‘రక్తం కారుతున్నా నాతో ఆ సీన్... హీరో, హీరోయిన్లవే ప్రాణాలా’

ఒకప్పుడు అమ్మ, అక్క, అత్త, వదిన పాత్రలతో క్షణం కూడా తీరిక లేకుండా గడిపారు నటి హేమ. అయితే ఇటీవలి కాలంలో ఇలాంటి పాత్రలన్నీ హీరోయిన్లే వేస్తుండటంతో హేమ లాంటి వారికి అవకాశాలు తగ్గిపోతున్నాయి. కామెడీతో పాటు సెంటిమెంట్ కూడా అలవోకగా పండించగలనని నిరూపించుకున్న హేమ.. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. సినిమాలతో పాటు వివాదాలతోనూ వార్తల్లో నిలిచే హేమ.. మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా సరే తగ్గేదేలేదు అన్నట్లుగా డోంట్ కేర్ అంటారు

సినిమాలతో పాటు బుల్లితెరపైనా బిగ్‌బాస్‌లోనూ ఎంట్రీ ఇచ్చి అక్కడా సత్తా చాటారు. కొద్దినెలల క్రితం బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ పేరు తెరపైకి రాగా.. ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత హేమకు కోర్ట్ క్లీన్ చీట్ ఇవ్వడంతో నిర్దోషిగా బయటికొచ్చారు. సినిమాలలో అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో హేమ గతంలో మాదిరిగా కనిపించడం లేదు. ఇటీవల దర్శకరత్న దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద నివాళులర్పించిన హేమ.. తాను తిరిగి సినిమాలలో బిజీ కావాలని, రాజకీయంగా ఎదగాలని గురువుగారిని ప్రార్ధించారు. కొద్దిరోజుల క్రితం అలీతో సరదాగా షోకు గెస్ట్‌గా వచ్చిన హేమ.. ఓ షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనను పంచుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

Actress Hema Reveals Painful Incident From Julayi Shoot Talks About Struggles of Supporting Actors

మా ఆయన నన్ను ఫస్ట్ చూడగానే తన హైట్‌కు నా హైట్ సెట్ అవుతుందని పెళ్లి చేసుకుంటావా? అని అడిగారు. ఆ ఒక్క మాట నచ్చి పెళ్లి చేసుకున్నాం. పెళ్లయిన తర్వాత కూడా నేను నటిస్తూనే ఉన్నాను. ఇండస్ట్రీలో నాకు ఎప్పుడూ వేధింపులు ఎదురుకాలేదు. అయినా పోయి పోయి కొరివితో తలగొక్కుంటారా? నన్ను ఎవరైనా గోకేంత ధైర్యం ఎవరికీ లేదు. అవతలివాడు క్యారెక్టర్ లేనివాడైతేనే మనల్ని ఏదైనా చేస్తాడు. నా దగ్గర ఎవరూ గోకరంటే వాళ్లంతా క్యారెక్టర్ ఉన్నవాళ్లేనని ఎందుకు అర్ధం చేసుకోకూడదని హేమ ప్రశ్నించారు.

ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏడ్చిన సందర్బాలు ఏమైనా ఉన్నాయా అని అలీ ప్రశ్నించగా.. కొంచెం ఒక చిన్నబాధ ఉంది. అల్లు అర్జున్ గారు నటించిన జులాయిలో నేను కూడా నటించా. ఓ సీన్‌లో బన్నీ బుల్లెట్ పేల్చగానే నేను వెళ్లి గోడ మీద కూర్చుంటా. అప్పటి వరకు గయ్యాళీగా ఉన్న నేను గన్ సౌండ్‌కి పారిపోతాను. ఆ షాట్‌లో గన్ పేల్చగానే అందరూ ఫ్రీజ్ అయిపోతారు. నేను గబగబా పరిగెత్తుకుని వెళ్లి గోడపైన కూర్చోవాలి. మన సెట్ వాళ్లు హీరో హీరోయిన్స్ అంటే స్టూల్స్ అన్నీ రెడీ చేసి పెడతారు. మనం అనేసరికి పట్టించుకోరు కదా? ఆ ఇంట్లో ఉన్న ఒక ప్లాస్టిక్ బకెట్‌ను తిరగేసి ఎక్కేయమన్నాడు. నేను ప్లాస్టిక్ బకెట్ మీద కాలు వేయగానే కాలు మొత్తం బకెట్‌లోకి వెళ్లి చీరుకుపోయి రక్తం కారుతోంది.

అది ఎవ్వరికీ పట్టలేదు. అయినప్పటికీ అందరూ చేతులు పట్టుకుని ఒకడు ఒంగుంటే గోడ మీదకి ఎక్కేసి షాట్ చేసి దిగిపోయాను. ఆ తర్వాత కూడా ఒక్కరూ పట్టించుకోలేదు. అసలు ఆ ఫీలింగ్ కూడా ఎవరికీ లేదు. అక్కడ హీరోయిన్ ఉండుంటే ఎంత గోల ఉండేదో. ఆ టైంలో మాత్రం చాలా బాధపడ్డా. కానీ ఇండస్ట్రీ అంటే ఇంతే అనుకుని లైట్ తీసుకున్నానని హేమ పేర్కొన్నారు. ప్రస్తుతం హేమ పాత వీడియో వైరల్ అవుతుండగా.. ఇండస్ట్రీలో చిన్న నటీనటులపై వివక్షపై నెటిజన్లు ఘాటుగా కామెంట్స్ పెడుతున్నారు.

Read more about: actress hema allu arjun trivikram
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X