Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హీరో కిస్సులు పెట్టడంపై హెబ్బా పటేల్ సంచలనం, డబ్బులిస్తే....
Recommended Video
హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ జంటగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టెనర్ '24 కిస్సెస్'. మిణుగురులు' ఫేం అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి దర్శకత్వం వహించారు. ముఖ్యంగా ముద్దు సన్నివేశాలను ఫోకస్ చేస్తూ ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ సినిమాపై యువతలో ఆసక్తిని పెంచాయి. సినిమా ప్రమోషన్లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో చిత్ర బృందం మీడియాతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా హీరోయిన్ హెబ్బా పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చాలా బోల్డ్‌గా నటించాను
‘24 కిస్సెస్' మూవీ నా జీవితంలో ఇప్పటి వరకు చేసిన పాత్రలకు పూర్తి విరుద్ధమైనది. ఇందులో నాది చాలా సింపుల్ రోల్, అదే సమయంలో చాలా బోల్డ్ గా ఉండే పాత్ర..... అని హెబ్బా పటేల్ తెలిపారు.
ఆ విషయంలో పరిణితి చెందాను
ఈ సినిమా ద్వారా నేను హీరోయిన్ నుండి నటిగా పరిణితి చెందానని అనుకుంటున్నాను. ఈ విషయంలో దర్శకుడు అయోధ్య సర్ కు థాంక్స్ చెప్పుకోవాలి... అని హెబ్బ చెప్పుకొచ్చారు.
కాన్ఫిడెన్స్ ఉండేది కాదు
ఇప్పటి వరకు నేను చేసిన ఏ సినిమాలోనూ నా పెర్ఫార్మెన్స్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. ఎప్పుడూ డౌట్ గానే ఉండేది. ఇతరులు ఏమనుకుంటారో తెలియదు కానీ ఈ సినిమాలో నా నటనపై చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉన్నాను. ఇలాంటి మంచి టీంతో కలిసి పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.
డబ్బులిస్తే ఏదైనా బానే అనిపిస్తుంది
మధ్యలో మైక్ అందుకున్న హీరో అదిత్ ‘చాలా మంది అదిత్ గుడ్ కిస్సరా? కాదా? అని అడుగుతున్నారు. దీనికి నువ్వే సమాధానం చెప్పాలి' అని కోరగా..... వెన్ యూ పేయిడ్ ఎనీథింగ్ ఈజ్ గుడ్ (డబ్బులు తీసుకుంటే ఏదైనా బాగానే ఉంటుంది)... అంటూ పంచ్ ఇచ్చింది.
24 కిస్సెస్
సిల్లీమొంక్స్ ఎంటర్టైన్మెంట్స్, రెస్పెక్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ '24 కిస్సెస్' సినిమాను నిర్మించాయి. ఈ చిత్రంలో హెబ్బా పటేల్, అరుణ్ అదిత్, అదితి మ్యాక, రావు రమేష్, నరేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డైరెక్టర్: అయోద్యకుమార్ కృష్ణం శెట్టి, నిర్మాతలు: సంజయ్ రెడ్డి, అనిల్ పల్లెల, అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి, కెమెరామెన్: ఉదయ్ గుర్రాల, మ్యూజిక్: జాయ్ బరువ, ఎడిటర్: ఆలయం అనిల్, రచయితలు: అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి, హరి శంకర్, లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, ఆర్ట్ డైరెక్టర్: హరి వర్మ.