ఒరేయ్ డాష్.. నీ పుట్టుకేందిరా? నటి హేమ ఆగ్రహం
సినీ నటి హేమ కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతారనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తన గురించి తప్పుగా మాట్లాడినా.. తప్పగా కామెంట్స్ చేసినా ఏ మాత్రం సంకోచించకుండా ఇచ్చి పడేస్తుందనేది వాస్తవం. తాజాగా పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి ఆమె ఘాటుగా స్పందించారు. అయితే తాను చేసిన వీడియోలపై కొందరు తప్పుగా కామెంట్స్ చేయడం, గతంలో తాను రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు వచ్చిన ఆరోపణలు మళ్లీ కెలకడంతో తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆమె ఏం చెప్పారనే వివరాల్లోకి వెళితే..
మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకొందామని ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరికి తెలుసు. గతంలో ఓ పార్టీకి సంబంధించి నాపై నమోదైన వివాదాస్పద కేసును కోర్టు కొట్టివేసింది. కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ విషయాన్ని ఆల్రెడీ నేను మీడియా ద్వారా షేర్ చేసుకొన్నాను. దానికి నేను ఎంత కష్టపడ్డానో మీ అందరికి తెలుసు. ఈగిల్ టీమ్ చేసిన దర్వాప్తులో నేను యూరిన్ శాంపిల్స్ కూడా ఇచ్చాను. అందులో నెగిటివ్ కూడా వచ్చిన విషయం తెలుసు అని హేమ తన వీడియోలో చెప్పింది.

ఆ కేసులో నా తప్పేమీ లేదని తేలిపోయింది. అందరూ పార్టీలకు వెళ్లినట్టుగానే నేను పార్టీలకు వెళ్లాను. అక్కడే ఏం జరిగిందో నాకు తెలియదు అనే విషయం గురించి నేను ముందే చెప్పాను. అయినా కొందరు డాష్‌లు రేవ్ పార్టీలకు వెళ్లలేదా? డ్రగ్స్ తీసుకోవడం లేదా? అని పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడుతున్నారు. అవి కూడా ఫేక్ అకౌంట్ల నుంచి పోస్టు చేస్తున్నారు అని హేమ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాపై ఫేక్ అకౌంట్ల ద్వారా ట్రోల్ చేస్తున్న వాళ్ల పుట్టుక ఏంటో? వాళ్ల తల్లిదండ్రులు ఏంటో అని అనకూడదని నేను అనుకోవడం లేదు. కానీ ఇంకోసారి నేను ఏదైనా పోస్ట్ చేసిన వీడియో కింద గానీ, మెసేజ్ కింద గానీ, ఫోటో కింద గానీ కామెంట్స్ పెట్టేటప్పడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. నాపై చెడుగా కామెంట్స్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకొంటాను. ఫేక్ అకౌంట్లు ఎలా పట్టుకొంటారని మీరు అనుకొని ఉంటారు. కానీ పోలీసులు, సైబర్ క్రైమ్ వాళ్లు చాలా డెవలప్ అయ్యారు. చట్టం తన పని తాను చేసుకొంటూ వెళ్తున్నది. నా జోలికి వస్తే.. డైరెక్టుగా మీ ఇంటికి వచ్చి కూర్చొంటాను. లీగల్ చర్యలు తీసుకొంటాను. ఇది వార్నింగ్ అనుకొంటారా? రిక్వెస్ట్ అనుకొంటారా? అది మీ ఇష్టం. థ్యాంక్యూ అంటూ హేమ ఘాటుగా స్పందించారు.
కొన్నేళ్ల నెలల క్రితం బెంగళూరులో జరిగిన ఓ పార్టీలో హేమ అరెస్ట్ అయ్యారనే విషయం సంచలనం రేపింది. ఆ పార్టీలో డ్రగ్స్, నిషేధిత మాధక ద్రవాలు ఉపయోగించినట్టు వార్తలు వచ్చాయి. ఆ క్రమంలో ఆమెపై కేసు నమోదు చేశారు. ఆ కేసు వ్యవహారంలో కోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ తర్వాత కూడా ఆమెపై రకరకాలుగా ట్రోల్ చేయడంతో ఆమె తాజాగా
వీడియోతో వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది.


Click it and Unblock the Notifications

