస్తూ సౌతిండియా మొత్తంలో ప్రభావాన్ని చూపిన హన్సిక మొత్వానీ.. బాలీవుడ్‌లోనూ ఎన్నో సినిమాల్లో నటించింది. ఇలా కెరీర్‌ను సక్సెస్ చేసుకున్న ఈ భామ.. గత డిసెంబర్‌లో లవర్ సోహైల్ ఖతురియాను పెళ్లాడి పర్సనల్ లైఫ్‌నూ విజయవంతం చేసుకంది. ఇక, వివాహం తర్వాత హన్సిక తన భర్తతో కలిసి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగుతోంది.
యమ సినిమాలు చేస్తూ: సౌత్ నుంచి నార్త్ వరకూ వరుసగా సినిమాలు చేస్తోన్న హన్సిక.. ఇప్పటికీ అదే స్పీడును కంటిన్యూ చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ భామ తెలుగులో 'మై నేమ్ ఈజ్ శృతి', '105 మినిట్స్' వంటి సినిమాలు చేస్తోంది. అలాగే, తమిళంలోనూ 'రౌడీ బేబీ', 'గార్డియన్', 'గాంధారీ', 'మ్యాన్', 'పార్ట్నర్' వంటి చిత్రాలు చేస్తోంది. అలాగే సిరీస్‌లలోనూ నటిస్తోంది.

అక్కడ మాత్రం బిజీగా: ఎన్నో ఏళ్లుగా స్టార్ హీరోయిన్‌గా వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు, టీవీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నా.. హన్సిక మాత్రం సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడిస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.

హద్దు దాటి మరీ ట్రీట్: హీరోయిన్‌గా ఎంటరైన కొత్తలో ఎంతో పద్దతిగానే కనిపించిన హన్సిక.. ఆ తర్వాత పాత్ర కంటే అందాల ఆరబోతకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలోనూ కంటిన్యూ చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ ఇంటర్నెట్‌ను ఊపుతోంది.

బీచ్‌లో బోల్డుగా హన్సిక: స్టార్ హీరోయిన్ హన్సిక మొత్వానీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు బీచ్‌లో టాప్‌ను విప్పేసి మరీ దర్శనమిచ్చింది. అలాగే డిఫరెంట్ ఫోజులు ఇస్తూ అందాలను ప్రదర్శిస్తోంది. దీంతో హన్సిక షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఇవి ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











