దాసరిగారు బతికుంటే నా జీవితం అలా... నటి హేమ ఎమోషనల్

అమ్మ, అక్క, వదిన, పిన్ని, అత్త పాత్రలతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు నటి హేమ. కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నవ్వులు పూయించడంతో పాటు సెంటిమెంట్‌ను కూడా అద్భుతంగా పండించగలనని హేమ నిరూపించుకున్నారు. సినిమాలతో పాటు బుల్లితెరపై పలు సీరియల్స్‌తో పాటు బిగ్‌బాస్ వంటి మెగా షోలో కంటెస్టెంట్‌గా పాల్గొని సత్తా చాటింది హేమ. తాజాగా దర్శకరత్న దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా హేమ ఎమోషనల్ అయ్యారు. ఈ వివరాల్లోకి వెళితే..

లెజెండరీ డైరెక్టర్‌గా, తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా వెలుగొందిన దాసరి నారాయణ రావు సమాధి దుస్ధితిపై సోషల్ మీడియాలో వార్తలు రావడం కలకలం రేపింది. ఇది కాస్తా హీరో మంచు మనోజ్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆగమేఘాల మీద స్పందించారు. తన అభిమానులు, సిబ్బందితో పాటు స్వయంగా దాసరి సమాధి ప్రాంగణంలో ఉన్న చెత్తను శుభ్రం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Actress Hema Gets Emotional at Dasari Narayana Rao Memorial Shares Political and Career Aspirations

మనోజ్ అక్కడికి వెళ్లిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టడంతో పలువురు సినీ ప్రముఖులు కూడా దాసరి సమాధి వద్దకు చేరుకుని దర్శకరత్నకు నివాళులు అర్పించారు. అలాగే అక్కడి పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నటి హేమ సైతం దాసరి సమాధి వద్దకు చేరుకుని ఆయన విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం నటి హేమ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈరోజు గురువుగారి వర్ధంతి అని నాకు మైండ్‌లో కూడా లేదు. అయితే నేనొక వీడియో చూడగానే అయ్యో ఏంటీ ఇలా ఉందా అని చెప్పి భయపడి కాల్ చేసి లోకేషన్స్ అవి పెట్టించుకుని, నాతో పాటు ఒక నలుగురు మనుషుల్ని ఎక్కించుకుని పరిగెత్తుకుని వచ్చాని హేమ తెలిపారు.

గురువుగారు ఏంటంటే .. ఇవాళ నా వర్ధంతి అందరూ మరిచిపోయారా అని ఆయనే మాకు గుర్తుచేసినట్లుగా అయ్యింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి నేను భయపడుతూ వచ్చాను. ఎలా ఏం చేయాలి? అని మనుషుల్ని మాట్లాడుకుని వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చి చూసేసరికి చాలా బాగా శుభ్రం చేశారు. గురువుగారు మా చేత పని చేయించుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఆయన బతికుంటే నా లైఫ్ మరోలా ఉండేది.. ఆయన చనిపోయిన తర్వాత కూడా మాకు అందరికీ గుర్తుచేసి ఇక్కడికి వచ్చేలా చేశారు. ఈరోజు నుంచి నేను సినిమాలలో బిజీగా ఉండాలి.. మంచి రాజకీయ నాయకురాలిగా అవ్వాలని నన్ను ఆశీర్వదించండి అని హేమ ప్రార్ధించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సినిమాలలో, రాజకీయాలలో ఎదగాలని ఆమె కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.

వందలాది సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన హేమకు ఇటీవలి కాలంలో ఆఫర్లు తగ్గిపోయాయి. హీరోయిన్లే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారి అమ్మ, అక్క, వదిన, పిన్ని, అత్త పాత్రలు వేస్తుండటం కూడా దీనికి ఒక కారణం. అలాగే పలు వివాదాల్లో ఆమె పేరు తెరపైకి రావడం కూడా కలకలం రేపింది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన కొత్తలో మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరిన హేమ.. తూర్పుగోదావరి జిల్లా మండపేట నుంచి పోటీ చేసి దారుణ పరాజయాన్ని మూటకట్టుకున్నారు. ఆ తర్వాత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరి కొన్నాళ్లు ఆ పార్టీలో యాక్టీవ్‌గా ఉన్నారు. ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలకు దూరంగా కుటుంబంతో, స్నేహితులతో గడుపుతున్న హేమ.. దాసరి వర్ధంతి సందర్భంగా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X