పైట తొలగించి పరువాలు చూపిస్తావా? హేమమాలినికి చేదు అనుభవం

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డ్రీమ్ గర్ల్ హేమామాలిని ఇప్పటికీ గ్లామర్ విషయంలో యంగ్ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గేదిలేదని సిగ్నల్స్ ఇస్తుంది. దాదాపు 7 పదులు వయసులో కూడా చెక్కు చెదరని అందాలు, శారీరాకృతితో అభిమానులను ఆకట్టుకొంటున్నారు. ఓసారి షూటింగులో ఓ దర్శకుడు తనతో ప్రవర్తించిన విధానాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకొన్నారు. హేమామాలిని చెప్పిన విషయాలు, ఆమె వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాల్లోకి వెళితే..

హేమమాలిని కెరీర్ విషయానికి వస్తే.. 1968 సంవత్సరంలో సప్నోంకి సౌదాఘర్ మూవీతో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత డ్రీమ్ గర్ల్ సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొన్నారు. డ్రీమ్ గర్ల్ నుంచి ఇప్పటి వరకు కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పటికీ సినిమాలు, వ్యాపార ప్రకటనల్లో నటిస్తూ ఆకట్టుకొంటున్నారు.

Actress Hema Malini Throwback Story: Dream Girl reveals Director Weird Attitude

లెజెండరీ డైరెక్టర్ స్వర్గీయ రాజ్‌ కపూర్‌తో తనకు మంచి అనుబంధం ఉండేది. ఆయన నాకు సత్యం శివం సుందరం సినిమాలో జీనత్ ఆమన్ పాత్రను నాకు ముందుగా ఆఫర్ చేశారు. రాజ్ కపూర్ నాతో మాట్లాడుతూ.. ఇది గొప్ప సినిమా కాబోతున్నది. ఆ పాత్రను నీవు చేయవు. కానీ నీవు చేస్తే బాగుంటుందని చెప్పారు అని హేమమాలిని చెప్పారు. ఆ తర్వాత జీనత్‌కు మంచి పేరు మాత్రమే కాకుండా ఫిల్మ్ ఫేర్ అవార్డకు కూడా నామినేట్ అయ్యేలా చేసింది.

లెజెండరీ హీరో ధర్మేంద్రతో చాలా సినిమాల్లో హేమమాలిని నటించింది. వారిద్దరి కెమిస్ట్రీకి అద్బుతమైన ఫాలోయింగ్ అభిమానుల్లో ఉండేది. వారిద్దరు నటించిన షోలే, సీతా ఔర్ గీత, డ్రీమ్ గర్ల్, ది బర్నింగ్ ట్రైన్, రజియా సుల్తానా లాంటి చిత్రాల్లో వారిద్దరూ నటించారు. ఆ క్రమంలో వారిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం తెలిసిందే.

ఓ బాలీవుడ్ సినిమా షూటింగు సందర్భంగా ఓ రొమాంటిక్ సీన్‌లో నటించాల్సింది. అయితే నాకు చీర పైట జారి పోకుండా పిన్ పెట్టుకొనే దానిని. అయితే ఆ పిన్ తీసేసి.. పైట కిందికి జార్చండి. నాకు అలా నీ ఎద సంపద చూపించాలనే నా కోరిక అని దర్శకుడు చెప్పాడు. అయితే ఆ సీన్‌లో అలా నటించడానికి ఒప్పుకోలేదు. ప్రస్తుతం సినిమా మేకింగ్ చాలా డిఫరెంట్‌గా ఉంది. అందుకే నేను నటించడం లేదు అని హేమ మాలిని చెప్పారు.

సీనియర్ నటి హేమ మాలిని కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల రాజ్‌కుమార్ రావు, రకుల్ ప్రీత్ సింగ్‌ నటించిన సిమ్లా మిర్చి అనే సినిమాలో నటించింది. కొన్ని కారణాల వల్ల చాలా ఆలస్యంగా రిలీజైంది. ఆమె సినిమా పరిశ్రమలోనే కాకుండా రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. మధుర నియోజకవర్గం నుంచి ఆమె ఎంపీగా పోటీ చేసి లోక్‌సభ సభ్యురాలిగా పనిచేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X