Hema: కూతురు పెళ్లిపై నటి హేమ క్లారిటీ.. స్టార్ హీరో ఇంటి కోడలు కాబోతుందా?

టాలీవుడ్ సీనియర్ నటి హేమ (Hema) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన హేమ, ఇటీవల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలపై స్పష్టత ఇవ్వడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ముఖ్యంగా ఆమె కూతురు ఈషా పెళ్లి గురించి వస్తున్న రూమర్స్‌కు ఆమె ఇచ్చిన క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే?

తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 500కి పైగా చిత్రాల్లో నటించిన హేమ... ఒకప్పుడు టాలీవుడ్‌లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్. స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించిన ఆమె, గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో బెంగళూరు రేవ్ పార్టీ, డ్రగ్స్ కేసు వార్తలు రావడంతో హేమ పేరు ఎక్కువగా చర్చకు వచ్చింది. ఈ వ్యవహారాల తర్వాత ఆమె మీడియాకు కూడా కొంత దూరంగా ఉంటూ వచ్చారు.

Actress Hema Clarifies Daughter Isha s Marriage Rumours

ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఓ ఇంటర్వ్యూలో హేమ తన కూతురు ఈషా పెళ్లి గురించి వస్తున్న ప్రచారాలపై స్పందించారు. 'మా అమ్మాయి వయసు ఇంకా 23 సంవత్సరాలే. ఇప్పుడే పెళ్లి గురించి ఎలాంటి ఆలోచన లేదు. మా కాలంలో 19-20 ఏళ్లకే పెళ్లిళ్లు చేసేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. 25-26 వచ్చిన తర్వాతే పెళ్లి సంబంధాలు చూస్తా' అంటూ స్పష్టంగా చెప్పేశారు. దీంతో 'స్టార్ హీరో ఇంటి కోడలు కాబోతోంది' అనే రూమర్స్‌కు ఫుల్ స్టాప్ పడినట్టయింది.

ఇండస్ట్రీలోనే పెళ్లి చేస్తారా లేక బయట వ్యక్తికే ఇస్తారా అన్న ప్రశ్నకు కూడా హేమ చాలా క్లియర్‌గా సమాధానం చెప్పారు. 'నాకు అలాంటి కండిషన్స్ ఏమీ లేవు. ఎవరైనా అమ్మాయిని బాగా చూసుకుంటారు, మంచి మనిషి అనే నమ్మకం ఉంటే చాలు' అని అన్నారు. ప్రస్తుతం తన కూతురు ఈషా జాబ్ చేస్తోందని, నిజానికి బిజినెస్ చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ... జీవితాన్ని అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో తానే జాబ్ చేయమని చెప్పినట్టు వెల్లడించారు. ఒక బాస్ ఎలా ఆలోచిస్తాడు, ఒక ఎంప్లాయీ ఎలా ఫీల్ అవుతాడు అనే విషయాలు తెలుసుకోవడం బిజినెస్‌కు చాలా అవసరమని చెప్పారు.

ఇంకా, తన కూతురు చాలా సింపుల్‌గా ఉంటుందని, రోజూ ఆటోలోనే ఆఫీస్‌కు వెళ్తుందని హేమ చెప్పారు. ఇంటి పనుల్లోనూ ఎంతో చురుకుగా ఉంటుందని, తాను షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పుడు ఈషానే వంట చేసి పంపించేదని చెప్పుకొచ్చారు. ఈ మాటలు వింటే, హేమ కూతురిని ఎంత డౌన్‌టు-ఎర్త్‌గా పెంచారో అర్థమవుతోంది.

ఇక తన కెరీర్ విషయానికి వస్తే... ఇప్పటికీ నటనపై తనకు పూర్తి ఆసక్తి ఉందని హేమ స్పష్టం చేశారు. 'ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి సిద్ధం. సీరియస్ పాత్రలు చేశాను, చెప్పులు కొట్టుకునే క్యారెక్టర్లు చేశాను, అడుక్కునే పాత్రలు కూడా చేశాను. విలన్ లేదా వ్యాంప్ క్యారెక్టర్లు మాత్రమే చేయలేదు. అవకాశం వస్తే అవి కూడా చేస్తాను' అంటూ తన ఆత్మవిశ్వాసాన్ని చాటుకున్నారు.

ఇప్పటివరకు తాను ఎవరినీ ప్రత్యేకంగా క్యారెక్టర్ కోసం అడగలేదని, ఇకపై మాత్రం ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లకు కాల్ చేసి అవకాశాలు అడుగుతానని చెప్పారు. ఇలా తన కూతురు పెళ్లి విషయంలో స్పష్టత, కెరీర్‌పై పాజిటివ్ దృక్పథం, జీవితాన్ని సింపుల్‌గా చూసే ఆలోచనలతో హేమ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X