’అల్లు అర్జున్‌తో ఐటెం సాంగ్.. అలాంటి అవసరం వస్తే ఫస్ట్ కాల్ ఆ హీరోకే.. ’

Hansika Motwani: యాపిల్ బ్యూటీ హన్సిక మోత్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. హిందీలో అనేక సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్టుగా మెరిచింది. ఈ బ్యూటీ ఆ తర్వాత 2007లో దేశముదురు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస అవకాశాలు అందుకుని మంచి పాపులారిటిని సంపాదించుకుంది. అయితే.. గత కొంతకాలంగా సినిమా అవకాశాలు రాకపోవడంతో సోషల్ మీడియా, బుల్లితెరపై సందడి చేస్తోంది హన్సిక. తాజాగా ఓ చిట్ చాట్ లో పాల్గొన్న ఈ బ్యూటీ టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్లపై షాకింగ్ కామెంట్స్,

హీరోయిన్ హన్సిక మోత్వాని చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా మెప్పించిన కేవలం 16 ఏళ్లకే హీరోయిన్‌గా మారింది. ఇలా తెలుగులో అల్లు అర్జున్ దేశముదురు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి.. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇలా వరుస ఆఫర్స్ అందుకుంది. ఆ తర్వాత మస్కా, కందిరీగ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తెలుగులో ఎన్టీఆర్, రామ్ పోతినేని, ప్రభాస్, రవితేజ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. హన్సిక కేవలం తెలుగులోనే కాక..తమిళ్ తో కన్నడలోనూ పలు సినిమాల్లో నటించింది.

Actress Hansika shocking comments on Tollywood heroes and directors

ఆ తర్వాత పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతం వెబ్ సీరియల్స్, సినిమాల్లో నటిస్తుంది. డిసెంబర్ 2023లో హన్సిక తన లవర్ సోహైల్ ఖతురియాను మ్యారేజ్ చేసుకుంది. పెళ్లి తర్వాత ఈ బ్యూటీ కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉంది. ఈ సమయంలో ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ కూడా స్టార్ట్‌ చేసింది. అలాగే.. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉండే హన్సిక తరుచు తన ఫోటోలను, వీడియోలను చేస్తూ.. ఫ్యాన్స్ తో తన పర్సనల్ విషయాలను పంచుకుంటుంది హన్సిక .ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారం అవుతున్న ఢీ షోకి జడ్జిగా వ్యవహరిస్తుంది హీరోయిన్ హన్సిక.

ఢీ షోలో భాగంగా హీరోయిన్ హన్సిక ఓ చిట్ చాట్ లో పాల్గొంది. క్రేజీ ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్ నుండి ఢీ షో జడ్జిగా వ్యవహరించడం ఎలా ఉందని ప్రశ్నించగా.. ఇదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అన్ ఫార్చునెట్ అంటూ సమాధానం ఇచ్చింది. తెలుగు సినిమాలో స్పెషల్ సాంగ్ చేయాలనుకుంటే ఏ హీరో పక్కన చేస్తారు అని ప్రశ్నించగా.. వెంటనే తాను అల్లు అర్జున్ పక్కన స్టెప్పులెయ్యాలని, అల్లు అర్జున్ చాలా ఎనర్జిటిక్, అమేజింగ్ డాన్సర్ అంటూ బన్నీని ప్రశంసించింది. ఒకవేళ లిఫ్ట్ లో ఇరికిపోతే ఫస్ట్ కాల్ ఎవరికీ చేస్తారని ప్రశ్నించగా వెంటనే.. హీరో రవితేజకు ఫోన్ చేస్తానని ఆయన చాలా ఎనర్జిటిక్, ఏదో ఒకటి చేసి నన్ను లెఫ్ట్ లో నుండి బయట పడేస్తాడు అంటూ ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చింది.

Actress Hansika shocking comments on Tollywood heroes and directors

ఒకవేళ అనుకోకుండా మీరు షూటింగ్ లోకేషన్ కి లేటుగా వెళ్లారు మీరు చెప్పే కారణమేంటి అని ప్రశ్నించగా.. తాను షూటింగ్ సమయంలో సమయపాలన పాటిస్తాననీ, ఒకవేళ లేట్ అవుతే .. అది తన డ్రైవర్ వాళ్లను మేనేజర్ వలన కావచ్చని, తాను మాత్రం అలాంటి తప్పు చేయాలని చెప్పుకోచ్చారు. టాలీవుడ్ హీరోతో నటించాలని అనుకుంటున్నారా? అని ప్రశ్నించగా.. తెలుగులో పవన్ కళ్యాణ్ తో నటించలేదని, వీలైతే.. పవన్ తో నటిస్తానని హాన్సిక అన్నారు. అలాగే తెలుగులో అల్లు అర్జున్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, వారందరూ తనతో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారని చెప్పుకొచ్చారు.

ఒకవేళ అల్లు అర్జున్, హృతిక్ రోషన్ తో సినిమా అవకాశం వస్తే ఎవరి సినిమాలు నటిస్తారని ప్రశ్నించగా.. తాను ఆ ఇద్దరి హీరోస్ మూవీస్ లో నటిస్తానని, అవసరమైతే రెండు షిఫ్ట్ లలో వర్క్ చేస్తానని తెలిపారు. అనంతరం తాను నటించిన టాలీవుడ్ హీరోలకు నిక్ నేమ్ ఇచ్చారు. ఎన్టీఆర్ కు టైగర్, ప్రభాస్ ను బాహుబలి, అల్లు అర్జున్ కు ఫైర్, రామ్ పోతినేని కి ఎనర్జిటిక్, రవితేజకు మాస్ అంటూ నిక్ నేమ్స్ ఇచ్చింది. తాను ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ తో కాకుండా ఎస్ఎస్ రాజమౌళితో వర్క్ చేయాలని సమాధానం ఇచ్చారు.

More from Filmibeat

Read more about: allu arjun hansika ravi teja
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X