Hebah Patel: పల్చటి పైటలో కుమారి పరువాల జాతర.. ఎద భాగం పైకి కనిపించేలా!
గత పదేళ్ల వ్యవధిలో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా తెరంగేట్రం చేశారు. అయితే, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే మొదటి చిత్రంతోనే అందరి దృష్టినీ ఆకర్షించారు. అలాంటి వారిలో హెబ్బా పటేల్ ఒకరు.
మొదటి చిత్రంతోనే ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ భామ.. చాలా కాలం వరుసగా సినిమాలు చేసింది. మధ్యలో కాస్త వెనుకబడినా.. ఇప్పుడు మళ్లీ సత్తా చాటుతోంది. అలాగే, హెబ్బా సోషల్ మీడియాలోనూ విపరీతంగా రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని పిక్స్ వదిలింది. అవి మీకోసమే!

అలా ఎంట్రీ.. తెలుగులో ఇలా: హెబ్బా పటేల్ 2014లో వచ్చిన 'అధ్యక్ష' అనే చిత్రంతో కన్నడంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే తమిళంలోనూ ఓ మూవీలో నటించింది. ఈ క్రమంలోనే 'అలా ఎలా?' అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. అయితే, 2015లో వచ్చిన 'కుమారి 21ఎఫ్' మూవీతో ఈమెకు గుర్తింపు వచ్చింది. అలాగే ఈ బ్యూటీ ఒక్కసారిగా తెలుగు కుర్రాళ్లకు క్రష్‌గా మారింది.

వరుస చిత్రాలు చేసినా కూడా: టాలీవుల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న హెబ్బా పటేల్.. ఆ తర్వాత వరుసగా 'ఈడో రకం.. వాడో రకం', 'ఎక్కడికి పోతావు చిన్నవాడ', 'నాన్న.. నేను నా బాయ్‌ఫ్రెండ్స్', 'అంధగాడు,' 'మిస్టర్', 'ఏంజిల్', '24 కిస్సెస్', 'ఒరేయ్ బుజ్జిగా' వంటి సినిమాలు చేసింది. కానీ, సక్సెస్ ట్రాకును మాత్రం కొనసాగించలేకపోయింది.

ఆ చిత్రాలతో మళ్లీ ఫామ్‌లోకి: గతంలో మాదిరిగా ఇప్పుడు పెద్దగా అవకాశాలను సొంతం చేసుకోలేకపోతోన్న హెబ్బా పటేల్.. 'రెడ్' మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత 'ఓదెల రైల్వే స్టేషన్' అనే సినిమాలో ఎవరూ ఊహించని పాత్రను పోషించింది. ఈ చిత్రానికి మంచి స్పందన రావడంతో హెబ్బా పటేల్‌కు మళ్లీ అవకాశాలు వస్తున్నాయి. దీంతో ఈ అమ్మడు ఇప్పుడు ఫుల్ బిజీగా గడుపుతోంది.

చేతిలో ఎన్నో సినిమాలతోనే: హెబ్బా పటేల్‌కు ఈ మధ్య కాలంలో తెలుగుతో పాటు తమిళంలోనూ చాలా అవకాశాలు వస్తున్నాయి. దీంతో ఈ చిన్నది 'గీత' అనే చిత్రంతో వచ్చింది. ఇక, ఇప్పుడేమో 'శాసన సభ'లో స్పెషల్ సాంగ్ చేసింది. అలాగే, 'తెలిసినవాళ్లు' అనే మూవీలోనూ నటించింది. వీటితో పాటు తమిళంలో 'వల్లన్', 'ఆద్యా' వంటి చిత్రాలు చేస్తోంది. ఇలా ఇప్పటికీ సత్తా చాటుతోంది.
అందులో మాత్రం ఫుల్ బిజీ: తెలుగు, తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న హెబ్బా.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. తద్వారా క్రేజ్‌ను పెంచుకుంటూనే ఉంది.

గ్లామర్ ట్రీట్‌తో మైమరపిస్తూ: సోషల్ మీడియాలో హీరోయిన్ హెబ్బా పటేల్ ఎన్నో ఏళ్లుగా ఓ రేంజ్‌లో సందడి చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. దీంతో ఆమె ఏ ఫొటో షేర్ చేసినా భారీ రెస్పాన్స్ వస్తోంది.

పల్చటి పైటతో పరువాలను: హెబ్బా పటేల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె పల్చటి పైటలో పరువాల ప్రదర్శన చేసింది. దీంతో ఆమె ఎద అందాలు రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా ఆమె షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇవన్నీ చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోతోన్నాయి.


Click it and Unblock the Notifications











