సినిమా అవకాశాలు లేకపోతే.. ఆ పని చేసుకుంటూ బతుకుతా..

టాలీవుడ్‌లో తన ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సీనియర్ నటి హేమ. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానీ, కమెడియన్‌గానీ ఎటువంటి పాత్రైనా ఆమె తనదైన శైలిలో మెప్పిస్తుంది. పలు చిత్రాల్లో కనిపిస్తూ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నది. తెరపై ఎంత నేచురల్‌గా కనిపిస్తుందో, నిజజీవితంలో కూడా అంతే నిజాయితీగా మాట్లాడే యాక్టర్ హేమ... తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జీవితం, కెరీర్, సమాజంపై ఉన్న అభిప్రాయాలను ఏమాత్రం మొహమాటం లేకుండా వెల్లడించారు.తాజాగా తన కెరీర్ లో ఎదుర్కున్న కొన్ని ఇబ్బందుల గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఇంతకీ ఏమన్నారంటే.. ?

రాజోలు నుంచి టాలీవుడ్ వరకు
హేమ మాట్లాడుతూ తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. 'నేను పుట్టింది రాజోలు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. అదే మైండ్‌సెట్‌తో ఇండస్ట్రీకి అడుగుపెట్టాను'అని చెప్పారు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ, వాటిని ధైర్యంగా తట్టుకొని ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. 'ఈ రోజు నేను నిలబడ్డ చోటు సులభంగా రాలేదు. చాలా కష్టాలు, అవమానాలు, నిరాకరణలు ఎదురయ్యాయి'అని ఆమె భావోద్వేగంగా చెప్పారు.

Hema Says She d Run a Dosa Stall Than Bow Down Actress Responds to Property Rumours

'ఎవరికి తలవంచను'
తనపై కొందరు కావాలని వ్యాఖ్యలు చేస్తుంటారని హేమ పేర్కొన్నారు. 'నాకు ఎన్ని కోట్ల ఆస్తి ఉందో అంటూ అర్థంలేని మాటలు మాట్లాడతారు. కానీ నేను ఎప్పుడూ ఎవరికీ తలవంచలేదు. నాకు నచ్చితే చేస్తాను... నచ్చకపోతే ముఖం మీదే 'లేదు' అని చెప్పేస్తాను' అంటూ తన స్వభావాన్ని వివరించారు. అంతేకాదు, జీవనాధారం గురించి మాట్లాడుతూ, 'రేపు సినిమాలు లేకపోయినా, అవకాశాలు రాకపోయినా... ఒక దోశల బండి పెట్టుకుని బతికేస్తాను. అది నా సత్తా. కానీ ఎవరికి మాత్రం తలవంచను'అంటూ తన ఆత్మవిశ్వాసాన్ని చాటారు.

సమాజంపై షాకింగ్ కామెంట్స్
సమాజపు పోకడలపై కూడా హేమ ఘాటుగా స్పందించారు. 'మనకు కష్టం వచ్చేదాకా అందరూ బాగానే ఉంటారు. సహాయం అడిగిన వెంటనే చాలా మంది దూరం పెడతారు' అని అన్నారు. అయితే తాను ఎప్పుడూ ఇతరుల దగ్గరికి వెళ్లి సహాయం అడిగిన సందర్భాలు లేవని స్పష్టం చేశారు. 'చాతనైనంత వరకు నేనే ఇతరులకు సహాయం చేస్తాను. లేకపోతే సైలెంట్‌గా ఉంటాను. గొప్పల కోసం ఖర్చులు పెట్టి, తోపు తురుము అని చెప్పుకోను'అంటూ తన తత్వాన్ని వివరించారు. అలాగే, 'ఒకరిని చూసి ఒకరు వాతలు పెట్టుకుని గొప్పలకు పోతే... అక్కడినుంచే పతనం మొదలవుతుంది' అనే వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ఇండస్ట్రీలో తనకున్న ఆత్మీయత గురించి కూడా హేమ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఎక్కడైనా శుభకార్యాలు జరిగితే నన్ను ముందుంచుతారు. నాకు ఆ గౌరవం దక్కడం నా అదృష్టం' అని చెప్పారు. కొంతమంది ఆర్టిస్టులు తనను ఆడపడుచులా భావిస్తారని, తనతో పని చేస్తే మంచి జరుగుతుందని నమ్మే వారు చాలామందే ఉన్నారని వెల్లడించారు. అలాగే.. తనకు చాలా సెంటిమెంట్స్ ఉన్నాయనీ, ఆ సెంటిమెంట్స్ వారికి కూడా నచ్చి పాటిస్తారని వెల్లడించింది. నటి హేమ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి.

More from Filmibeat

Read more about: actress hema tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X