Hansika Motwani: పెళ్లి పనుల్లో బిజీగా హన్సిక.. చారిత్రాత్మక ప్యాలెస్ లో భారీగా ఏర్పాట్లు?
దేశముదురు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన హన్సిక మోత్వాని అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోలతో నటించే అవకాశాన్ని అందుకుంది. తెలుగు తమిళ్ అని తేడా లేకుండా ఆమె అప్పట్లో చాలా బిజీ హీరోయిన్ గా కనిపించింది. అయితే హన్సిక వరుసగా సినిమాలు చేస్తోంది కానీ బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ లు మాత్రం అందడం లేదు. ఇక ఆ సంగతి పక్కన పెడితే ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు అయితే మరొక టాక్ కొనసాగుతోంది. పెళ్లి.కోసం రీసెంట్ గా ఒక ప్యాలెస్ కూడా బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

15 ఏళ్ళ వయసులోనే
హీరోయిన్ హన్సిక మొదట టెలివిజన్ ప్రపంచంలో బాలనాటిగా నటించి ఆ తర్వాత 15 ఏళ్ల వయసులోనే ఆమె దేశముదురు సినిమాతో వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైంది. చూస్తుండగానే హన్సిక అప్పట్లో అత్యధిక స్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్న సౌత్ హీరోయిన్స్ లలో ఒకరిగా నిలిచారు. తెలుగు తమిళంలో ఉన్న ఒకప్పటి అగ్ర హీరోలతో ఆమె స్క్రీన్ షేర్ చేసుకునే ప్రయత్నం చేసింది.

ఏకధాటిగా సినిమాలు
ఇక తెలుగులో హన్సిక మోత్వాని జూనియర్ ఎన్టీఆర్ కంత్రి సినిమాతో పాటు రామ్ కందిరీగ వంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద నుంచి సక్సెస్ అందుకుంది. ఇక తర్వాత గ్యాప్ లేకుండా తెలుగు తమిళంలో ఏకధాటిగా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. ఇప్పటివరకు హన్సిక ఏ సంవత్సరం కూడా వెండి తెరకు గ్యాప్ ఇచ్చింది లేదు. ప్రతి ఏడాది ఏదో ఒక సినిమాతో వస్తూనే ఉంది. కరోనా లాక్ డౌన్ లో కూడా ఆమె చేసిన సినిమాలు ఓటీటీ లో విడుదలయ్యాయి.

త్వరలోనే పెళ్లి
అయితే చాలాకాలంగా హన్సిక కు సంబంధించిన ప్రేమ కథలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ఇప్పుడు తమిళ మీడియాలో ప్రచారాలు మొదలయ్యాయి. ముంబైకి చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో హన్సిక కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు టాక్ అయితే వస్తోంది కానీ ఇంతవరకు ఆ విషయంపై ఈ బ్యూటీ ఎక్కడ కూడా స్పందించలేదు.

ముహూర్తం అప్పుడే
గతంలో హన్సిక కొంతమంది తమిళ హీరోలతో కూడా ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ అయితే వినిపించాయి. ఇక ఈ బ్యూటీ మొత్తానికి ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా వార్తలు వస్తున్నాయి. ఇక 2022 డిసెంబర్లోనే ఆమె పెళ్లికి ముహూర్తం సెట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇరు కుటుంబాల మధ్య చర్చలు కూడా ముగిసినట్లుగా టాక్ అయితే వస్తోంది.

ప్యాలెస్ లో ఏర్పాట్లు
పెళ్లి కోసం ప్రత్యేకంగా హన్సిక కుటుంబ సభ్యులు భారీ స్థాయిలో ఏర్పాట్లు కూడా చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే వారి పేరెంట్స్ జైపూర్లోని 450 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక ప్యాలెస్ ను బుక్ చేశారట. అందులోనే హన్సిక వివాహం జరగబోతున్నట్లు సమాచారం. దాదాపు పది రోజుల వరకు అక్కడే ఉండే విధంగా రూమ్స్ అన్నీ కూడా బుక్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం హన్సిక కుటుంబ సభ్యులు భారీ స్థాయిలో ఖర్చు చేయబోతున్నారట. మరి ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియాలి అంటే హన్సిక నుంచి అఫీషియల్ గా క్లారిటీ రావాల్సిందే.


Click it and Unblock the Notifications











